పాలకుర్తి : పోలింగ్‌ వేళ.. అప్రమత్తత ఇలా.. | Polling Information For Voters In Warangal | Sakshi
Sakshi News home page

పాలకుర్తి : పోలింగ్‌ వేళ.. అప్రమత్తత ఇలా..

Published Mon, Dec 3 2018 8:56 AM | Last Updated on Mon, Dec 3 2018 9:02 AM

Polling Information For Voters In Warangal - Sakshi

సాక్షి, తొర్రూరు రూరల్‌: ఓటరు చైతన్యం, నమోదు, వంద శాతం ఓటింగ్‌కు ఎన్ని కల సంఘం చొరవ తీసుకుంటుంది. ఓటేసేందుకు వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తుంది. పోలింగ్‌ వేళ ఓటర్లను అప్రమత్తం చేసేందుకు పలు జిల్లాల ఎన్నికల అధికారులు ‘ఓటర్‌ గైడ్‌’ కరపత్రాన్ని ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఒకే పేజీకి రెండు వైపులా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటు విలువ తెలుపుతూ నినాదాలు ముద్రించారు. చదవగానే అర్థమయ్యేలా నూచనలు అందులో పేర్కొన్నారు. బూత్‌ లెవల్‌ అధికారి పేరు, వారి సెల్‌నెంబరు దానిపై ముద్రిం చారు. ఏం చేయాలి..ఏం చేయకూడదో దానిలో ముద్రించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 425 7106కు కాల్‌చేయాలని సూచించారు. గుర్తింపు కార్డు, ఓటు ఎలా వేయాలో రెండు పేజీల్లో వివరించారు. 

చేయదగినవి..

  • వరుసలో నిల్చోవాలి. వంతు వచ్చినప్పుడే లోనికి వెళ్లాలి. 
  • భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదేని గుర్తింపు కార్డు లోనికి తీసుకెళ్లాలి. 
  • పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించొద్దు. 
  • ఓటు వేసిన వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలి. 

చేయకూడనివి..

  • సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్‌ పరికరాలను పోలింగ్‌ కేంద్రంలోకి  తీసుకెళ్లొద్దు.
  • ఓటేసేందుకు ప్రలోభాలకు గురి కావొద్దు. 
  • డబ్బులు, మద్యం తీసుకున్నా, పోలింగ్‌ ప్రక్రియకు ఆటంకం కల్పించినా నేరమే.  కేసు నమోదు చేస్తారు. 
  • పొగ తాగరాదు. ఆయుధాలతో లోనికి రాకూడదు. 
  • ఈవీఎం, వీవీప్యాట్‌లు, పోలింగ్‌ సామగ్రికి నష్టం కలిగించినా శిక్షార్హమే. లోపలి ఫొటోలు తీయొద్దు.

వీటిలో ఏ గుర్తింపు కార్డు తెచ్చినా సరిపోతుంది..

  • ఎన్నికల గుర్తింపు (ఎపిక్‌) కార్డు, (లేదా) కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫొటో గుర్తింపు కార్డు 
  • ఫొటోతో గల తపాలా, బ్యాంకు కార్యాలయం జారీ చేసిన పాస్‌బుక్‌లు
  • పాన్‌ కార్డు,పాస్‌పోర్టు
  • జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) కింది భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీఐ) జారీచేసిన స్మార్టు కార్డు 
  • ఉపాధిహామీ కార్డు,ఆధార్‌ కార్డు
  • కార్మిక మంత్రిత్వ శాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్టు కార్డు
  • ఫొటో గల పింఛను పత్రం
  • ఎన్నికల యంత్రాంగం ధృవీకరించి జారీచేసిన ఓటరు స్లిప్‌ 
  • చట్టసభల సభ్యులకు జారీచేసిన అధికార గుర్తింపు కార్డు

ఓటు ఎలా వేయాలంటే...

  • మొదట పోలింగ్‌ అ«ధికారి పీఓ–1 ఓటరు స్లిప్‌ లేదా గుర్తింపు కార్డును చూపి జాబితాలోని నెంబరుతో సరిగా ఉందా లేదా సరిచూసుకుం టారు. 
  • తదుపరి పీఓ–2 ఎడమచేతి చూపుడు వేలుకు ఇండికెబుల్‌ ఇంక్‌ చుక్కను పెడతారు. 
  • బ్యాలెటింగ్‌ యూనిట్‌లోని అభ్యర్థి ఫొటో, ఎన్నికల గుర్తు చూసి తాము అనుకున్న వారికి ఎదురుగా ఉన్న నీలి రంగు బటన్‌ను నొక్కాలి.
  • ఎరుపు రంగులో చిన్న దీపం వెలుగుతుంది. బీప్‌ అనే శబ్దం వచ్చి వీవీ ప్యా ట్‌లో స్లిప్‌ పడగానే ఓటు వేసినట్లుగా నిర్దారించుకుని బయటకు రావాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement