పట్టుబడిన నగదును పరిశీలిస్తున్న తహసీల్దార్ ఇంతియాజ్ హైమద్, సీఐ రమణమూర్తి సిర్పూర్(టి): స్వాధీనం చేసుకున్న నగదుపై పంచనామా చేస్తున్న అధికారులు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఎన్నికల నేపథ్యంలో రెబ్బెన మండలం గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీల్లో భాగంగా రెండు ఘటనల్లో మొత్తం రూ.42.88 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ముందుగా గోలేటి టౌన్‌షిప్ నుంచి రెబ్బెన వైపు వస్తున్న చేపూరి రాజేందర్ గౌడ్ ద్విచక్ర వాహనంలో రూ.2,88,500 నగదును తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. పట్టుబడిన నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు అందుబాటులో లేకపోవటంతో నగదు స్వాధీనం చేసుకుని తహసీల్దార్ సయ్యద్ ఇంతియాజ్ హైమద్‌కు సమాచారం అందించారు. పట్టుబడిన నగదును తహసీల్దార్ సీజ్ చేసినట్లు తెలిపారు.
బోలేరోలో రూ.40లక్షల పట్టివేత..
మరో ఘటనలో సాయంత్రం బోలేరోలో తరలిస్తున్న రూ.40లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల వైపు నుంచి సిర్పూర్‌యూ వెళుతున్న బోలేరోలో రూ.40లక్షల నగదు తరలిస్తుండగా గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద పట్టుకున్న పోలీసులు తహసీల్దార్ ఇంతియాజ్ హైమద్, సీఐ వీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పట్టుబడిన నగదును మంచిర్యాల తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి సిర్పూర్‌యూ తీసుకువెళుతున్నట్లు తేలడంతో నగదును వదిలేశారు. కార్యక్రమాల్లో ఎస్సై దీకొండ రమేశ్, ఏఎస్సై దేవ్‌రావ్, ఆర్‌ఐ ఉర్మిల, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రూ.2.03లక్షలు స్వాధీనం..
సిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్‌పేట–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న చెక్‌పోస్టులో ఎలాంటి రశీదు లేకుండా తరలిస్తున్న రూ. 2లక్షల మూడువేల తొమ్మిది వందల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీడీవో జవహర్‌లాల్, సిర్పూర్(టి) ఎస్సై రవి ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి బెజ్జూర్ మండలం సులుగుపల్లి గ్రామానికి షిండే అశోక్ ద్విచక్రవాహనంపై రూ.2లక్షల మూడువేల తొమ్మిది వందల నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎలాంటి రశీదు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment