'ఉద్యమాలు మాకు కొత్త కాదు'
హైదరాబాద్: తెలంగాణకూ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే ఉద్యమం చేపడతామని, పోరాటాలు తమకు కొత్తకాదని అన్నారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీపై రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.