Khammam Boy Says Iam God, Build Me A Temple Under Block Along The Road - Sakshi
Sakshi News home page

నేను దేవుడిని.. గుడి కట్టించండి! రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను

Published Fri, Jul 21 2023 12:35 PM | Last Updated on Fri, Jul 21 2023 6:25 PM

I Am The God.. Build A Temple.. - Sakshi

ఖమ్మం: నేను దేవుడిని... నాకు గుడి కట్టించండి... రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను అంటూ ఓ బాలుడు పూనకంతో చెప్పడం, ఆయన ఓ పార్టీకి చెందిన దిమ్మెను అర్ధరాత్రి పగలగొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో నేలకొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలుడు బుధవారం అర్ధరాత్రి పూనకంతో ఊగిపోతూ ఓ పార్టీ నిర్మించిన దిమ్మె కింద వెలిసినందున గుడి కట్టాలని చెప్పాడు.

దీంతో కుటుంబీకులు దిమ్మె పగలగొట్టి పసుపు, కుంకుమ చల్లుతుండగా స్థానికులు అడ్డగించారు. ఇలా గొడవ పెరగడంతో బాలుడి కుటుంబం ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈమేరకు గురువారం ఉదయం గ్రామపెద్దలు, స్థానికులు కలిసి వారిని నిలదీయగా వివాదం ముదురుతుండడంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాలకు చెదరగొట్టారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement