ఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక మండలంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతే పద్మాపురం గ్రామ సమీపంలో జరిగింది. పద్మాపురం సమీపంలోని ఓ మూల మలుపు వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని భద్రాచలం ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(పినపాక)
రెండు బైకులు ఢీ : ఇద్దరి మృతి
Published Sat, Mar 21 2015 11:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement