జిల్లా ఏర్పాటు చరిత్రాత్మకం | asifabad district formation historical | Sakshi
Sakshi News home page

జిల్లా ఏర్పాటు చరిత్రాత్మకం

Published Sat, Oct 15 2016 12:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

asifabad district formation historical

రెబ్బెన : అన్ని రంగాల్లో వెనకబడిన ఆసిఫాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయటం చారిత్రాత్మకమని తెలంగాణ గౌడ  సంఘం నియోజక వర్గ ఇన్‌చార్జి మోడెం సుదర్శన్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ సన్మానించారు.  ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కుంమ్రం భీం జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ది చెందేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి జిల్లాను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కృషి మరువలేనిదని కొనియాడారు.


 కార్యక్రమంలో  గౌడసంఘం మండల అధ్యక్షుడు అన్నపూర్ణ, సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి కిష్టాగౌడ్, నాయకులు చిరంజీవిగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, రాజాగౌడ్, ఉమేష్‌గౌడ్, రాజాగౌడ్, మహేష్‌గౌడ్, శాంతికుమార్‌గౌడ్, సర్వేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement