
సాక్షి, హైదరాబాద్ : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ.50లక్షల నగదును పోలీసులు సీజ్‌చేశారు. సర్వే ప్రధాన అనుచరుడు గాలి బాలాజీ వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.50లక్షలు, ప్రచార సామాగ్రిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సర్వే సత్యనారాయణ కోసం తీసుకెళ్తుండగా.. నాంపల్లి వద్ద పట్టుకున్నారు. సర్వే ఆదేశాల మేరకు బేగంబజార్‌లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి రూ. 50లక్షలు గాలి బాలాజీ తీసుకున్నట్లు సమాచారం.
మరో చోట రూ.40లక్షలు పట్టివేత!
గచ్చిబౌలి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.40లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదు టీడీపీకి చెందిన ఓ నేతవిగా పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment