
లేవు లేవంటూనే...
బొబ్బిలి, న్యూస్‌లైన్: ‘ఆర్థికంగా మేం బలహీనులం. మా దగ్గర అస్సలు డబ్బులు లేవు. రాజులతో మేము పోటీ పడలేం’ అంటూ సానుభూతి కోసం ఓ వైపు కబుర్లు చెబుతూనే, మరోవైపు ప్రలోభాల పందేరానికి టీడీపీ నాయకులు తెర తీశారు. ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు నివ్వెరపోయేలా గ్రామాలకు రూ.రెండేసి లక్ష లు, వార్డులకు లక్ష రూపాయల చొప్పున డబ్బుతో పాటు మద్యం కేసులను పంపిణీ చే స్తున్నారు. ఎన్నికల ప్రచారం ఆఖరు కావడంతో సోమవారం టీ డీపీ నాయకులు ప ట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. దీని కోసం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి మో టారు సైకిళ్లను తెప్పించి ఒక్కొక్కరికరి రెండేసి లీటర్ల పెట్రోలు కూపన్లు, మద్యం, డబ్బులను విచ్చలవిడిగా పంపి ణీ చేశారు. ర్యాలీ సంద ర్భంగా ఉదయం నుంచి కూపన్లు పట్టుకొని కార్యకర్తలు, నాయకులు పెట్రో లు బంకుల వద్ద బారులు తీరారు. స్థానిక కోర్టు వద్ద ఉన్న పెట్రోలు బంకు, ఆర్టీసీ కాంప్లెక్సు, పాత బొబ్బిలి వద్ద ఉన్న బంకుల్లో పెట్రోలు కోసం తెలుగు తమ్ముళ్లు బారులు తీరారు.
ఎప్పుడో ఉగాదికి సంబంధించిన కూపన్లను కార్యకర్తలకు పంపిణీ చేసి, అవి ఇస్తే రూ.200ల ఆయిల్ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల అధికారులు మూడు బంకుల వద్ద ఎన్నెన్ని బళ్లు పెట్రోలు కొడుతున్నారో, మ ద్యం, డబ్బు ఎక్కడ పంచుతున్నారో ఇవన్నీ వీడియో, ఫోటో చిత్రీకరణలు చేశారు. పట్టణంలో తిరిగిన మోటారు సైకిళ్లకు అడుగడుగునా వీడియో తీశారు. ఆయా బంకుల వద్దకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారు లు వెళ్లి ఎన్ని కూపన్లు అందాయో వివరాలు సేకరించారు. అభ్యర్థుల ఖర్చుల్లో వీటిని పొందుపరుస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అలాగే పలువురు టీడీపీ కా ర్యకర్తలు పార్టీ జెండాలను మోటారు బైక్‌కు కట్టుకుని ఎక్కడికక్కడే మద్యం సేవిస్తూ కని పించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు తాగే వారిని, మద్యం దుకాణాలను వీడియో లు తీశారు. షాడో బృందాలు కూడా వీటిని చిత్రీకరణ చేశాయి.
వాహన ర్యాలీకి రూ. 40వేలు ఖర్చు
గంట్యాడ : గజపతినగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు సోమవారం ర్యాలీలో పాల్గొన్న వాహనాలకు పెట్రోల్ బంక్‌లో ఆ యిల్ వేసేందుకు టోకెన్లు అందజేశారు. అ యితే మోడల్‌కోడ్ అధికారి శారదాదేవి బంక్ వద్ద మోటారు బైక్‌లను పరిశీలించి రూ.40 వేల ఖర్చు అని రాసినట్లు తెలిపారు. అభ్యర్థి ఖా తాలో ఈ వ్యయం పడుతుందని చెప్పారు.
డబ్బు పంచుతూ దొరికి పోయిన టీడీపీ కార్యకర్తలు
శృంగవరపుకోట: పట్టణంలో సోమవారం రాత్రి ఓటర్లకు నగదు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు పోలీసులకు దొరికిపోయారు. రాత్రి 9 గంట ల సమయంలో స్థానిక శ్రీనివాసకాలనీలో ఇంటింటికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చే స్తున్న సాకుతో డబ్బు పంపిణీ చేసేలా నాయకులు వ్యూహ రచన చేశారు. రెండు రోజులుగా ఇదే తర హాలో నగదును పంచుతున్నారు. అయితే సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోమ సన్యాసిరావు, బాపన వెంకటరావులు ఓటర్ల కు నగదు పంపిణీ చేయడాన్ని పెట్రోలింగ్ చేస్తున్న స్థానిక పోలీసులు గమనించారు. వెంటనే వీరిద్దరినీ అదుపులోకి తీ సుకుని వారినుంచి ఓటరు స్లిప్పులు, రూ. 6600లు నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. దీనిపై ఎస్.ఐ ఎస్.కె.ఎస్.ఘనీ వివరణ కోరగా ఓటర్లను ప్రలోభపెట్టటం నేరమని, దీనిపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పారు.