కట్లపాము ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది... | - | Sakshi
Sakshi News home page

కట్లపాము ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది...

Published Mon, Jul 31 2023 6:38 AM | Last Updated on Mon, Jul 31 2023 8:24 PM

- - Sakshi

సంగారెడ్డి: పొలంగట్లు, కాలువగట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చిమొక్కలతో నిండిన పొదలు, గడ్డి వాములు, పాడుబడ్డ ఇళ్లు, గృహాల ఎదుట పేర్చిన కట్టెలు, పెంటకుప్పల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం బయటకొచ్చి ఎలుకలు, బల్లులు, తొండలు, పక్షులను తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు అక్కడ తిష్ట వేస్తాయి.

పాములకు శరీరం కింది భాగంలో ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్దం గ్రహిస్తాయి. వేడిరక్తం ప్రసవించే, జంతువులు, మనుషులు సమిపిస్తే వెంటనే గుర్తిస్తాయి. కదులుతున్న ప్రాణులను గుర్తించి కాటేస్తాయి. నాగుపాము, కట్ల పాము, రక్తపింజర తదితర పాములు విషపూరితమైనవి.

వీటి కాటుకు గురైనా బాధితులకు వెంటనే వైద్యమందక ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా పంట పొలాలు, కాలువల్లో తిరిగే పాములు చాలా వరకు విషపూరితమైనవి కావు. సర్పాలకు ప్రాణభయం ఉన్నప్పుడు ఏకాంతానికి భంగం వాటిల్లినప్పుడు, ఎవరైనా తొక్కినప్పుడు, వేటాడేటప్పుడు కాటేస్తాయి.

అన్ని ప్రమాదం కాదు..
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు. కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతుల్లోనే ప్రమాదముంటోంది. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం, ప్రమాదంలేని మాములు గాయాలే. చికిత్స తీసుకుంటే నయమవుతాయి.

పాముల కన్నా చాలా మంది షాక్‌తో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో వారు. ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పడానికి బదులుగా ఏడుపులు ప్రారంభిస్తే బాధితులు భయాంతోళనకు గురైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతోంది.

పాములు వాటి విషప్రభావం
కట్లపాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి.

 నాగుపాము: ఇది కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతోంది. 

రక్తపింజర: ఇది కాటేసిన 2 గంటల తర్వాత విషం ఎక్కుతోంది. 

జెర్రిపోతు, నీరుకట్ట: ఇవి కాటేసిన విషం ఉండదు. కాటు వేసిన చోట చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లడం ఉత్తమం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రాత్రివేళల్లో తిరిగేవాళ్లు, అక్కడే నిద్రించేవాళ్లు టార్చ్‌లైట్‌ను వెంట తీసుకుపోవాలి. పాములు చేరడానికి అవకాశం లేకుండా పరిసరాలు ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి. పెట్రోల్‌, కిరోసిన్‌, వెల్లుల్లి, ఇంగువ వాసనలను భరించలేవు. పాములు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే సమయానుకూలంగా వీటిని ఉపయోగించుకోవాలి.

రాత్రి వేళల్లో పొలాల గట్లపై, గడ్డివాముల్లో తిరిగే రైతులు, కూలీలు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు ధరించాలి. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు పరిసరాలల్లో పిచ్చిమొక్కలు, పొదలు ఉండకుండా చూసుకోవాలి.

సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి
పాముకాటుకు గురై వ్యక్తి ఆందోళన చెందొద్దు. పక్కవారు బాధితుడికి ధైర్యం చెబుతుండాలి. పాముకాటేసిన పైభాగంలో వెంటనే తాడు, గుడ్డతో బిగుతుగా కట్టాలి. కాటేసిన చోట బ్లేడు గాయం చేసి రక్తం కారనివ్వాలి. నోటిలో పుండ్లు, గాట్లు లేకుంటే రక్తం పీల్చి ఉమ్మివేయాలి.

పాముకాటుకు గురైనా వ్యక్తిని నడిపించడం, పరిగెత్తించడం చేయొద్దు. నాటువైద్యం పేరిట పసర్లు, వేర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. – డాక్టర్‌ శాలిని, పీహెచ్‌సీ టేక్మాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement