
బెంగళూరు : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 65 లక్షల నగదును బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్‌కు చెందిన దస్తగిరి (41), కిరణ్‌కుమార్ (30), మస్తాన్ (30)అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఆర్‌టీ స్ట్రీట్ రంగస్వామి ఆలయం వద్ద ఓ కారు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. దీంతో ఐదు వందల నోట్లతో కూడిన 18 బండిళ్లు, రెండు వేల నోట్లతో కూడిన రెండు బండిళ్లు బయటపడ్డాయి. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై స్పష్టమైన సరైన సమాధానం ఇవ్వలేదు. (హలో.. మేము ఏసీబీ! )