అభ్యర్థి అఫిడవిట్ ను తప్పనిసరిగా ఫైల్ చేయాలి: భన్వర్
అభ్యర్థి అఫిడవిట్ ను తప్పనిసరిగా ఫైల్ చేయాలి: భన్వర్
Published Wed, Mar 5 2014 5:41 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది. ప్రతి అభ్యర్థి అఫిడవిట్‌ను తప్పనిసరిగా ఫైల్ చేయాలని భన్వర్‌లాల్ సూచించారు. ఇంతకుముందు కొన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచేవాళ్లని, ఈసారి అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా నింపాలని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత నిబంధనలకు వ్యతిరేకంగా అన్ని కాలమ్స్ ఖాళీగా ఉంచడం కుదరదు అని భన్వర్‌లాల్ అన్నారు.
అఫిడవిట్‌ను పూర్తిస్థాయిలో నింపకుంటే అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేస్తామని ఆయన తెలిపారు. విదేశాల్లో ఉన్నవారు వారి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుందని భన్వర్‌లాల్ అన్నారు. ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు అక్కౌంట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఖర్చుకూ చెక్‌ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల్లో ప్రతి లోక్‌సభ అభ్యర్థి ఖర్చు చేసేందుకు 70లక్షలు, అసెంబ్లీకి పోటీ చేసే ప్రతి అభ్యర్థి 28 లక్షల వరకూ పరిమితి ఉంటుందని ఆయన తెలిపారు.
75 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును రాజకీయ పార్టీలు చూపించాలని భన్వర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో 69,014 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నామని, ఎన్నికలను సజావుగా జరిపించేందుకు 457 కంపెనీల పారామిలటరీ బలగాలు కావాలని కోరామని, అవసరమైతే మరిన్ని బలగాలను పంపమని కోరుతామని భన్వర్‌లాల్ తెలిపారు.
Advertisement
Advertisement