ఈవీఎంలు భద్రపరిచిన గోదాము గేటు వద్ద కాపలాగా ఉన్న పోలీసులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ముందస్తు ఎన్నికలు ఖరారయ్యాక సరిగ్గా మూడు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఎవరి భవితవ్యం ఏమిటో ఈ నెల 11వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. అప్పటి దాకా ఆయా పార్టీల అభ్యర్థుల భవిష్యత్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎంలు) భద్రంగా నిక్షిప్తమైంది. సెప్టెంబరు 6వ తేదీన ప్రభుత్వం రద్దు కావడం, అదే రోజు టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించడంతో ఖరారైపోయిన ముందస్తు ఎన్నికలు ఒక విధంగా అన్ని రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్ష పెట్టాయి.
గత నెల 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి శుక్రవారం జరిగిన పోలింగ్ దాకా జిల్లాలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మరోవైపు ఆయా పార్టీల నాయకత్వాలు సైతం రీపోలింగ్ లేకపోవడం, ఎలాంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు పూర్తి కావడంతో ఆనందంగా ఉన్నాయి.
ఇప్పుడు వారి దృష్టంతా 11వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలపైనే కేంద్రీ కృతమైంది. మరో వైపు పోలింగ్ సరళిని బేరీజు వేసుకుని, బూత్ కమిటీల ద్వారా తెప్పించుకున్న సమాచారం మేరకు తమ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది..? ఎంత మెజారిటీతో గెలిచే వీలుంది..? ఏ వర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యి ఉంటాయి.. అన్న లెక్కలు ముందేసుకుని సమీకరణలు చేయడంలో మునిగిపోయారు.
మిర్యాలగూడ, మునుగోడు వంటి నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో శుక్రవారం రాత్రి వరకూ పోలింగ్ జరగడం, వివిధ కారణాల వల్ల పోలింగ్ శాతం, పోలైన ఓట్ల వివరాలు సరిగా అందలేదు. శనివారం మధ్యాహ్నానికి పూర్తి వివరాలు తెప్పించుకున్న అధికారులు జిల్లాలో, ఆయా నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలతో తుది నివేదికలు తయారు చేశారు.
జిల్లాలో 86.82శాతం పోలింగ్ నమోదు
జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు మొత్తం గా 86.82శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 8.5శాతం ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 12,94,880ఓట్లకు గాను శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 11,24,202ఓట్లు పోలయ్యాయి.
నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కంగా 91.07శాతం పోలింగ్ నమోదు కాగా, అతి తక్కువగా నల్లగొండ నియోజకవర్గంలో 84.13శాతం ఓట్లు పోలయ్యాయి. మరోవైపు 87.42శాతం మంది పురుషులు తమ ఓటు హ క్కు వినియోగించుకోగా, 86.23శాతం మంది మ హిళలు ఓట్లేశారు.7.55శాతం మంది ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment