హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపైన ఉన్న ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు సెక్షన్ - 8ను తెరపైకి తీసుకు వస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సెక్షన్ -8 అంటే మరో ఉద్యమం తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలన్నీ సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సెక్షన్ -8లో తప్పేముంది
ఇదిలా ఉండగా.. సెక్షన్ -8 అమలు చేస్తే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోనే సెక్షన్ - 8 ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
'సెక్షన్ - 8 అంటే మరో ఉద్యమమే'
Published Tue, Jun 23 2015 12:03 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement