పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించండి ఇలా.. | Postal Ballot Information In Warangal | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించండి ఇలా..

Published Mon, Nov 26 2018 11:33 AM | Last Updated on Mon, Nov 26 2018 11:33 AM

Postal Ballot Information In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ అర్బన్‌: ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. అందుకే పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్‌ కమిషన్‌ వారి కోసం ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో మాత్రం ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపడం లేదు.  50 శాతం మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకున్న దాంట్లో కొందరు ఓటు వేసి సకాలంలో పంపించరు. మరికొన్ని తప్పుల తడకలుగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ ఎన్ని ప్రయత్రాలు చేసినా మారుమూల పల్లెల్లో పోలింగ్‌ శాతం, ఓటర్ల నమోదు శాతం పెంచగలుగుతున్నారు గానీ పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో మాత్రం ఆశించిన ఫలితం కానరావడంలేదని గత ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే నిరూపిస్తున్నాయి. ఈ సారి కాస్త ఉద్యోగసంఘాలు కూడా ఓ అడుగు ముదుకేసి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని, ఫారం–12 పొందడానికి గడువు పొడగించాలని కోరుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం ఓసారి పరిశీలిద్దాం....

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఉపయోగించే ఫారాలు..

  • ఫారం–12: పోస్టల్‌ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసే పత్రం
  • ఫారం–13ఏ: ఓటరు ధృవీకరణ పత్రం
  • ఫారం 13బీ: కవరు ఏ లోపలి కవరు పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టాల్సిన కవరు. 
  • పారం 13సీ– కవరు బీ పైన ఉండే కవరు. రిటర్నింగ్‌ అధికారి తిరిగి పంపించాల్సిన కవరు... దీనిలో 13బీ కవరులో పోస్టల్‌ బ్యాలెట్‌ , 13ఏ ఓటరు డిక్లరేషన్‌ పెట్టాలి.
  • ఫారం–13 డీ ఓటరుకు సూచనలు, సలహాలు

పోస్టల్‌ బ్యాలెట్‌ పొందడం... పూర్తి చేసి అందజేయడం ...
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఉత్తర్వులతోపాటు ఫారం–12 అందజేస్తారు. ఫారం 12ను పూర్తిగా నింపి రిటర్నింగ్‌ అధికారికి ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటుచేసే ఫెసిటిటేషన్‌ కేంద్రంలో అందజేయాలి. 

  • ఉద్యోగి అదే ఆర్‌ఓ పరిధిలోని నియోజకవర్గం పరిధిలో ఓటు ఉన్నట్లైతే పోస్టల్‌ బ్యాలెట్‌ నేరుగా లేదా రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా అందజేస్తారు.
  • ఉద్యోగి ఫారం 12తో పాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు జిరాక్స్‌ కాపీలు జతచేయాలి.

 ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ సమయంలో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ డ్రాప్‌ బ్యాక్స్‌ ఏర్పాటుచేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పొందిన ఉద్యోగులందరూ తమ ఓటుహక్కును వినియోగించుకుని ఫారం–13 కవర్‌ బీలో మార్క్‌చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పొందుపరిచి కవర్‌తోపాటు ధృవీకరణ పత్రం 13ఏ గెజిటెడ్‌ అధికారి సర్టిఫై చేసిన సంతకంతో కవర్‌ బీ (13సీ) కవర్లో పొందుపరిచి డ్రాప్‌ బ్యాక్స్‌లో వేయాలి. లేదా ఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బాక్స్‌లో వేయొచ్చు. లేదా ఆర్‌ఓకు నిర్ధిష్ట సమయంలో చేరేవిధంగా పోస్ట్‌ద్వారా పంపించొచ్చు.

కవర్‌కు పోస్టల్‌ స్టాంపులు అంటించాల్సిన అవరంలేదు..
పోలింగ్‌కు ఏడు రోజులు ముందు వరకు ఫారం 12, సంబంధిత పత్రాలు అందజేసి ఆర్‌ఓనుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చు. తీసుకున్న పోస్టల్‌ బ్యాలెట్‌ తిరిగి ఆర్‌ఓకు ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11వ తేదీ ఉదయం ఆరు గంటల్లోపు చేరే విధంగా అందజేయడానికి అవకాశం ఉంటుంది.

పోస్టల్‌ బ్యాలెట్‌ తక్కువ వినియోగానికి కారణాలు...

  • ఆర్‌ఓ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకోవడంపై ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఆసక్తి చూపకపోవడం
  • ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ ఫారం–12తో సకాలంలో అందజేయకపోవడం
  • ఫారం పూర్తిచేసే సమయంలో ఓటరు జాబితాలోని వివరాలు సరిగా అందజేయకపోవడం
  • ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్లు అందకపోవడం
  • ఫారం–12లో చిరునామా సక్రమంగా ఇవ్వకపోవడం
  • తీసుకున్న బ్యాలెట్‌ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్‌ఓకు పంపకపోవడం వంటివి...

పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరణ ఎందుకంటే.....

  • ఉద్యోగి డిక్లరేషన్‌లో సంతకం లేకపోవడం
  • డిక్లరేషన్‌లో బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ నంబర్‌ రాయకపోవడం
  • గెజిటెడ్‌ అధికారి ధృవీకరణ లేకపోవడం
  • ఓటేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ను 13బీ కవరులో పెట్టకపోవడం, సీలు వేయకపోవడం
  • పోస్టల్‌ బ్యాలెట్, డిక్లరేషన్‌ ఒకే కవరులో పెట్టడం.
  • బ్యాలెట్‌లో సంతకం చేయడం, ఓటు రహస్యతను కాపాడకపోవడం
  • ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద మార్క్‌ చేయడం వంటి కారణాలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement