సాక్షి, అమరావతి : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధం కాగానే జిల్లా ఎన్నికల అధికారి రహస్యంగా పోస్టల్ బ్యాలెట్‌లు ముద్రిస్తారు. ఈ బ్యాలెట్ పేపర్లు సిద్ధం కాగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వీస్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ పేపర్ పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారి ఒక ఏఆర్‌తోపాటు కొందరి సహాయకుల్ని నియమిస్తారు. వీరు పోస్టల్ బ్యాలెట్‌ల్ని ఉద్యోగులకు పంపిణీ చేస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్‌లు స్వీకరించేందుకు ఎన్నికల కార్యాలయంలో ఒక డ్రాప్‌బాక్స్ సిద్ధంగా ఉంచుతారు. లేదంటే నేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పోలింగ్ తేదీకన్నా ఒక రోజు ముందు వరకుగానీ ఎన్నికల అధికారులు సూచించిన గడువు లోగా అధికారులకు అందజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment