ఎన్నికల్లో దొరికిన నగదును ఏం చేస్తారు?  | In the 1962 Lok Sabha Elections, the Blue Inc Tradition Was First Handed Out | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో దొరికిన నగదును ఏం చేస్తారు? 

Published Thu, Apr 11 2019 11:02 AM | Last Updated on Thu, Apr 11 2019 11:03 AM

In the 1962 Lok Sabha Elections, the Blue Inc Tradition Was First Handed Out - Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ రూరల్‌: ఎన్నికల్లో అక్రమంగా తరలించే డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకంటారు. రూ.10లక్షల లోపు పట్టుబడిన కేసులను పోలీసులు, ఆపై కేసులను ఐటీ శాఖ విడివిడిగా విచారిస్తాయి. సరైన బిల్లులు, డాక్యుమెంట్లు ఉంటే ఆ నగదను విడిపించుకోవచ్చు. ఎలాంటి బిల్లులు, పత్రాలు చూపని డబ్బును పోలీసులు అక్కడి నుంచి కోర్టుకు, ఆ తర్వాత కేంద్రప్రభుత్వానికి వెళ్తుంది. ఈప్రక్రియకు చాలా సమయం పడుతుంది.  

బ్లూ ఇంక్‌ చరిత్ర తెలుసా.. 
ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత చేతికి పెట్టే బ్లూ ఇంక్‌కు చాలా చరిత్ర ఉంది. 1962 లోక్‌ సభ ఎన్నికల్లో మొదటిసారి ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. బ్లూ ఇంక్‌ 15 రోజుల పాటు చెదిరిపోకుండా అలాగే ఉంటుంది. మూడు నెలలైనా కూడా కొందరి వేళ్లపై ఇంకు ఉంటుంది. మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ తయారు చేసే ఈ ఇంకును ఇండియాలోనే కాదు..కెనడా, కాంబోడియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల్లో కూడా ఉపయోగిస్తారు.  

ఓట్లు.. రకాలు  
సాధరణ ఓటు: పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటేయడం 
పోస్టల్‌ ఓటు: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు భద్రతా బలగాలు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 
ప్రాక్సీ ఓటు: మన తరపున ఓటు హక్కును వేరే వాళ్లు వేసేలా అధికారుల నుంచి అనుమతి పొంది ఓటేయడం 
టెండర్‌ ఓటు: మన ఓటు వేరేవాళ్లు అక్రమంగా వేసినప్పుడు, అధికారుల అనుమతితో మన ఓటును మనమే మళ్లీ వేయడం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement