హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్కే సాధ్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని సాధించిన గౌరవం సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా అమరవీరులైన కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమరులను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించాలని సభ్యుడు చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.