guvvala bala raju
-
అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు!
సాక్షి, అచ్చంపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మరోవైపు, ఎన్నికల సందర్బంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు స్వల్పంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. అనంతరం, పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. వివరాల ప్రకారం.. అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు ఆపకపోవటంతో వాహనాన్ని వెంబడించారు. అచ్చంపేటలోని అంబేడ్కర్ కూడలిలో అడ్డుకొని వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఇక, ఈ రాళ్ల దాడిలో కొందరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరనన తెలిపారు. డబ్బు సంచులతో అడ్డంగా దొరికిపోయిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు,ఓటర్లకు డబ్బు పంచేందుకు తరలిస్తున్న వైనం. అడ్డుకుంనేదుకు ప్రయత్నించిన కాంగ్రెస్స్ కార్యకర్తల పైకి కారు ఎక్కించే ప్రయత్నం #Achampet@CEO_Telangana#TelanganaAssemblyElections2023 pic.twitter.com/RprOdxMY9U — Yashwanth Reddy🇮🇳 (@Yashwanthgarla1) November 12, 2023 ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి చేశారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద కాంగ్రెసు గుండాల దాడి., వరుస ఓటమి భయంతో దాడికి తెగబడిన గుండాలు.. ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి పైకి రాళ్ళు విసిరిన వంశీకృష్ణ.. pic.twitter.com/58XVCelhd3 — Guvvala Balaraju (@GBalarajuTrs) November 11, 2023 మరోవైపు.. ఈ ఘటనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ స్పందిస్తూ.. వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారమిచ్చినా అడ్డుకోలేదన్నారు. డబ్బున్న సంచులు పట్టించినా ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. గువ్వల బాలరాజుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులే ప్రత్యేక సెక్యూరిటీ ఇస్తున్నారని ఆరోపించారు. -
అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గంలో ఇప్పుడు ఆధిపత్యం వహించేది ఎవరు?
అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గం అచ్చంపేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెండోసారి గెలిచారు. టిఆర్ఎస్ పక్షాన మళ్లీ పోటీచేసిన బాలరాజు తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణపై 9114 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. బాలరాజుకు 88073 ఓట్లు రాగా వంశీకృష్ణకు 78959 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మల్లేశ్వర్‌కు మూడువేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. అచ్చంపేట రిజర్వుడ్ నియోజకవర్గంలో 2014 నుంచి టిఆర్ఎస్ పాగా వేసింది.2014లో మాజీ మంత్రి టిడిపి నేత రాములు 24199 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావల్సి వచ్చింది. రాములు ఇక్కడ 1994, 99,2009లలో మూడుసార్లు గెలిచారు. టిఆర్ఎస్ పక్షాన బాలరాజు 2014లో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను 11820 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇక్కడ నుంచి నాలుగుసార్లు, నాగర్‌కర్నూల్ నుంచి రెండుసార్లు గెలిచిన సీనియర్ నేత పుట్టపాగ మహేంద్రనాధ్కు టిడిపి నేత రాములు సమీప బంధువు అవుతారు. వీరిద్దరూ మంత్రి పదవులు నిర్వహించారు. మహేంద్రనాధ్ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేస్తే, రాములు కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా వున్నారు. రాములు తదుపరి టిఆర్ఎస్లో చేరి 2019 లోక్‌సభ ఎన్నికలలో నాగర్ కర్నూలు నుంచి గెలుపొందారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె. నాగన్న షాద్‌నగర్, కల్వకుర్తి, అలంపూర్‌లలో కలిపి మొత్తం నాలుగుసార్లు అసెంబ్లీకి గెలిచారు. అచ్చంపేట ఆది నుంచి ఎస్.సి నియోజకవర్గంగానే ఉంది. ఆరుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ గెలిస్తే ఐదుసార్లు టిడిపి,రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచాయి. ఇది రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఎస్.సి.నేతలే ఎన్నికవుతున్నారు. అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఏంటి గువ్వల ఇది?
-
బీజేపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విశ్వరూపం
-
బీఆర్ఎస్ నేతల మధ్య వార్.. వారి ఫోన్ సంభాషణ ఇలా
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిలోని ఇద్దరు ముఖ్య నేతల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు వార్ కొనసాగుతోంది. . ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు ఒకే పార్టీలో ఉన్నా.. ఇరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీల లొల్లి మొదలు ఎమ్మెల్యే, ఎంపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరడం.. వారి ఫోన్ సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి ఫోన్ సంభాషణ ఇలా.. గువ్వల: నియోజకవర్గంలో నీ కొడుకు ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు. పోతుగంటి: ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటది బాలరాజ్. గువ్వల: పార్టీలో ఉండదట్ల.. పోతుగంటి: అయితే పార్టీలో తేల్చుకుందాం.. గువ్వల: నాకున్న అధికారాన్ని నేను ఉపయోగిస్తా. పోతుగంటి: నేను జిల్లా అధ్యక్షుడిగా పని చేశా. నాకు తెలుసు. నీకిచ్చే గౌరవం నీకిస్తా. నాకిచ్చే గౌరవం నాకుంటది. చేసేది చేసి అంతా అయిపోయింది అంటే ఎట్లా? గువ్వల: అందులో సంబంధం ఉందంటే భవిష్యత్‌లో కూడా చేస్తా. పోతుగంటి: చేసుకోవయ్యా.. నేనొద్దన్నానా ? గువ్వల : వయా గియా అని మాట్లాడకు. మంచిగా మాట్లాడు. సర్ అని పిలుస్తుంటే వయా అంటవ్.. అటెండర్ మాట్లాడినట్లు మాట్లాడతవ్.. పోతుగంటి: వయా అంటే ఏంది అర్థం.. అయ్యా బాలరాజ్ గారు.. మీరు చేసేది చేసుకోండి. దాని గురించి ఎందుకంత కోపం.. గువ్వల: ఇక నుంచి నీ కొడుకు పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు. ఈ రోజు, రేపు తీసేయండి. రాములు: అంటే.. అంటే.. నీ బెదిరింపులు నాకాడా పనికి రావు. గువ్వల: రికార్డు చేసుకో.. ఎవరికైనా చెప్పుకో.. అట్లే చేస్తే నీ కొడుక్కి పార్టీ పరంగా మర్యాద ఉండదు. పోతుగంటి: నా కొడుకు నాకు సహకారంగా ఉంటడు. ఎవరి కొడుకు వారు సహకారంగా ఉంటడు. మరి నీ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు? గువ్వల: మా అభిమానులు కట్టారు. పోతుగంటి: మాకూ అభిమానులే కట్టారు. గువ్వల: ఇలా చేస్తే మంచిగుండదు. పోతుగంటి: నీ బెదిరింపులు నా వద్ద చెల్లవు. ఈ విషయం అధిష్టానం వద్దే చూసుకుందాం. -
ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ వేదికగా జరిగిన ఘటనను ఖండిస్తూ అధికార పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర చండూరు: టీఆర్ఎస్ను చూస్తుంటే బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ తమను టార్గెట్ చేసిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. చండూరులో విలేకరు లతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలో సింహ యాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ల ద్వారా టీఆర్ఎస్కు చెందిన గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను రూ.100 కోట్లకు పైగా నగదు, కాంట్రాక్టులు, ఇతర పదవులను ఇవ్వజూపి బీజేపీలోకి రావాలని ప్రలోభ పెట్టే యత్నం జరిగిందని తెలిపారు. ఇదే విషయం తమ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో భారీ మెజారీ్టతో గెలవబోతోందని.. బీజేపీ డిపాజిట్ కోల్పోతుందనే భయంతో కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అడ్డదారిన.. దొడ్డి దారిన కొనే యత్నం మొదలు పెట్టిందని సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ నాటకాలాడితే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రలోభాలకు లోనుకారు.. అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పరిహాసం చేస్తోంది. ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వం సాగిస్తోంది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగరు. బీఆర్ఎస్తో ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం. కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతున్నందునే ఈ కుతంత్రం. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు దురాలోచనతో అడ్డదారులు ఎంచుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదు. కేసీఆర్ ముందు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. – మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి మోదీ, అమిత్ షా కుట్ర దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ ఓర్వలేక మోదీ, అమిత్ షా కుట్ర జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరహాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగే రకం కాదు. – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలంగాణలో కుదరదు మునుగోడులో విజయం సాధించలేమనే భయంతోనే నీచ రాజకీయాలను బీజేపీ మొదలు పెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీ తరం కాదు. మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కుదరదు. –శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ బేరసారాలకు లొంగదు టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదు. ఇది కే సీఆర్ పార్టీ ఎవరూ కొనుగోలు చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం. – గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ -
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: గువ్వల బాలరాజు
-
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలకు వల వేసేందుకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసి భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. ఇది కేసీఆర్ పార్టీ.. ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు.. తెలంగాణ సమాజం అమ్ముడుపోదన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నిస్సిగ్గుగా తమ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా బీజేపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా కుట్రను బయటపెట్టారని అన్నారు. ఇదీ చూడండి: మునుగోడు లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలకు వల.. రూ.100 కోట్లతో డీల్ -
‘కాళ్లలో కట్టెలు పెట్టడమే వారి అజెండా’
హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ కాంగ్రెస్ నాయకులు సైంధవుల్లా తయారయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండి పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టడమే అజెండాగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. నాడు తెలంగాణ రాకుండా అడ్డంపడిన ఉత్తమ్, భట్టి వంటి కాంగ్రెస్ నేతలే ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని వివాదం చేస్తున్నారని విమర్శించారు. డి.కె.అరుణ అడిగిన వెంటనే జిల్లా ఇవ్వడానికి అదేమీ గద్వాల సంస్థానం కాదని, జనం కోరితేనే కొత్త జిల్లాలు వస్తాయని, కాంగ్రెస్ నాయకుల ఆధిపత్యం కోసం కొత్త జిల్లాలు రావని బాలరాజు పేర్కొన్నారు.