‘కాళ్లలో కట్టెలు పెట్టడమే వారి అజెండా’ | trs mla guvvala bala raju fire on congress | Sakshi

‘కాళ్లలో కట్టెలు పెట్టడమే వారి అజెండా’

Jul 1 2016 8:55 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ కాంగ్రెస్ నాయకులు సైంధవుల్లా తయారయ్యారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండి పడ్డారు.

హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ కాంగ్రెస్ నాయకులు సైంధవుల్లా తయారయ్యారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండి పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టడమే అజెండాగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

నాడు తెలంగాణ రాకుండా అడ్డంపడిన ఉత్తమ్, భట్టి వంటి కాంగ్రెస్ నేతలే ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని వివాదం చేస్తున్నారని విమర్శించారు. డి.కె.అరుణ అడిగిన వెంటనే జిల్లా ఇవ్వడానికి అదేమీ గద్వాల సంస్థానం కాదని, జనం కోరితేనే కొత్త జిల్లాలు వస్తాయని, కాంగ్రెస్ నాయకుల ఆధిపత్యం కోసం కొత్త జిల్లాలు రావని బాలరాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement