కొప్పుల ఈశ్వర్ కు బుజ్జగింపు
హైదరాబాద్: మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ తో భేటీ కావాలని ఆయన భావిస్తున్నారు.
మరోవైపు ఆదివారం ఆయన కరీంనగర్ లో ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. మొదట్లో ఆయనకు డిప్యూటీ సీఎం దక్కుతుందని ప్రచారం జరిగినా ఫలించలేదు. మలి విడతలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు రుగైయ్యారు.