ఖమ్మం: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతానికి పంపించేందుకు కమల్‌నాథ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీజీవో గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఆదివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. విభజన నియామకాలకనుగుణంగా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వారి ప్రాంతానికి పంపించాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులను విభజించి కేటాయింపులు చేయాలని, తెలంగాణలో ఖాళీలు లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు కేటాయించి.. ఈ ప్రాంతం వారినే తీసుకుంటామని చెప్పారు.
ఇన్‌కంట్యాక్స్ పరిధిని రూ. 5 లక్షలకు పెంచాలని, టీడీఎస్ పద్ధతిని సులభతరం చేసి, డ్రాయింగ్ ఆధికారులను మానసిక ఇబ్బందుల నుంచి విముక్తి చేయాలని, 2004 తర్వాత నియామకం పొందిన ఉద్యోగులకు సీపీఎస్ పద్ధతి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సమావేశంలో టీజీవో జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాజామియా, సత్యనారాయణ, జనార్దన్, ప్రేమ్‌కిరణ్, అచ్చయ్యగౌడ్, కిరణ్ పాల్గొన్నారు.
'ఆంధ్రా ఉద్యోగులను పంపించివేయాలి'
Published Sun, May 8 2016 10:11 PM | Last Updated on Sat, Jun 2 2018 7:11 PM
Advertisement
Advertisement