‘స్మార్ట్ పోలీసింగ్’పై పోటీలు
Published Sat, Aug 6 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
వరంగల్ :
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా వరంగల్ రూరల్ పోలీసు శాఖ అధ్వర్యంలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో స్మార్ట్ పోలీసింగ్(స్మార్ట్ పోలీసింగ్ రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ కమ్యూనిటీ పోలీసింగ్) అన్న అంశంపై ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ అంశాల్లో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు.
అలాగే ఉత్తమ కథనం, ఛానల్స్‌లో ప్రసారమైన వార్తాకథనం అంశాల్లో విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడి యా జర్నలిస్టులకు పోటీలు ఉంటాయన్నారు. ప్రజలు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్మలిస్టులు పోలీసుల ఇమేజ్–ప్రతిభ పెంచేలా ఉండే ఫొటోలు, షార్ట్‌ఫిల్‌్మ లు, ఉత్తమ వార్త కథనాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీస్ పీఆర్‌ఓ తాళ్లపల్లి రామారావుకు హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చిరునామాతో పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94409 04670 నంబర్‌కు ఫోన్‌చేయాలని తెలిపారు.
బహుమతుల వివరాలు..
‘స్మార్ట్ పోలీసింగ్–రోల్ ఆఫ్ సోషల్ మీడియా’ అనే అంశంపై పోలీసుల సేవ తెలిపేలా 10 నిమిషాలకు మించని తక్కువ నిడివిగల షార్ట్‌ఫిల్‌్మలను, 11“14 సైజు గల ఫొటోలు, పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, ఛానెల్స్‌లో ప్రసారమైన వార్తా కథనాలు ఈ పోటీలకు స్వీకరిస్తామన్నారు. ఫొటోలు, షార్ట్‌ఫిల్‌్మలు ఉత్తమవార్త, ఉత్తమ వార్తా కథనం(ఎలక్ట్రానిక్ మీడియా) వార్తలన్నీ 2016 జనవరి 1వ తేదీ నుంచి 31 జులై 2016లోపు ఉండాలన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీలను పరిగణిస్తామని ఎస్పీ వివరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానానికి ఎంపిౖకైన వారికి రూ.10 వేలు, ద్వితీయ స్థానానికి రూ.5 వేలు, తృతీయ స్థానానికి రూ.3 వేలు ఇస్తామని వీటితోపాటు 5 ప్రత్యేక జ్యూరీ నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ పోటీల్లో మూడు స్థానాల్లో ఎంపికైన వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు అంశాలవారిగా మొదటి బహుమతికి రూ.50 వేలు, రెండో బహుమతికి రూ.25 వేలు, మూడో బహుమతికి రూ.10 వేలు, 5 స్పెషల్ జ్యూరీ అవార్డులు అందిస్తామన్నారు. ఈ ఎంట్రీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ కమిటీ పారదర్శకంగా పరిశీలించి ఎంపిక చేస్తుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
Advertisement