Rules and regulation
-
ఆటోమొబైల్ కంపెనీలపై సర్వే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ప్రతి రంగంలోనూ కంపెనీలు పాటించాల్సిన రూల్స్, చట్టాలు బోలెడు ఉంటాయి. సంస్థలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, కార్యక్రమాలు జరపాలన్నా వీటిని తప్పక పాటించాలి. అయితే ప్రస్తుత దేశీ ఆటోమొబైల్ కంపెనీల్లో ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఆయా కంపెనీల మేనేజ్మెంట్లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ అంశం టీమ్‌లీజ్ రెగ్‌టెక్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్ కంపెనీలపై రెగ్‌టెక్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు. చదవండి: ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
‘దివాలా’ కంపెనీల నిబంధనలకు సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చట్టం కింద వేలానికి వచ్చే కంపెనీలకు, మెరుగైన విలువ రాబట్టే విధంగా సంబంధిత నిబంధనలను దివాలా బోర్డు (ఐబీబీఐ) సవరించింది. అవసరమైతే కంపెనీని విడగొట్టి విక్రయించేందుకు అనుమతించింది. మొత్తం వ్యాపారం కొనుగోలు కోసం తగిన పరిష్కార ప్రతిపాదనేది రాని పక్షంలో రుణగ్రహీతకు సంబంధించిన అసెట్లను విడివిడిగా విక్రయించడానికి, మరోసారి రిజల్యూషన్ ప్రణాళికలు సమర్పించాలని కోరుతూ రుణదాతల కమిటీ ప్రకటన చేయొచ్చని ఐబీబీఐ పేర్కొంది. ఒకవేళ మిగతా అన్ని మార్గాలూ విఫలమైతే ఆఖరు ప్రయత్నంగా ప్రమోటరుతో సెటిల్మెంట్ చేసుకునేందుకు కూడా కొత్త నిబంధనలతో వెసులుబాటు లభిస్తుంది. ఇకపై వేలంలో పాల్గొనేలా మరింత మంది బిడ్డర్లను ఆకర్షించేందుకు రిజల్యూషన్ ప్రొఫెషనల్, రుణదాతలు ప్రత్యేకంగా రోడ్‌షోలు కూడా నిర్వహించవచ్చు. చదవండి: లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు! -
రూల్ ప్రకారం అతను నాటౌట్.. అదనంగా 5 పరుగులు కూడా
లండన్: దక్షిణఫ్రికా, పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించి, డబుల్ సెంచరీకి చేరువగానున్న పాక్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్‌కు కారణమయ్యాడని క్రికెట్ లామేకర్ మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది. డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యపై ఫీల్డ్ అంపైర్లు స్పందించకపోవటాన్ని ఎంసీసీ తప్పుపట్టింది. ఎంసీసీ రూల్ 41.5.1 ప్రకారం ఫీల్డర్లు మాటలతో కానీ సైగలతో కానీ బ్యాట్స్‌మెన్‌ను తప్పుదోవ పట్టించి, అతను వికెట్ కోల్పోవడానికి కారణమైతే ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకోవచ్చని ఎంసీసీ వివరణ ఇచ్చింది. Absolutely brilliant from #QuintonDeKock . Brilliant. @OfficialCSA #SAvPAK pic.twitter.com/6LIHaM9ZzV — Tweeter (@tweetersprints) April 4, 2021 ఫీల్డర్ల తప్పుడు సంకేతాల వల్ల బ్యాట్స్‌మెన్ రనౌటైతే, దాన్ని నాటౌట్‌గా పరిగణించాలని అంతేకాకుండా బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులకు అదనంగా 5 పరుగులు కలపాలని, తరువాతి బంతిని ఎదుర్కొనే ఛాయిస్‌ను కూడా బ్యాట్స్‌మెన్‌కే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఫకర్ జమాన్ రనౌట్ వివాదంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంసీసీ ఈ మేరకు స్పందించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని 7 పరుగుల తేడాతో మిస్ చేసుకున్న పాక్ బ్యాట్స్‌మెన్.. రనౌట్ వివాదంలో డికాక్ తప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, మ్యాచ్ చివరి ఓవర్లో డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన సైగల కారణంగా ఫకర్ జమాన్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మార్క్రమ్ వేసిన త్రో బౌలర్ ఎండ్‌కు వెళ్తుందని భావించిన జమాన్.. అటువైపు దృష్టి మళ్లించేసరికి బంతి వికెట్లను తాకడంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పర్యాటక పాక్ జట్టు 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చదవండి: ఐపీఎల్ ప్లేయర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
ఉద్యోగుల్లారా.. జర భద్రం..!
సాక్షి, నారాయణఖేడ్: ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రభుత్వోద్యోగులు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని గుర్తించాలి. ఈ సమయంలో ప్రభుత్వోద్యోగులు రాజకీయ పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనడం, నేతలను సత్కరించేందుకు అత్యుత్సాహం చూపుతుంటారు. ఇలాంటి వారికి ముకుతాడు వేసే దిశగా ఎన్నికల సంఘం 23(ఐ) నిబంధనను అమల్లోకి తెచ్చింది. 1949 సెప్టెంబర్ 17 నుంచి ఈ నిబంధన అమలులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నిబంధన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. ఏదో ఒక పార్టీకి ఓటేయాలని, ఫలానా అభ్యర్థికి మద్దతివ్వాలని కొందరు బంధువులను, ఇతరులను ప్రభావితం చేస్తే, మరికొందరు సామాజిక మాధ్యమాల్లో అత్యుత్సాహం కొద్దీ పోస్టులు పెడుతుంటా రు. తెలిసీ తెలియక ఇలాంటి పనులు చేస్తే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకుల మీద ఎంత అభిమానం ఉన్నా మనసులోనే దాచుకోవాలి తప్ప బహిర్గత పరిస్తే చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని గుర్తించాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ జర భద్రంగా ఉండటం మంచిది. జెండాలు కడితే జరిమానా..! ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా పాటించాలి. ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఇళ్లపై పార్టీ జెండాలు ఎగరేసినా, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టినా.. ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు ఆ జెండాలను వచ్చి తొలగిస్తారు. తొలగించడమే కాక.. దానికయ్యే ఖర్చునూ వసూలు చేస్తారు. ఎన్నికల అధికారి ‘అనుమతి’ తీసుకుంటే అది ఏ పార్టీకి చెందిందో ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికలఖర్చు కిందకు వస్తుంది. ఎవరైనా తెలియకుండా జెండాలు, ఫ్లెక్సీలు కడితే సొంతంగా తొలగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశంఉంది. -
పాలకుర్తి : పోలింగ్ వేళ.. అప్రమత్తత ఇలా..
సాక్షి, తొర్రూరు రూరల్: ఓటరు చైతన్యం, నమోదు, వంద శాతం ఓటింగ్‌కు ఎన్ని కల సంఘం చొరవ తీసుకుంటుంది. ఓటేసేందుకు వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తుంది. పోలింగ్ వేళ ఓటర్లను అప్రమత్తం చేసేందుకు పలు జిల్లాల ఎన్నికల అధికారులు ‘ఓటర్ గైడ్’ కరపత్రాన్ని ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఒకే పేజీకి రెండు వైపులా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటు విలువ తెలుపుతూ నినాదాలు ముద్రించారు. చదవగానే అర్థమయ్యేలా నూచనలు అందులో పేర్కొన్నారు. బూత్ లెవల్ అధికారి పేరు, వారి సెల్‌నెంబరు దానిపై ముద్రిం చారు. ఏం చేయాలి..ఏం చేయకూడదో దానిలో ముద్రించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7106కు కాల్చేయాలని సూచించారు. గుర్తింపు కార్డు, ఓటు ఎలా వేయాలో రెండు పేజీల్లో వివరించారు. చేయదగినవి.. వరుసలో నిల్చోవాలి. వంతు వచ్చినప్పుడే లోనికి వెళ్లాలి. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదేని గుర్తింపు కార్డు లోనికి తీసుకెళ్లాలి. పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించొద్దు. ఓటు వేసిన వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలి. చేయకూడనివి.. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లొద్దు. ఓటేసేందుకు ప్రలోభాలకు గురి కావొద్దు. డబ్బులు, మద్యం తీసుకున్నా, పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కల్పించినా నేరమే. కేసు నమోదు చేస్తారు. పొగ తాగరాదు. ఆయుధాలతో లోనికి రాకూడదు. ఈవీఎం, వీవీప్యాట్లు, పోలింగ్ సామగ్రికి నష్టం కలిగించినా శిక్షార్హమే. లోపలి ఫొటోలు తీయొద్దు. వీటిలో ఏ గుర్తింపు కార్డు తెచ్చినా సరిపోతుంది.. ఎన్నికల గుర్తింపు (ఎపిక్) కార్డు, (లేదా) కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫొటో గుర్తింపు కార్డు ఫొటోతో గల తపాలా, బ్యాంకు కార్యాలయం జారీ చేసిన పాస్‌బుక్‌లు పాన్ కార్డు,పాస్‌పోర్టు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) కింది భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) జారీచేసిన స్మార్టు కార్డు ఉపాధిహామీ కార్డు,ఆధార్ కార్డు కార్మిక మంత్రిత్వ శాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్టు కార్డు ఫొటో గల పింఛను పత్రం ఎన్నికల యంత్రాంగం ధృవీకరించి జారీచేసిన ఓటరు స్లిప్ చట్టసభల సభ్యులకు జారీచేసిన అధికార గుర్తింపు కార్డు ఓటు ఎలా వేయాలంటే... మొదట పోలింగ్ అ«ధికారి పీఓ–1 ఓటరు స్లిప్ లేదా గుర్తింపు కార్డును చూపి జాబితాలోని నెంబరుతో సరిగా ఉందా లేదా సరిచూసుకుం టారు. తదుపరి పీఓ–2 ఎడమచేతి చూపుడు వేలుకు ఇండికెబుల్ ఇంక్ చుక్కను పెడతారు. బ్యాలెటింగ్ యూనిట్‌లోని అభ్యర్థి ఫొటో, ఎన్నికల గుర్తు చూసి తాము అనుకున్న వారికి ఎదురుగా ఉన్న నీలి రంగు బటన్‌ను నొక్కాలి. ఎరుపు రంగులో చిన్న దీపం వెలుగుతుంది. బీప్ అనే శబ్దం వచ్చి వీవీ ప్యా ట్లో స్లిప్ పడగానే ఓటు వేసినట్లుగా నిర్దారించుకుని బయటకు రావాలి. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించండి ఇలా..
సాక్షి, హన్మకొండ అర్బన్: ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. అందుకే పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ వారి కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో మాత్రం ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపడం లేదు. 50 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న దాంట్లో కొందరు ఓటు వేసి సకాలంలో పంపించరు. మరికొన్ని తప్పుల తడకలుగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎన్ని ప్రయత్రాలు చేసినా మారుమూల పల్లెల్లో పోలింగ్ శాతం, ఓటర్ల నమోదు శాతం పెంచగలుగుతున్నారు గానీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం ఆశించిన ఫలితం కానరావడంలేదని గత ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్లే నిరూపిస్తున్నాయి. ఈ సారి కాస్త ఉద్యోగసంఘాలు కూడా ఓ అడుగు ముదుకేసి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని, ఫారం–12 పొందడానికి గడువు పొడగించాలని కోరుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ విధానం ఓసారి పరిశీలిద్దాం.... పోస్టల్ బ్యాలెట్ కోసం ఉపయోగించే ఫారాలు.. ఫారం–12: పోస్టల్ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసే పత్రం ఫారం–13ఏ: ఓటరు ధృవీకరణ పత్రం ఫారం 13బీ: కవరు ఏ లోపలి కవరు పోస్టల్ బ్యాలెట్ పెట్టాల్సిన కవరు. పారం 13సీ– కవరు బీ పైన ఉండే కవరు. రిటర్నింగ్ అధికారి తిరిగి పంపించాల్సిన కవరు... దీనిలో 13బీ కవరులో పోస్టల్ బ్యాలెట్ , 13ఏ ఓటరు డిక్లరేషన్ పెట్టాలి. ఫారం–13 డీ ఓటరుకు సూచనలు, సలహాలు పోస్టల్ బ్యాలెట్ పొందడం... పూర్తి చేసి అందజేయడం ... ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఉత్తర్వులతోపాటు ఫారం–12 అందజేస్తారు. ఫారం 12ను పూర్తిగా నింపి రిటర్నింగ్ అధికారికి ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటుచేసే ఫెసిటిటేషన్ కేంద్రంలో అందజేయాలి. ఉద్యోగి అదే ఆర్ఓ పరిధిలోని నియోజకవర్గం పరిధిలో ఓటు ఉన్నట్లైతే పోస్టల్ బ్యాలెట్ నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందజేస్తారు. ఉద్యోగి ఫారం 12తో పాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలు జతచేయాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ సమయంలో ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్ బ్యాలెట్ డ్రాప్ బ్యాక్స్ ఏర్పాటుచేస్తారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ తమ ఓటుహక్కును వినియోగించుకుని ఫారం–13 కవర్ బీలో మార్క్‌చేసిన పోస్టల్ బ్యాలెట్ పొందుపరిచి కవర్‌తోపాటు ధృవీకరణ పత్రం 13ఏ గెజిటెడ్ అధికారి సర్టిఫై చేసిన సంతకంతో కవర్ బీ (13సీ) కవర్లో పొందుపరిచి డ్రాప్ బ్యాక్స్‌లో వేయాలి. లేదా ఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బాక్స్‌లో వేయొచ్చు. లేదా ఆర్ఓకు నిర్ధిష్ట సమయంలో చేరేవిధంగా పోస్ట్‌ద్వారా పంపించొచ్చు. కవర్‌కు పోస్టల్ స్టాంపులు అంటించాల్సిన అవరంలేదు.. పోలింగ్‌కు ఏడు రోజులు ముందు వరకు ఫారం 12, సంబంధిత పత్రాలు అందజేసి ఆర్ఓనుంచి పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు. తీసుకున్న పోస్టల్ బ్యాలెట్ తిరిగి ఆర్ఓకు ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11వ తేదీ ఉదయం ఆరు గంటల్లోపు చేరే విధంగా అందజేయడానికి అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ తక్కువ వినియోగానికి కారణాలు... ఆర్ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడంపై ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఆసక్తి చూపకపోవడం ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ ఫారం–12తో సకాలంలో అందజేయకపోవడం ఫారం పూర్తిచేసే సమయంలో ఓటరు జాబితాలోని వివరాలు సరిగా అందజేయకపోవడం ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్లు అందకపోవడం ఫారం–12లో చిరునామా సక్రమంగా ఇవ్వకపోవడం తీసుకున్న బ్యాలెట్ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్ఓకు పంపకపోవడం వంటివి... పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ ఎందుకంటే..... ఉద్యోగి డిక్లరేషన్‌లో సంతకం లేకపోవడం డిక్లరేషన్‌లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయకపోవడం గెజిటెడ్ అధికారి ధృవీకరణ లేకపోవడం ఓటేసిన పోస్టల్ బ్యాలెట్‌ను 13బీ కవరులో పెట్టకపోవడం, సీలు వేయకపోవడం పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్ ఒకే కవరులో పెట్టడం. బ్యాలెట్లో సంతకం చేయడం, ఓటు రహస్యతను కాపాడకపోవడం ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద మార్క్ చేయడం వంటి కారణాలు -
అభ్యర్థులు.. నిబంధనలు
సాక్షి, ఖమ్మం: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే దగ్గర నుంచి ప్రచా రం నిర్వహించే వరకు ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడే ప్రవర్తించాలి. అభ్యర్థులు, రాజకీ య పార్టీలు నిబంధనలను అతిక్రమిస్తే ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమిస్తుంది. నామినేషన్ దాఖలుకు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో సహా ఐదుగురు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇస్తారు. నామినేషన్ల పరిశీలన అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఒక ప్రతిపాదకుడు, మరో వ్యక్తి(న్యాయవాది కావచ్చు) పరిశీలనకు వెళ్లవచ్చు. దీనికి అభ్యర్థి రాతపూర్వకంగా అనుమతి అవసరం ఉంటుంది. వాహనాల వినియోగం.. ఎన్ని వాహనాలైనా ఎన్నికల ప్రచారానికి వాడవ చ్చు. రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒరిజినల్ అనుమతి పత్రాన్ని స్పష్టం గా కనిపించేలా వాహనానికి అతికించాలి. పర్మిట్ మీద వాహన నంబర్, అభ్యర్థి వివరాలుఉండాలి. పర్మిట్ వాహనాన్ని అదే అభ్యర్థికి వాడాలి. దాన్ని ఇంకో అభ్యర్థికి ఉపయోగిస్తేభారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 171(హెచ్) కింద చర్యలు తీసుకుంటారు. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని ఎన్నికల కోసం వాడకూడదు. మోటార్ వెహిరల్ చట్టానికి లోబడి వాహనాలకు అదనపు ఏర్పాట్లు చేసుకోవచ్చు. విద్యా సంస్థలు, వారి మైదానాలను ప్రచా రానికి వాడకూడదు. ప్రైవేటు భూములు, భవనాల య జమానుల లిఖితపూర్వక అనుమతి తీసుకుని రిటర్నింగ్ అధికారికి అందించిన తర్వాతనే గోడ పోస్టర్లు అతికించి ప్రచారం చేయాలి. ఎన్నికల కరపత్రాలపై ముద్రణాలయాల పేరు, చిరునామా విధిగా ఉండాలి. ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇవ్వొచ్చు. వీటిని ఎన్నికల ఖర్చులో చూపించాలి. చీరలు, చొక్కాలు ఇవ్వకూడదు. దేవుళ్ల ఫొటోలు, అభ్యర్థి ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లు ప్రచురించరాదు. వాహనాల స్టెప్నీ కవర్లపై మత సంబంధిత ఫొటోలు, అభ్యర్థి ఫొటోలు ఉండడానికి వీల్లేదు. -
రాణిగారికీ రూల్స్ ఉన్నాయి!
బ్రిటన్ యువరాజు హ్యారీని హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ ఇటీవల వివాహమాడిన విషయం తెలిసిందే. యువరాజుని పెళ్లాడటంతో యువరాణి అయిపోయారు మేఘన్. సకల సౌకర్యాలు లభిస్తాయి అనుకోవడంలో ఎటువంటి సందేహాలు లేవు. వాటితో పాటుగా రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయట ఈ యువరాణిగారికి. రాజకుటుంబంలో సభ్యురాలు అయ్యారు కాబట్టి మేఘన్ మార్కెల్ ఇక మీదట ఇంతకుముందులా మామూలు సిటిజన్ కాదు. రాజకుటుంబీకుల లైఫ్ స్టైల్‌కు, వాళ్ల పద్ధతులకు అలవాటు పడాలి. అందులో కొన్ని రూల్స్ ఈ విధంగా ఉంటాయని సమాచారం. సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేయకూడదు. సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండకూడదు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే మినీ–స్కర్ట్స్‌కు దూరంగా ఉండాలి. షెల్ ఫిష్ తినకూడదు. డిన్నర్‌ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు హస్బెండ్ హ్యారీ పక్కనే కూర్చోవాలి. కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోకూడదు. కావాలంటే ఒకవైపు వాలుగా కాళ్లు పెట్టుకోవచ్చు. తన కంటే పై స్థాయిలోని వాళ్లు రూమ్‌లోకి రాగానే మర్యాదపూర్వకంగా గౌరవించాలి. ఇలాంటి కొన్ని నియమాలను రాజకుటుంబంలోకి వెళ్తున్నందుకు మార్కెల్ పాటించాలట. సో.. మార్కెల్ ఇక మీదట పాత మార్కెల్లా ఉండబోరన్నమాట. -
అభ్యర్థి అఫిడవిట్ ను తప్పనిసరిగా ఫైల్ చేయాలి: భన్వర్
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది. ప్రతి అభ్యర్థి అఫిడవిట్‌ను తప్పనిసరిగా ఫైల్ చేయాలని భన్వర్‌లాల్ సూచించారు. ఇంతకుముందు కొన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచేవాళ్లని, ఈసారి అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా నింపాలని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత నిబంధనలకు వ్యతిరేకంగా అన్ని కాలమ్స్ ఖాళీగా ఉంచడం కుదరదు అని భన్వర్‌లాల్ అన్నారు. అఫిడవిట్‌ను పూర్తిస్థాయిలో నింపకుంటే అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేస్తామని ఆయన తెలిపారు. విదేశాల్లో ఉన్నవారు వారి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుందని భన్వర్‌లాల్ అన్నారు. ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు అక్కౌంట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఖర్చుకూ చెక్‌ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల్లో ప్రతి లోక్‌సభ అభ్యర్థి ఖర్చు చేసేందుకు 70లక్షలు, అసెంబ్లీకి పోటీ చేసే ప్రతి అభ్యర్థి 28 లక్షల వరకూ పరిమితి ఉంటుందని ఆయన తెలిపారు. 75 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును రాజకీయ పార్టీలు చూపించాలని భన్వర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో 69,014 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నామని, ఎన్నికలను సజావుగా జరిపించేందుకు 457 కంపెనీల పారామిలటరీ బలగాలు కావాలని కోరామని, అవసరమైతే మరిన్ని బలగాలను పంపమని కోరుతామని భన్వర్‌లాల్ తెలిపారు.