సమావేశంలో మాట్లాడుతున్న దివ్యాంగుల సంఘం నాయకులు
సాక్షి, భూపాలపల్లి రూరల్: వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది డిసెంబర్ 3న జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నవంబర్ 23, 24 తేదీల్లో నిర్వహించే క్రీడలను సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, దివ్యాంగులపై చిన్నచూపుగా భావిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా(ఎంపీఆర్‌డీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగారావు అన్నారు.
శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెల చివరి వారంలో జేసీ స్వర్ణలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడలకు సంబంధించిన తేదీలను నిర్ణయించినా జిల్లా సంక్షేమశాఖ అధికారి అందుబాటులో లేడన్నారు. ఫోన్‌లో మాట్లాడితే క్రీడలు వాయిదా పడ్డాయని చెప్పారని అన్నారు. పోటీల కోసం జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చిన 50 మంది క్రీడాకారులు అధికారి తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కుమారస్వామి, వంగనర్సయ్య, నీలంబరంలు పాల్గొన్నారు.
ప్రకటించిన తేదీల ప్రకారమే ఏర్పాట్లు
ప్రకటించిన తేదీల ప్రకారమే ఈనెల 23 ఉదయమే క్రీడలకు సంబంధించి ఏర్పాట్లు చేశాం. ఉదయం 11:30 గంటల వరకు సైతం కొద్దిమంది క్రీడాకారులు మాత్రమే వచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా మంది హాజరుకాలేదు. ఈ విషయాన్ని జేసీకి చెప్పగా మిగతావారు నిరుత్పాహ పడకుండా ఉండేదుకు జేసీ ఆదేశాల మేరకు క్రీడలను వాయిదా వేశాం. త్వరతోనే తిరిగి తేదీలను ప్రకటిస్తాం. అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. - చిన్నయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment