వంటల పోటీలు నిర్వహించండి: చంద్రబాబు | conduct cooking compitetions says chandrababu | Sakshi
Sakshi News home page

వంటల పోటీలు నిర్వహించండి: చంద్రబాబు

Published Thu, Jan 7 2016 9:16 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

వంటల పోటీలు నిర్వహించండి: చంద్రబాబు - Sakshi

వంటల పోటీలు నిర్వహించండి: చంద్రబాబు

కర్నూలు:
సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాల్లో వంటల పొటీలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కర్నూలు నుంచి అధికారులతో చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ గ్రామాలను దత్తత తీసుకున్నవారిని సన్మానించాలన్నారు.

కాన్ఫరెన్స్ అనంతరం తిరుపతి చేరుకొని ఎస్పీ జేఎన్ఎం హైస్కూల్లో నిర్వహించే జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గోనున్నారు. తర్వాత తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ప్రభుత్వ అధికారులతో తిరుపతి స్మార్ట్ సిటీపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సెవెన్హిల్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement