అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గం
అచ్చంపేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెండోసారి గెలిచారు. టిఆర్‌ఎస్ పక్షాన మళ్లీ పోటీచేసిన బాలరాజు తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణపై 9114 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. బాలరాజుకు 88073 ఓట్లు రాగా వంశీకృష్ణకు 78959 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మల్లేశ్వర్‌కు మూడువేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి.
అచ్చంపేట రిజర్వుడ్ నియోజకవర్గంలో 2014 నుంచి టిఆర్‌ఎస్ పాగా వేసింది.2014లో మాజీ మంత్రి టిడిపి నేత రాములు 24199 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావల్సి వచ్చింది. రాములు ఇక్కడ 1994, 99,2009లలో మూడుసార్లు గెలిచారు. టిఆర్‌ఎస్ పక్షాన బాలరాజు 2014లో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను 11820 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇక్కడ నుంచి నాలుగుసార్లు, నాగర్‌కర్నూల్ నుంచి రెండుసార్లు గెలిచిన సీనియర్ నేత పుట్టపాగ మహేంద్రనాధ్‌కు టిడిపి నేత రాములు సమీప బంధువు అవుతారు.
వీరిద్దరూ మంత్రి పదవులు నిర్వహించారు. మహేంద్రనాధ్ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేస్తే, రాములు కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా వున్నారు. రాములు తదుపరి టిఆర్‌ఎస్‌లో చేరి 2019 లోక్‌సభ ఎన్నికలలో నాగర్ కర్నూలు నుంచి గెలుపొందారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె. నాగన్న షాద్‌నగర్, కల్వకుర్తి, అలంపూర్‌లలో కలిపి మొత్తం నాలుగుసార్లు అసెంబ్లీకి గెలిచారు. అచ్చంపేట ఆది నుంచి ఎస్.సి నియోజకవర్గంగానే ఉంది. ఆరుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ గెలిస్తే ఐదుసార్లు టిడిపి,రెండుసార్లు టిఆర్‌ఎస్ గెలిచాయి. ఇది రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఎస్.సి.నేతలే ఎన్నికవుతున్నారు.
అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment