హైదరాబాద్: నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోకపోతే సంక్రాంతి పండుగ తర్వాత రోడ్లపైకి వచ్చి ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటామని ఆయన అన్నారు.