నోముల అకాల మరణం : ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి | Kavitha mourns death of Trs mla Nomula | Sakshi
Sakshi News home page

నోముల అకాల మరణం : ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి

Published Tue, Dec 1 2020 8:32 AM | Last Updated on Tue, Dec 1 2020 9:03 AM

Kavitha mourns death of Trs mla Nomula - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య  (64) అకాల మరణంపై  నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత  కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులంటూ నోముల సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె నోముల కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు  తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్‌రావుకూడా నోముల మృతిపై విచారం వ్యక్తం చేశారు. (టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత)

కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస తీసకున్నారు.  ఈ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.  ఆయన పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని టీఆర్‌ఎస్‌ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement