compitetions
-
మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి!
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల నిర్వహణకు అవనియాపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మదురైలో జల్లికట్టు నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ చేశారు. జల్లికట్టును తమిళనాట ఇరుతఝువుతాల్ అని కూడా పిలుస్తారు. జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సంప్రదాయక క్రీడ. దీనిలో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా పరిగణిస్తారు. #WATCH | Tamil Nadu: Jallikattu competition begins in Avaniyapuram of Madurai. pic.twitter.com/CqRrInypX9 — ANI (@ANI) January 15, 2024 అయితే జల్లికట్టు పోటీలలో పాల్గొనేవారు ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతుంటారు. ఇటువంటి పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక అధికారులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో పలువురు గాయపడుతున్నారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో అవనియాపురంలో నిర్వహించిన జల్లికట్టుపోటీల సమయంలో 60 మంది గాయపడ్డారు. #WATCH | Tamil Nadu: Health check-up of bulls held in Madurai for the Jallikattu competition. pic.twitter.com/nvfJQVMaIn — ANI (@ANI) January 15, 2024 ఇది కూడా చదవండి: దేశవ్యాపంగా సంక్రాంతి సందడి -
సలార్ కి పోటీనా..! పాన్ ఇండియా ఛాలెంజ్
-
దివ్యాంగులపై చిన్నచూపు
సాక్షి, భూపాలపల్లి రూరల్: వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది డిసెంబర్ 3న జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నవంబర్ 23, 24 తేదీల్లో నిర్వహించే క్రీడలను సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, దివ్యాంగులపై చిన్నచూపుగా భావిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా(ఎంపీఆర్డీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెల చివరి వారంలో జేసీ స్వర్ణలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడలకు సంబంధించిన తేదీలను నిర్ణయించినా జిల్లా సంక్షేమశాఖ అధికారి అందుబాటులో లేడన్నారు. ఫోన్లో మాట్లాడితే క్రీడలు వాయిదా పడ్డాయని చెప్పారని అన్నారు. పోటీల కోసం జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చిన 50 మంది క్రీడాకారులు అధికారి తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కుమారస్వామి, వంగనర్సయ్య, నీలంబరంలు పాల్గొన్నారు. ప్రకటించిన తేదీల ప్రకారమే ఏర్పాట్లు ప్రకటించిన తేదీల ప్రకారమే ఈనెల 23 ఉదయమే క్రీడలకు సంబంధించి ఏర్పాట్లు చేశాం. ఉదయం 11:30 గంటల వరకు సైతం కొద్దిమంది క్రీడాకారులు మాత్రమే వచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా మంది హాజరుకాలేదు. ఈ విషయాన్ని జేసీకి చెప్పగా మిగతావారు నిరుత్పాహ పడకుండా ఉండేదుకు జేసీ ఆదేశాల మేరకు క్రీడలను వాయిదా వేశాం. త్వరతోనే తిరిగి తేదీలను ప్రకటిస్తాం. అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. - చిన్నయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి -
‘స్మార్ట్ పోలీసింగ్’పై పోటీలు
వరంగల్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా వరంగల్ రూరల్ పోలీసు శాఖ అధ్వర్యంలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో స్మార్ట్ పోలీసింగ్(స్మార్ట్ పోలీసింగ్ రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ కమ్యూనిటీ పోలీసింగ్) అన్న అంశంపై ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ అంశాల్లో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. అలాగే ఉత్తమ కథనం, ఛానల్స్‌లో ప్రసారమైన వార్తాకథనం అంశాల్లో విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడి యా జర్నలిస్టులకు పోటీలు ఉంటాయన్నారు. ప్రజలు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్మలిస్టులు పోలీసుల ఇమేజ్–ప్రతిభ పెంచేలా ఉండే ఫొటోలు, షార్ట్ఫిల్్మ లు, ఉత్తమ వార్త కథనాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీస్ పీఆర్ఓ తాళ్లపల్లి రామారావుకు హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చిరునామాతో పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94409 04670 నంబర్‌కు ఫోన్‌చేయాలని తెలిపారు. బహుమతుల వివరాలు.. ‘స్మార్ట్ పోలీసింగ్–రోల్ ఆఫ్ సోషల్ మీడియా’ అనే అంశంపై పోలీసుల సేవ తెలిపేలా 10 నిమిషాలకు మించని తక్కువ నిడివిగల షార్ట్ఫిల్్మలను, 11“14 సైజు గల ఫొటోలు, పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, ఛానెల్స్‌లో ప్రసారమైన వార్తా కథనాలు ఈ పోటీలకు స్వీకరిస్తామన్నారు. ఫొటోలు, షార్ట్ఫిల్్మలు ఉత్తమవార్త, ఉత్తమ వార్తా కథనం(ఎలక్ట్రానిక్ మీడియా) వార్తలన్నీ 2016 జనవరి 1వ తేదీ నుంచి 31 జులై 2016లోపు ఉండాలన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీలను పరిగణిస్తామని ఎస్పీ వివరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానానికి ఎంపిౖకైన వారికి రూ.10 వేలు, ద్వితీయ స్థానానికి రూ.5 వేలు, తృతీయ స్థానానికి రూ.3 వేలు ఇస్తామని వీటితోపాటు 5 ప్రత్యేక జ్యూరీ నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ పోటీల్లో మూడు స్థానాల్లో ఎంపికైన వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు అంశాలవారిగా మొదటి బహుమతికి రూ.50 వేలు, రెండో బహుమతికి రూ.25 వేలు, మూడో బహుమతికి రూ.10 వేలు, 5 స్పెషల్ జ్యూరీ అవార్డులు అందిస్తామన్నారు. ఈ ఎంట్రీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ కమిటీ పారదర్శకంగా పరిశీలించి ఎంపిక చేస్తుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
వంటల పోటీలు నిర్వహించండి: చంద్రబాబు
కర్నూలు: సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాల్లో వంటల పొటీలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కర్నూలు నుంచి అధికారులతో చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ గ్రామాలను దత్తత తీసుకున్నవారిని సన్మానించాలన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం తిరుపతి చేరుకొని ఎస్పీ జేఎన్ఎం హైస్కూల్లో నిర్వహించే జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గోనున్నారు. తర్వాత తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ప్రభుత్వ అధికారులతో తిరుపతి స్మార్ట్ సిటీపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సెవెన్‌హిల్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరనున్నారు.