టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం | TRS MLA Gampa Govardhan escapes a car accident | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

Published Thu, Apr 9 2015 12:57 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

మెదక్ జిల్లా: కామారెడ్డి ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్థన్ కాన్వాయ్‌లో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జరిగింది. వివరాలు.. కాన్వాయ్ వేగంగా వెళ్తుండగా అడవి పంది అడ్డువచ్చింది. దీంతో డైవర్లు ఒక్క సారిగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో విప్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలు బాగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న పార్టీ నాయకులు ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, గంపగోవర్థన్‌కు ప్రయాణిస్తున్న వాహనం మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
(రామాయంపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement