seized money
-
Cryptocurrency: నకిలీ క్రిప్టో యాప్స్ దందా.. రూ.17 కోట్లు సీజ్
బనశంకరి: ప్రజల అమాయకత్వం, ఆశను అనువుగా చేసుకుని కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన ముఠా చివరకు కటకటాల పాలైంది. త్వరగా సంపన్నులు కావచ్చని వీరిని నమ్మిన వేలాది మందికి కడగండ్లే మిగిలాయి. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు బడా నేరగాళ్లను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.17 కోట్ల నగదు, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. సోమవారం జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్గుప్తాతో కలిసి కమల్‌పంత్ మీడియాతో మాట్లాడారు. నకిలీ యాప్‌ల ద్వారా దందా.. రమేశ్ ఉల్లాఖాన్, శీతల్ బస్త్వాడ్, ఇమ్రాన్ రియాజ్, జబీఉల్లాఖాన్ అనే నలుగురు 2021లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రిప్టో కరెన్సీ లాభాలతో పాటు క్రిప్టో మైనింగ్ యంత్రం ఇస్తామని ప్రజలకు వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా సంప్రదించేవారు. వీరందరూ కూడా కర్ణాటకకు చెందినవారే. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా షేర్ హ్యాశ్ అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోమనేవారు. దాని ద్వారా ప్రజల నుంచి నగదును పెట్టుబడి పెట్టించేవారు. తరువాత ఆ డబ్బును వివిధ నకిలీ కంపెనీల ఖాతాలకు మళ్లించేవారు. 2022 జనవరిలో షేర్‌హ్యాశ్ యాప్‌లో ఖాతాదారులకు లాగిన్ లోపం తలెత్తిందని తెలిపారు. దీంతో షేర్‌హ్యాశ్ 2.0 యాప్‌ను మదుపుదారులతో డౌన్లోడ్ చేయించారు. ఆ యాప్ కూడా పనిచేయలేదు. కంపెనీ సిబ్బందిని సంప్రదిస్తే సమాధానం రాలేదు. దీంతో తమ డబ్బు ఇరుక్కుపోవడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న సుమారు రూ.17 కోట్లను సీజ్ చేశారు. 1.6 కేజీల బంగారు నగలు, రూ.70 లక్షల నగదును, కొన్ని మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీసీపీ శరణప్ప పాల్గొన్నారు. ఇది చదవండి: కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం -
కారులో తరలిస్తున్న రూ. 65 లక్షలు స్వాధీనం
బెంగళూరు : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 65 లక్షల నగదును బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్‌కు చెందిన దస్తగిరి (41), కిరణ్‌కుమార్ (30), మస్తాన్ (30)అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఆర్టీ స్ట్రీట్ రంగస్వామి ఆలయం వద్ద ఓ కారు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. దీంతో ఐదు వందల నోట్లతో కూడిన 18 బండిళ్లు, రెండు వేల నోట్లతో కూడిన రెండు బండిళ్లు బయటపడ్డాయి. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై స్పష్టమైన సరైన సమాధానం ఇవ్వలేదు. (హలో.. మేము ఏసీబీ! ) -
పోలీసుల తనిఖీలు.. రూ.31.50 లక్షలు స్వాధీనం
సాక్షి, విజయవాడ : వన్‌టౌన్ మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఓ యువకుడు వెనక్కి పారిపోయేందుకు ప్రయత్నించాడు. యువకుడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.31.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయపై ఆదాయపు పన్నుశాఖ, జీఎస్టీ అధికారులకు వన్‌టౌన్ పోలీసులు సమాచారం ఇచ్చారు. పట్టుబడ్డ డబ్బు ఓ లారీ ట్రాన్స్పోర్ట్కు చెందినదని యువకుడు పోలీసులకు తెలిపాడు. (ఏలూరులో ‘లాక్డౌన్’ దుమారం..) అదే విధంగా విజయవాడలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన రూ.20లక్షల విలువైన మద్యం పట్టుబడింది. అక్రమ మద్యాన్ని కంకిపాడు మంతిన గ్రామంలోని గడ్డివాములో దాచగా, దీనికి సంబంధించి నలుగురిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు విజయవాడలో భారీగా గుట్కా, గంజాయి పట్టిబడింది. కృష్ణలంకలో రూ.25లక్షల విలువైన గుట్కాలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై ఆరుగురు అరెస్టు చేసి.. రెండు కార్లు, మినీ వ్యాన్‌ను సీజ్ చేశారు. (గర్భిణి ఏనుగు మృతి: వెలుగులోకి కొత్త విషయం) -
నారాయణగూడలో రూ.8 కోట్లు స్వాధీనం
-
బీజేపీకి చెందిన రూ.8 కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) చెందిన భారీ మొత్తాన్ని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జారీ చేసిన సెల్ఫ్ చెక్ ద్వారా డ్రా అయిన రూ.8 కోట్లును టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి అంగీకరించిన బ్యాంకు మేనేజర్‌ను సైతం ప్రశ్నిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులూ దృష్టి పెట్టారు. ఈ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకోవడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి నగదు అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు డేగకన్ను వేసి ఉంచారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ, పక్కా సమాచారం ఆధారంగా దాడులు చేసి నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం వరుసగా బ్యాంకులకు సెలవు రావడంతో సోమవారం భారీ స్థాయిలో లావాదేవీలు జరిగే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసుల అనుమానించారు. దీంతో నగరంలోని అనేక బ్యాంకుల వద్ద మాటు వేసి అక్కడ జరిగే లావాదేవీలను డేగ కంటితో పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ వెర్నా కారు (ఏపీ 10 బీఈ 1234) నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు డబ్బుతో వెళ్తున్నట్లు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేసింది. అందులో ఉన్న రూ.2 కోట్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని తోతిరెడ్డి ప్రదీప్‌రెడ్డితో పాటు కారు డ్రైవర్ గుండు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్‌రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ డబ్బును తనకు నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ వద్ద నందిరాజు గోపి అనే వ్యక్తి అప్పగించినట్లు బయటపెట్టారు. అతడి వద్ద మరికొంత మొత్తం ఉందనీ వెల్లడించాడు. దీంతో సదరు బ్యాంక్ వద్దకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో రూ.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నందిరాజు గోపీతో పాటు జి.సుకుమార్‌రెడ్డి, ఎస్.చలపతిరాజు, జె.ఇందు శేఖర్‌రావు ఆర్.బ్రహ్మంలను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నందిరాజు గోపి, ఎస్ చలపతిరావును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు బయటపడింది. మిగిలిన ఐదుగురిలో ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్, వ్యాపారులు ఉన్నారు. గోపి, చలపతిరావుల్ని ప్రశ్నించిన పోలీసులు వారి వద్ద ఉన్న రూ.8 కోట్ల చెక్కునకు సంబంధించిన జిరాక్సు ప్రతిని స్వాధీనం చేసుకున్నారు. దానిపై ‘సెల్ఫ్’ అని రాసి, లక్ష్మణ్ సంతకం ఉండటాన్ని గుర్తించారు. నగదుతో పాటు ఏడుగురినీ నారాయణగూడ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉంటుంది. దీని ప్రకారం రూ.2 లక్షలకు మించి బ్యాంకు నుంచి డ్రా చేయడానికి, రూ.50 వేలకు మించి తరలించడానికి ఆస్కారం లేదు. అయితే సెల్ఫ్ చెక్‌పై రూ.8 కోట్లు డ్రా చేసుకోవడానికి అంగీకరించి. ఆ మొత్తాన్ని అందించిన ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సైతం ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సదరు బ్యాంకు ఖాతా (నెం.406743774) భారతీయ జనతా పార్టీ పేరుతో ఉన్నప్పటికీ ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి సెల్ఫ్ చెక్ (నెం.059198) ఇచ్చిన లక్ష్మణ్ పైనా కేసు నమోదు చేయడానికి పోలీసులు యోచిస్తున్నారు. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితుల్లోనూ రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేయడానికి ఆస్కారం లేదు. అలాంటిది ఎన్నికల సీజన్లో, పోలింగ్ సమీపిస్తుండగా ఈ డబ్బును ఎందుకు డ్రా చేశారు?. ఎక్కడకు తరలిస్తున్నారు?. అనే అంశాలను గుర్తించడంపై పోలీసులు దృష్టి పెట్టారు. -
నగరంలో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నగరంలో భారీ స్థాయిలో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 4.92కోట్ల నగదును పట్టుకున్నట్లు సమాచారం. తాజాగా నల్గొండ, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తుల నుంచి 47 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ ఎంపీ అభ్యర్థికి చెందిన జయవీర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కోటి రూపాయలు స్వాధీన పర్చుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు నగదు సరఫరాపై దృష్టి సారించామన్నారు. నగరంలో నేడు 4.92కోట్ల నగదును పట్టుకున్నట్లు తెలిపారు. 8 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మొత్తాన్ని లోకల్పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహాయంతో పట్టుకున్నట్లు తెలిపారు. సోమాజిగూడలో ఏప్రిల్ 6న సాత్విక్ రెడ్డి, సౌరభ్‌ల నుంచి 26లక్షలు, మూసారంబాగ్లో తండ్రా కాశీనాథ్ రెడ్డి, భుక్యా రవిల నుంచి 34లక్షలు, బంజారహిల్స్ రోడ్‌నెంబర్ 14లో మల్లారెడ్డి శ్రీనివాస్ నుంచి కోటి నగదును, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద బొడుపల్లి శ్రీనయ్య నుంచి కోటి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
మరోసారి హవాల రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో సారి హవాలా రాకెట్ గుట్టు రట్టు అయింది. ఇటీవలే మూడున్నర కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. తాజాగా 2 కోట్ల 60 లక్షలు పట్టుబడ్డాయి. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 2 కోట్ల 60 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఓయూ క్యాంపస్, మలక్‌పేట్ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో ఈ హవాలా డబ్బు బయటపడింది. -
కాంగ్రెస్ అభ్యర్థి వద్ద రూ. 50లక్షల నగదు పట్టివేత!
సాక్షి, హైదరాబాద్ : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ.50లక్షల నగదును పోలీసులు సీజ్‌చేశారు. సర్వే ప్రధాన అనుచరుడు గాలి బాలాజీ వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.50లక్షలు, ప్రచార సామాగ్రిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సర్వే సత్యనారాయణ కోసం తీసుకెళ్తుండగా.. నాంపల్లి వద్ద పట్టుకున్నారు. సర్వే ఆదేశాల మేరకు బేగంబజార్‌లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి రూ. 50లక్షలు గాలి బాలాజీ తీసుకున్నట్లు సమాచారం. మరో చోట రూ.40లక్షలు పట్టివేత! గచ్చిబౌలి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.40లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదు టీడీపీకి చెందిన ఓ నేతవిగా పోలీసులు చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలో వేడిలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి డబ్బు చేతులు మారుతోందన్న సమాచారం అందుకున్నటాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బును సీజ్ చేశారు. శేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్ కుమారుడు కారులో రూ. 70లక్షలున్నట్లు సమాచారం రాగా.. పోలీసుల ఆ డబ్బును సీజ్ చేశారు. భవ్య సిమెంట్స్ డైరెక్టర్ శివకుమార్, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హైదరాబాద్‌లో కట్టల కట్టలు డబ్బు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం అనుమానాలకు తావిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో ఓ అపార్ట్మెంట్లో 7 కోట్ల 71 లక్షల 25 వేల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఇద్దరు అనుమానితులు దొరికారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నగదును గుర్తించారు. అయితే తాము దిగుమతి, ఎగుమతి వ్యాపారం చేస్తున్నామని పోలీసులకు నిందితులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చారు, ఇంట్లో ఎందుకు ఉంచారన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోవడంతో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీ సంబంధించిన వివరాలు లేకపోవడంతో రాజ్ పురోహిత్, సునీల్‌కుమార్ ఆహుజ, ఆశిష్ కుమార్ ఆహుజ, మహుమ్మద్ అజాంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రివాల్వర్, వొల్వో కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 171(బీ), 468, 471, 420, 120(బీ) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ, ముంబై నుంచి హవాలా మార్గంలో డబ్బును తీసుకొచ్చివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ నాయకులెవరైనా ఈ డబ్బును తెప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.42.88 లక్షల నగదు పట్టివేత
రెబ్బెన(ఆసిఫాబాద్): ఎన్నికల నేపథ్యంలో రెబ్బెన మండలం గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీల్లో భాగంగా రెండు ఘటనల్లో మొత్తం రూ.42.88 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ముందుగా గోలేటి టౌన్షిప్ నుంచి రెబ్బెన వైపు వస్తున్న చేపూరి రాజేందర్ గౌడ్ ద్విచక్ర వాహనంలో రూ.2,88,500 నగదును తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. పట్టుబడిన నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు అందుబాటులో లేకపోవటంతో నగదు స్వాధీనం చేసుకుని తహసీల్దార్ సయ్యద్ ఇంతియాజ్ హైమద్కు సమాచారం అందించారు. పట్టుబడిన నగదును తహసీల్దార్ సీజ్ చేసినట్లు తెలిపారు. బోలేరోలో రూ.40లక్షల పట్టివేత.. మరో ఘటనలో సాయంత్రం బోలేరోలో తరలిస్తున్న రూ.40లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల వైపు నుంచి సిర్పూర్‌యూ వెళుతున్న బోలేరోలో రూ.40లక్షల నగదు తరలిస్తుండగా గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద పట్టుకున్న పోలీసులు తహసీల్దార్ ఇంతియాజ్ హైమద్, సీఐ వీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పట్టుబడిన నగదును మంచిర్యాల తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి సిర్పూర్‌యూ తీసుకువెళుతున్నట్లు తేలడంతో నగదును వదిలేశారు. కార్యక్రమాల్లో ఎస్సై దీకొండ రమేశ్, ఏఎస్సై దేవ్‌రావ్, ఆర్ఐ ఉర్మిల, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రూ.2.03లక్షలు స్వాధీనం.. సిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్పేట–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న చెక్‌పోస్టులో ఎలాంటి రశీదు లేకుండా తరలిస్తున్న రూ. 2లక్షల మూడువేల తొమ్మిది వందల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీడీవో జవహర్లాల్, సిర్పూర్(టి) ఎస్సై రవి ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి బెజ్జూర్ మండలం సులుగుపల్లి గ్రామానికి షిండే అశోక్ ద్విచక్రవాహనంపై రూ.2లక్షల మూడువేల తొమ్మిది వందల నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎలాంటి రశీదు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
పట్టిందంతా డబ్బు కాదా?
అయిదుకోట్లు స్వాధీనం... ఏడు కోట్లు స్వాధీనం అంటూ ఎన్నికల వేళ రోజూ వస్తున్న వార్తలన్నీ నిజమేనా? కాకపోవచ్చునంటున్నారు ఎన్నికల సంఘం పనితీరు తెలిసిన వారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకూ దాదాపు 129 కోట్ల నగదు పట్టుబడింది. ఈ నిధులన్నీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకే ఉద్దేశించినవా? ఎన్నికల వేళ ఎంతో నిఘా ఉంటుందని తెలిసిన రాజకీయ పార్టీలు, నేతలు ఇప్పుడు నగదును ఒక చోట నుంచి మరొక చోటికి తీసుకువెళ్లేంత అమాయకులా? చాలా సందర్భాల్లో పెట్రోలు బంకులు, వ్యాపార సంస్థలు నగదును తరలిస్తూంటే పట్టుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఎన్నికల అక్రమ ఫండ్ లెక్కల్లో చూపించేస్తారు. పబ్లిసిటీ బాగానే లభిస్తుంది. కానీ తరువాత పట్టుబడ్డ సొమ్మును పోలీస్ డిపాజిట్ ఫండ్ లో జమచేస్తారు. ఆ తరువాత ఈ నిధి ఎక్కడిది, ఎవరిది వంటి దర్యాప్తులు మొదలవుతాయి. ఆదాయపు పన్ను శాఖ ఆ నిధి ఎక్కడిది, న్యాయమైన సొమ్మేనా అన్నది దర్యాప్తు చేస్తుంది. సంతృప్తికరమైన జవాబులు దొరక్కపోతే ఈ డబ్బును కోర్టులో జమ చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో పోలీసులు కేసులు కూడా దాఖలు చేయడం లేదు. విచారణా చేయడం లేదు. కొన్ని సార్లు ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసే క్యాష్ తరలింపు సంస్థల వ్యాన్లను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ తరువాత ఆయా సంస్థలకు తిరిగి ఇచ్చేస్తారు. ఒక్క మనరాష్ట్రంలోనే కాదు. మహారాష్ట్రలో 33.46 కోట్లు, తమిళనాట 19.87 కోట్లు, కర్నాటకలో 12.29 కోట్లు, ఉత్తరప్రదేశ్ లో 12 కోట్లు, పంజాబ్ లో 5 కోట్లు పట్టుబడ్డాయి. కానీ విలిలో చాలా వరకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే డబ్బులకన్నా పట్టుబడుతున్న మద్యం విషయంలో ఎక్కువ ఆందోళన చెందాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఇప్పటి వరకూ 132 కోట్ల లీటర్ల మద్యం దేశవ్యాప్తంగా పట్టుబడింది. అంటే దేశంలోని మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లలో ప్రతి ఒక్కరికి 1.6 లీటర్ల మద్యం అందేందుకు పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయన్న మాట. ఇంతకన్నా అందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా వోటర్లను మత్తులో ముంచెత్తేందుకు 104 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముఖ్యంగా పంజాబ్ లో మాదక ద్రవ్యాలు పెద్దమొత్తంలో స్వాధీనం అయ్యాయి. ఇంకా మరో అయిదు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అంటే ఇంకెంత మొత్తంలో డ్రగ్స్, మద్యం పట్టుబడతాయో చూడాలి.