gampa govardhan
-
Kamareddy : కామారెడ్డి చరిత్ర ఘనం.. ఘాటు రాజకీయం
కామారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గం.. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ రేసులో ఉంటానని ప్రకటించారు. ఇక్కడి నుంచి 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పక్షాన గంపా గోవర్దన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ పడగా, గోవర్దన్ నే విజయం వరించింది. గోవర్దన్ 4557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్ కు 68162 ఓట్లు రాగా, షబ్బీర్ అలీకి 63610 ఓట్లు వచ్చాయి. గోవర్దన్ బిసిలలోని పెరిక సామాజికవర్గానికి చెందినవారు.గతంలో ఈయన టిడిపిలో ఉండేవారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరసగా గెలుస్తున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. గతంలో.. టీడీపీ పక్షాన రెండుసార్లు, టిఆర్ఎస్ తరపున మూడుసార్లు గెలిచారు. కాగా కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీచేసిన కె.వెంకటరమణారెడ్డికి పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్దన్ రెండువేల తొమ్మిదిలో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కామారెడ్డిలో నాలుగుసార్లు రెడ్డి నేతలు,తొమ్మిదిసార్లు బిసిలు, రెండుసార్లు ఎస్.సిలు గెలవగా, మూడుసార్లు ముస్లింలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కామారెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు టిఆర్ఎస్ మూడుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. టి.ఎన్. సదాలక్ష్మి ఇక్కడ ఒకసారి,ఎల్లారెడ్డిలో మరోసారి గెలిచారు. సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, షబ్బీర్ అలీ 1990లో చెన్నారెడ్డి, 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి, 2004 నుంచి ఐదేళ్లపాటు వ్కె.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.తదుపరి ఒకసారి ఎమ్మెల్సీ అయి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా షబ్బీర్ ఉన్నారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999లో టిడిపి తరుఫున గెలిచిన యూసఫ్ అలీ విప్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. గంపా గోవర్దన్ కూడా విప్ అయ్యారు. కామారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వివాదంలో కామా రెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్
-
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి NSUI యత్నం
-
అందుకే గందరగోళం.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ఎమ్మెల్యే క్లారిటీ..
కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్‌ను మారుస్తామని చెప్పారు. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూముల్లోకి మారస్తామని పేర్కొన్నారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను, ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగిస్తామని తెలిపారు. డీటీసీపీ, కన్సల్టెన్సీ అధికారుల తప్పిదంతోనే గందరళగోళం నెలకొందని గంప వివరణ ఇచ్చారు. రైతులకు చెందిన గుంట భూమి కూడా పోదని హామీ ఇచ్చారు. కౌన్సిల్ సమావేశం తర్వాత మాస్టర్‌ప్లాన్ ఫైనల్ చేస్తామన్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థానిక రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ భూమి పోతోందని పెద్దఎత్తున్న ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. ప్రతిపాదిత ప్లాన్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు గడువు ఉందని గుర్తు చేశారు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్
-
‘విద్యా రంగానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు’
సాక్షి, కామారెడ్డి : విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి సబిత పాల్గొన్నారు. బీటీఎస్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో 2 కోట్ల 95 లక్షలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు పాఠశాల దాత తిమ్మారెడ్డి సుభాష్ రెడ్డి సొంత ఖర్చులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మనసున్న మనిషిగా పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని చెప్పారు. చదవండి: ఆగ్రహం: మంత్రి సబితకు నిరసన సెగ కరోనా లాక్ డౌన్ సమయంలో రైతాంగం, విద్యారంగాలపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. రైతు పండించిన పంటని ఇంటికి తీసుకురావడంతో పాటు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశారన్నారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా విద్యాబోధన కొనసాగుతోందని, ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే విద్యాబోధన అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని వివరించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రతి రంగంలో కామారెడ్డి నియోజకవర్గం ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు -
గంప నారాజ్!
కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమన్నదే ఎరుగని రికార్డు సొంతం చేసుకున్న సీనియర్ నేత గంప గోవర్ధన్‌కు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికార పార్టీ సభ్యుడైనా.. ‘విప్’ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన నారాజ్ అయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేతకు గెలుపును దూరం చేసిన తమ నేతకు అమాత్యయోగం దక్కకపోవడంతో ఆయన అనుచరులూ నిరాశచెందుతున్నారు. సాక్షి, కామారెడ్డి: వరుస విజయాలతో జోరు మీదున్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ విప్ పదవితోనే సరిపెట్టడంతో ఆయన నిరాశచెందుతున్నారు. గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజక వర్గంలో బలమైన నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీని పలుమార్లు ఓడించారు. 1994లో తొలిసారి కామారెడ్డి నియోజకవర్గంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సొంతం చేసుకుని ఎమ్మెల్యే అయ్యారు. 1999 ఎన్నికల్లో పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో కొంత నిరాశ చెందారు. 2009 ఎన్నికల్లో మరోసారి టీడీపీ టికెట్టు ఇచ్చింది. ఆ ఎన్నికల్లోనూ ఆయన షబ్బీర్ అలీపై గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో ఆయన టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే ప్రభుత్వం విప్ పదవితోనే సరిపెట్టింది. ఆయన ఐదేళ్లపాటు విప్‌గా పనిచేశారు. 2018 ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో ఈసారి తనకు మంత్రి పదవి వస్తుందని గంప ఆశలుపెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పలుమార్లు కలిసి మంత్రి పదవి ఇవ్వాలని విన్నవించినట్లు సమాచారం. ఈసారి తప్పకుండా అవకాశం వస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీం తో మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని గంప ఆశించారు. అయితే ప్రభుత్వం ఆయనను రెండోసారీ నిరాశకు గురిచేసింది. విప్ పదవితోనే సరిపెట్టింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన కొంత ముభావంగా కనిపించారు. ఆదివారం భిక్కనూరు మండలంతో పాటు కామారెడ్డి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రెండోసారి ప్రభుత్వ విప్ పదవి రావడంతో ఆయన అనుచరులు అభినందించడానికి రాగా.. సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అమాత్యయోగం రాలేదన్న బాధలో ఉన్న ఆయన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి వెను దిరిగారే తప్ప ఎక్కడా స్పీచ్‌లు కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సన్మానాలను కూడా ఆయన తిరస్కరించారు. ఎమ్మెల్యే నారాజ్‌లో ఉన్నాడని తెలిసిన ఆయన అనుచరులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. సాయంత్రానికి గోవర్ధన్ హైదరాబాద్ తిరిగి వెళ్లారు. -
తిరుగులేని నేత
కామారెడ్డి క్రైం: అభివృద్ధి, సంక్షేమానికే కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. సొంత నియోజకవర్గంలో ఓటమి లేకుండా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్ తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపును పొందారు. ఎమ్మెల్యే గా గెలిచిన ప్రతిసారి సంక్షేమ పథకాల అమలులో తనదైన ముద్ర వేసుకున్నారు. తద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ బలమైన కేడర్‌ను, పట్టును సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపైనే ప్రజల్లోకి వెళ్లారు. అన్ని ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అమలైన సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వంతో పాటు c అవకాశం ఇచ్చారు. ఐదోసారి ఎమ్మెల్యేగా.. భిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన గంపగోవర్ధన్ 1987లో సింగిల్‌విండో చైర్మన్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. 1999లో యూసుఫ్‌అలీకి, 2004లో టీడీపీతో పొత్తులో భాగంగా కామారెడ్డి స్థానం బీజేపీకి దక్కడంతో గంపగోవర్ధన్ పోటీ చేయలేదు. ఈ కాలంలో ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో 2వ సారి టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంగా టీడీపీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి 2011లో టీఆర్ఎస్లో చేరారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 4వ సారి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్ ప్రభుత్వవిప్ అయ్యారు. 2018 ఎన్నికల్లో 5వ సారి కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి తిరుగులేని నేతగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. షబ్బీర్‌అలీపై పైచేయి గంపగోవర్ధన్‌కు తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలో ఇప్పటి వరకు ఓటమి లేదు. 2004లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగం గా కామారెడ్డి స్థానం బీజేపీకి కేటాయించారు. దీంతో గంపగోవర్ధన్ పక్క నియోజకవర్గమైన ఎల్లారెడ్డి నుంచి టీడీపీ టిక్కెట్ పొంది ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అక్కడ ఓటమి పాలయ్యారు. దీనిని మినహాయిస్తే ఆయనకు తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలో మాత్రం ఓటమి ఎదురుకాలేదు. పోటీ చేసిన ప్రతిసారి విజయం వరించింది. చిరకాల ప్రత్యర్థులైన గంపగోవర్ధన్, షబ్బీర్‌అలీల మధ్యే నాలుగుసార్లు ప్రధానపోటీ నెలకొంది. నాలుగుసార్లు గంపగోవర్ధన్దే పైచేయి అయింది. నాలుగుసార్లు షబ్బీర్‌అలీపై, 2012 ఉప ఎన్నికల్లో ఎడ్లరాజిరెడ్డి పై ఆయన గెలిచారు. బలమైన క్యాడర్‌తో పాటు నియోజకవర్గంలో అత్యంత ప్రజాధారణ కలిగిన నేతగా జిల్లాస్థాయిలో గుర్తింపును సాధించారు. -
కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం
సాక్షి, దోమకొండ : కాళేశ్వరం నీటితో ఉత్తర తెలంగాణ లోని ఐదు జిల్లాల్లో భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం మండలంలోని అంచనూరు, లింగుపల్లిల్లో ఆయన రైతుబంధు పథకం చెక్కు లు, పాస్‌బుక్కులను రైతులకు అందించి మాట్లాడారు. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పంటల పెట్టుబడికి అన్నదాతలు అప్పులు తీసుకోకుండా ఉండేందు కు ఎకరాకు రూ.4వేల ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. వచ్చే రెండేళ్లల్లో కాళేశ్వరం నీరు వస్తుందన్నారు. నగదు కొరత రాకుండా రిజర్వు బ్యాంకుతో మాట్లాడి సీఎం డబ్బులు బ్యాంకుల్లో అందుబాటులో ఉంచామన్నారు. రైతులు తమ పంట దిగుబడులు పెంచి రాష్ట్ర పేరును దేశంలో ముందుంచాలన్నారు. రైతుల కోసం బబ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించామన్నారు. రైతు మర ణిస్తే రూ.5లక్షల ఇన్సూరెన్స్‌ను అందిస్తామన్నా రు. జెడ్పీటీసీ మధుసూదన్‌రావ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కుంచాల శేఖర్, విండో చైర్మన్ నర్సారెడ్డి, గ్రామ సర్పంచ్‌లు లక్ష్మణ్, సైదు లింగం, ఎం పీటీసీ స్వామిగౌడ్, నాయకులు పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావ్, సాయిరెడ్డి, చంద్రం, గోపి, చిన్న అంజయ్య, లక్ష్మయ్య, తహసీల్దార్ సాయిభుజంగ్రావ్, ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్, డీటీ తిర్మల్రావ్, వీఆర్వో నర్సింలు ఉన్నారు. ఇది రైతు రాజ్యం.. భిక్కనూరు: రామరాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాల్లో చదివామని ఇప్పుడు సీఏం కేసీఆర్ పాలన రైతు రాజ్యంగా మారిందని కళ్లారా చూస్తున్నామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం మండలంలోని కాచాపూర్‌లో రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో మాట్లాడారు. గల్ఫ్‌కు వెళ్లినవారి భూములకు ఇచ్చే చెక్కులను వారి కుటుంబీకులకు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరానని రెండు రోజుల్లో ఈ విషయమై సీఎం కేసీఆర్ అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేస్తారన్నారు. గత పాలకులు రైతులను నిర్లక్ష్యం చేయడంతోనే వ్యవసాయం కుంటుపడిందన్నా రు. ఇప్పుడు వ్యవసాయం అంటే పండుగ అనేలా ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీపీ తోగరి సుదర్శన్, డీసీసీబీ డైరెక్టర్ కిష్టగౌడ్, సర్పంచ్‌లు యాదయ్య, నర్సింహరెడ్డి, ఎంపీటీసీ కవిత, రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్ మహేందర్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ జాంగారి రాజిరెడ్డి, నేతలు రాజాగౌడ్, అబ్బబాల్కిషన్, నీల శ్రీనివాస్, నీలంరెడ్డి, మల్లారెడ్డి, మురళి, సాయిరెడ్డి ఉన్నారు. -
ఆర్నెళ్లల్లో 1700 ‘డబుల్’ పనులు ప్రారంభిస్తాం
కామారెడ్డి అర్బన్: వచ్చే ఆర్నెళ్లల్లో అర్హులైన లబ్ధిదారులకు 1700 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు పనులు ప్రా రంభిస్తామని ఎమ్మెల్యే, విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని లింగాయిపల్లిలో 40 ఇళ్లకు, ఇందిరానగర్ కాల నీ సమీపంలో 300 ఇళ్ల నిర్మాణానికి శనివారం విప్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన సభల్లో మాట్లాడారు. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూంలు నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉం దన్నారు. ఇవి ఆర్నెళ్లల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.40 లక్షలు, మౌలిక వసతు ల కోసం రూ.1.20లక్షలు వ్యయం చేస్తున్నామన్నారు. పట్టణంలోని రామేశ్వర్‌పల్లి వద్ద 200 ఇళ్ల నిర్మా ణం జరుగుతుందన్నారు. ఎంపీపీ మంగమ్మ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకట్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పి.ఆంజనేయులు, ఆత్మకమిటీ చైర్మన్ బల్వంత్‌రావు, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, కాంశెట్టి, పిప్పిరి వెంకటి, లక్ష్మారెడ్డి, సంగిమోహన్, మంద వెంకటేశ్వర్‌రెడ్డి, రవితేజగౌడ్, సర్పంచ్‌లు డి. అంజమ్మ, రమాగౌడ్, ముల్కరాజు, బాల్‌కిషన్‌గౌడ్, ఎంపీటీసీలు బాల్‌రాజ్, గంగాధర్‌రావు, నాయకులు అంజల్రెడ్డి, రవి, కిషన్‌గౌడ్, లక్కాకుల రాజుకుమార్, లింగం, సాయాగౌడ్ ఉన్నారు. పేదలకు సర్కారు అండగా ఉంటుంది సాక్షి, కామారెడ్డి: పేద ప్రజలకు ప్రభు త్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. శనివారం కామారెడ్డిలోని ఆర్అండ్బీ అతిథిగృ హంలో ఆరుగురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2.35 లక్షలు, కల్యాణలక్ష్మి ద్వారా 8మందికి మంజూ రైన రూ.5.20 లక్షలు, గుడుంబా అమ్మ కం మానేసిన కుటుంబానికి పునరావా సం కింద రూ.2లక్షల చెక్కులను ఆయ న పంపిణీ చేశారు. గోపిగౌడ్, ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కాంశెట్టి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా: కామారెడ్డి ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్థన్ కాన్వాయ్‌లో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జరిగింది. వివరాలు.. కాన్వాయ్ వేగంగా వెళ్తుండగా అడవి పంది అడ్డువచ్చింది. దీంతో డైవర్లు ఒక్క సారిగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విప్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలు బాగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న పార్టీ నాయకులు ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, గంపగోవర్థన్కు ప్రయాణిస్తున్న వాహనం మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. (రామాయంపేట) -
టీఆర్ఎస్ వైపు యూసుఫ్ చూపు
కామారెడ్డి : కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యూసుఫ్‌అలీ తిరిగి క్రియాశీలకంగా పనిచేయడానికి ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకుగాను అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరాలనే ఆలోచనతో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. కామారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ ఉద్దండుల్లో ఒకరైన మాజీ విప్ యూసుఫ్‌అలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. మండలి వ్యవస్థ ఆరంభంతోనే కామారెడ్డి ఎంపీపీగా, జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994లో ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధపడగా టిక్కెట్ దక్కలేదు. అప్పుడు గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబుకు దగ్గరి మనిషిగా పేరున్న యూసుఫ్‌అలీకి రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి వరించింది. తరువాత 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా విప్ పదవితో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2004లో ఎమ్మెల్యేగా తిరిగి పోటీకి సిద్ధపడగా, పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించిన యూసుఫ్‌అలీ అనూహ్యంగా మహాకూటమి నుంచి టీఆర్ఎస్ ద్వారా జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు యూసుఫ్‌అలీ ఓడిపోగా, ఎమ్మెల్యేగా గోవర్ధన్ గెలుపొందారు. ఇద్దరికి మధ్య రాజకీయ విభేదాలు ఉండేవి. యూసుఫ్‌అలీ టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు. అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఎమ్మెల్యే పదవికి గోవర్ధన్ రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. దీంతో యూసుఫ్‌అలీ టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. సొంత గూడు టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చే యకుండా ఉండిపోయారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా ఆయన టీఆర్ఎస్వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరడానికి రాష్ట్ర మంత్రులు కొందరిని యూసుఫ్‌అలీ సంప్రదించినట్టు సమాచారం. అయితే తన చేరికను అడ్డుపడతాడని భావించిన యూసుఫ్‌అలీ స్థానిక ఎమ్మెల్యే, విప్ గోవర్ధన్తోనూ మాట్లాడినట్టు తెలిసింది. అయితే గోవర్ధన్ వైపు నుంచి సరైన స్పందన రాలేదని సమాచారం. టీడీపీలో ఉన్నపుడు ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి కావు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని యూసుఫ్‌అలీ చేరికను గోవర్ధన్ సమర్థించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన యూసుఫ్‌అలీకి గతంలో ఆయనతో మంచి సంబంధాలే ఉండేవి. అదే ఉద్దేశంతో 2009 ఎన్నికల్లో మహాకూటమి బలపర్చిన అభ్యర్థిగా యూసుఫ్‌అలీ పేరును ఖరారు చేశారు. అప్పటికప్పుడు యూసుఫ్‌అలీకి గులాబీ కండువా కప్పి ఆయన్ను జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయించారు. అయితే గంప గోవర్ధన్ టీఆర్ఎస్లో చేరిన తరువాత యూసుఫ్‌అలీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురితో యూసుఫ్‌అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. వారి ద్వారా టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నించినా, స్థానిక ఎమ్మెల్యే, విప్ గోవర్ధన్ నుంచి సానుకూలత రాకుంటే చేరడం సాధ్యం కాకపోవచ్చంటున్నారు. ఏది ఏమైనా యూసుఫ్‌అలీ టీఆర్ఎస్లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. -
‘గంప’ ఇల్లు ముట్టడి
కామారెడ్డిటౌన్ : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరు తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఇంటిని శనివారం ముట్టడించారు. ఎమ్మెల్యేతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. స్కాలర్షిప్లు, ఫీజు రీయిం బర్స్మెంట్ రాకపోడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బం దులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న 1500 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంసెట్, డైట్‌సెట్ కౌన్సెలింగ్‌లను వెంటనే నిర్వహించి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎ మ్మెల్యే సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్, పట్టణ అధ్యక్షుడు సుధీర్, కార్యదర్శి అరుణ్, నాయకులు రమేశ్, సంతోష్ పాల్గొన్నారు. -
22న మంత్రివర్గ విస్తరణ?
అసెంబ్లీ పదవులతో తగ్గిన ఒత్తిడి అయినా ఆశావహులు చాలామందే హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 22న ఉండే అవకాశముంది. జూన్ 2న ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు, మరో 11 మంది మంత్రులు గా ప్రమాణం చేసినపుడు మరోవారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 22 వ తేదీకంటే ముందే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం నిర్ణయిస్తే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఈ నెల 18 న విస్తరణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కేసీఆర్ సన్నిహితుడొకరు వెల్లడించారు. మంత్రిపదవుల కోసం ఆశావహుల జాబితా పెద్దగా ఉండడంతో ఒత్తిడిని తగ్గించుకోవడానికి శాసనసభ పదవులను కేసీఆర్ వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రమంత్రివర్గంలో తప్పకుండా స్థానం దక్కుతుందని ఆశించిన పలువురు పార్టీ సీనియర్లకు శాసనసభలోనూ, మండలిలోనూ వివిధ హోదాల్లో అవకాశాలను కల్పిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ఎస్.మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్‌గా చేశారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్‌గా చేశారు. రెండోసారి గెలిచిన నల్లాల ఓదెలును చీఫ్‌విప్‌గా, విప్‌లుగా మరికొం దరు సీనియర్లను చేస్తున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు ఉద్యోగుల వ్యవహారాలను అప్పగిస్తామని ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు కేసీఆర్ గతంలో బహిరంగసభల్లోనే వాగ్దానం చేశారు. ఇప్పుడాయనకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలనుకుంటున్నారు. శాసనసభ, శాసనమండలి పదవులతో మంత్రివర్గంపై ఆశావహుల ఒత్తిడిని కేసీఆర్ కొంతవరకు తగ్గించుకోగలిగారు. 12 మందితో ఏర్పాటైన తెలంగాణ మంత్రివర్గంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు అవకాశం దక్కలేదు. మెదక్ (కేసీఆర్, హరీశ్‌రావు), కరీంనగర్ (ఈటెల రాజేందర్, కేటీఆర్) జిల్లాలకు రెండేసి మంత్రిపదవులు దక్కాయి. హైదరాబాద్‌లో నాయిని, టి.పద్మారావు, మహమూద్ అలీలకు ఇవ్వడం ద్వారా ముగ్గురికి అవకాశం కల్పించారు. మిగిలిన రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి మంత్రివర్గంలో ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. అయితే వరంగల్‌కు స్పీకర్, మెదక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవులు అదనంగా దక్కాయి. కాగా, మలిదశ విస్తరణలో ముందుగా మహబూబ్‌నగర్‌కు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో జలగం వెంకట్రావు ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా ఉండడంతో దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అర్థం కావడం లేదు. కేసీఆర్‌కు చెందిన సామాజికవర్గం నుండి ఇప్పటికే మంత్రివర్గంలో ముగ్గురు (కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు) ఉన్నారు. మహబూబ్‌నగర్ నుండి జూపల్లి కృష్ణారావుకు తప్పనిసరిగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. దీనితో ఆ సామాజికవర్గానికి మంత్రివర్గంలో సంఖ్య 4కు చేరుతుంది. అదే సామాజికవర్గానికి చెందిన జలగం వెంకట్రావుకు అవకాశం వస్తుందా అనేది అనుమానమే. వరంగల్ జిల్లా నుండి చందూలాల్, కొండా సురేఖ వంటి సీనియర్లు మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుండి సి.లక్ష్మా రెడ్డికి కూడా అవకాశం కల్పించనున్నారు. వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా అమాత్యపదవిని ఆశిస్తున్నారు. కరీంనగర్ నుండి కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉంది. నిజామాబాద్ నుండి గంపా గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డిలు ఆశిస్తుండగా వీరిలో ఒకరికి అవకాశం రానుంది. ఆదిలాబాద్‌లోని ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి శాసనసభలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రమాణం చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంపగోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిందేలు గతంలో వేర్వేరు పార్టీల నుంచి శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన అనుభవం ఉంది. ఈసారి మాత్రం ఈ ఐదుగురు ఒకే పార్టీ టికెట్‌పై ఎన్నికై ప్రమాణస్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్త, మహ్మద్ షకీల్ మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టా రు.ఎమ్మెల్సీలు డీఎస్,షబ్బీర్‌అలీ, అరికెల, స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌గౌడ్, వీజీగౌడ్, రాజేశ్వర్ ప్రమాణం చేశారు. -
హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు
నిజామాబాద్ : ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నవారిలో పలువురు అభ్యర్థులు ఈ అరుదైన ఘనత సాధించటానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ సైతం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం ఈ ఘటన సాధించటానికి ఒక్క విజయం దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాలుగో విజయం కోసం మరోసారి బోధన్ నుంచే బరిలో నిలిచారు. ఆయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. -
‘గంప’పై కోడిగుడ్లతో దాడికి యత్నం
మాచారెడ్డి, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంపగోవర్ధన్ ఆదివారం పోతారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోడిగ్రుడ్లను విసిరే ప్ర యత్నంచేశారు. అక్కడే ఉన్న పో లీసులు కోడిగుడ్లను విసురుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులపైకి తిరగబడడంతో అదుపులోకి తీసుకున్నారు. అలాగే గంప గోవర్ధన్ పోతారంలో ప్రచారం ముగించుకుని భవానీపేటకు వెళ్లగా, అక్కడ ర్యాలీలో పలువురు మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలతో నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేశారు. పోలీసులు సర్ధిచెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఐదుగురిపై కేసు నమోదు గంప గోవర్ధన్‌పై కోడిగుడ్లతో దాడికి య త్నించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై ప్రసాద్‌రావు తెలిపారు. గ్రామానికి చెందిన మెట్టు రాజనర్సు, గ్యార డ్రై వర్ సాయిలు, స్వామి, పెద్ద గంగయ్య, గంభీరావుపేట శ్రీనివాస్‌గౌడ్‌లపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పోరు రసవత్తరం!
రాజకీయ చైతన్యానికి మారుపేరు కామారెడ్డి. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి, వామపక్ష ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచింది. విలక్షణమైన తీర్పునిచ్చే కామారెడ్డి బరిలో ఈసారి పదిమంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం నలుగురి మధ్యే నెలకొంది. మాజీ మంత్రి షబ్బీర్, సిట్టింగ్ ఎమ్మెల్యే గోవర్దన్‌లతో వైఎస్సార్సీపీ నుంచి కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సిద్దిరాములు తలపడుతున్నారు. గెలుపు మీద ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం కావూరెడ్డి ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 5, టీడీపీ- 3, స్వతంత్రులు - 2, టీఆర్ఎస్- 1 ప్రస్తుత ఎమ్మెల్యే: గంప గోవర్దన్ (టీఆర్ఎస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: కరీంనగర్, నిజావూబాద్, మెదక్ జిల్లాల కూడలి. బీసీ, మైనార్టీ ఓట్ల అధికం. రాజకీయు చైతన్యం ఎక్కువ ప్రస్తుతం బరిలో నిలిచింది: 10 ప్రధాన అభ్యర్థులు వీరే.. మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్) గంప గోవర్దన్ (టీఆర్ఎస్) పైలా కృష్ణారెడ్డి(వైఎస్సార్ సీపీ) ఇట్టం సిద్దిరాములు (బీజేపీ) సేపూరి వేణుగోపాలచారి, కామారెడ్డి: మెదక్, కరీంనగర్, నిజావూబాద్ జిల్లాల కూడలిగా కావూరెడ్డి నియోజకవర్గం ఉంది. రెండు దశాబ్దాలుగా ఇక్కడ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ (టీఆర్ఎస్)ల మధ్యే పోరు సాగుతుంది. 1989, 2004 ఎన్నికలల్లో భారీ మెజారిటీతో షబ్బీర్ గెలుపొంది వుంత్రి పదవులు చేపట్టారు. 1994, 2009 సాధారణ ఎన్నికల తో పాటు 2012 ఉప ఎన్నికల్లో గంప గోవర్దన్ గెలుపొందారు. ఇప్పుడు ఈ ఇద్దరితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలా కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ ఇట్టం సిద్దిరాములు పోటీ పడుతున్నారు. ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయునే ధీవూతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. సీనియుర్లను కాదని డాక్టర్ సిద్దిరాములుకు టికెట్ ఇవ్వడంతో బీజేపీలో కొంత అసంతృప్తి ఉంది. మోడీనే తవు గెలుపు వుంత్రవుని సిద్ది రావుులు భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం పది వుంది రంగంలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం ఈ నలుగురి మధ్యే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం-అభివృద్ధి అంశాలపై షబ్బీర్, గంపల మధ్య తరచు మాటల తూటాలు పేలుతూనే ఉన్నారుు. ఒక్కోసారి నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. శాశ్వత అభివృద్ధి పనులతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించానని షబ్బీర్‌అలీ ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ కోసం టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనావూ చేసి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యానని, టీఆర్ఎస్ ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని గంప గోవర్దన్ పేర్కొంటున్నారు. వైఎస్సార్ పథకాలే స్ఫూర్తిగా పైలా కృష్ణారెడ్డి.. మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కారణంగా నియోజవర్గం అభివృద్ధి కుంటుపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలా కృష్ణారెడ్డి వివుర్శిస్తున్నారు. దివంగత నేత డాక్టర్ ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి ఆశయు సాధన, బడుగు, పేద, బలహీన వర్గాలకు ఆయన చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తాయని కృష్ణారెడ్డి అంటున్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరిగిందని చెబుతూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాలకు కొత్త ... బీజేపీ అభ్యర్థి సిద్దిరాములుకు రాజకీయాలు కొత్త. సొంత సామాజిక వర్గం ఓట్లతో పాటు వైద్యునిగా గుర్తింపు, మోడీ హవా మీద ఆయున ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో హిందూత్వ సంస్థలు బలంగా ఉన్నాయునే ధీవూ కూడా ఉంది. నే.. గెలిస్తే.. - యువతకు ఉపాధి అవకాశాల కల్పన. - విద్యార్థులందరికీ హాస్టల్ వసతుల కల్పన. - కామారెడ్డికి మెడికల్ కాలేజీ ఏర్పాటు. - ఏరియా ఆస్పత్రిని నిమ్స్ తరహా అభివృద్ధి. - కావూరెడ్డిలో యుూనివర్సిటీ ఏర్పాటు. - మండల కేంద్రాల్లో రైతు బజార్ల నిర్మాణం. - ప్రతీ ఇంటికీ గోదావరి నీటి సరఫరా. - పైలా కృష్ణారెడ్డి (వైఎస్సార్సీపీ) - గోదావరి నుంచి తాగునీటి పథకం పూర్తి చేరుుస్తా. - ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కోసం ప్రయత్నం,1.45 లక్షల ఎకరాల సాగునీరు. - కామారెడ్డిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం. - పేదవారందరికీ పక్కాగృహాలనిర్మాణం. - యువతకు ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటు. - మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్) - అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం. - ప్రతి గ్రామానికి రక్షత తాగునీటి సరఫరా,రోడ్ల నిర్మాణానికి కృషి. - గ్రామాలకు వెళ్లే రోడ్లను బీటీ రోడ్లుగా మార్పు - విద్యాభివృద్ధి కోసం అదనపు గదుల నిర్మాణం. - డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి. - గంప గోవర్దన్ (టీఆర్ఎస్) - రైతుల రుణాల మాఫీ. - అర్హులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం. - బీడీ కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రి. - యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు. - 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించన్లు. - గిరిజన, దళిత వాడల్లో పేదలకు వైద్య శిబిరాలు. - డాక్టర్ ఇట్టం సిద్దిరాములు (బీజేపీ) -
తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యం
కామారెడ్డి, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చేసిన ఉద్యమాలు, 1500 మంది యువకుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకోవడం టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.కేసీఆర్ మేధోశక్తి, రాజకీయ చతురతతో తెలంగాణ సాధ్యమైందన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం అయి సిరా ఆరకముందే భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపే కుట్రలు చే శారన్నారు. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆర్డినెన్స్ రాలేకపోయిందన్నారు. తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి ఆంక్షలు పెట్టిం దని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనని సీఎం కిరణ్ అంటే పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు నోరుమెదపలేకపోయారని, అలాంటి నేతలు టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరులను ప్రజలు గమనించారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించి తీరుతారన్నారు. ఇతర పార్టీలేవి తెలంగాణకు జరిగే అన్యాయాలపై మాట్లాడలేవని, టీఆర్ఎస్ మా త్రమే కొట్లాడుతుందన్నారు. ఇప్పటికే ఎన్నో ఆంక్షలు ఉన్నాయని, టీఆర్ఎస్ వస్తేనే వాటిని చక్కదిద్దుతుందని పేర్కొన్నారు. -
ఒకటే పని.. రెండు ప్రారంభోత్సవాలు
భిక్కనూరు, న్యూస్‌లైన్ : అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ సమస్య తలెత్తుతోంది. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తేదీలను ముందుగా ఖరారు చేసి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పిలవాల్సిన అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో భిక్కనూరు మండలంలో ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలోనూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంటోంది. తాజాగా ఆదివారం భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో ఈ సమస్య పునరావృతం అయ్యింది. బాగిర్తిపల్లిలో బీటీ రోడ్డు మరమ్మతుకు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. వీటి పనులను ప్రారంభించడానికి ఆదివారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని నిధులు మంజూరు చేయించింది తమ నాయకుడు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అంటూ వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల నాయకులు బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఎస్ఐ గంగాధర్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. ఘర్షణ సద్దుమణిగాక కాంగ్రెస్ నాయకుడు, స్థానిక సర్పంచ్ శ్రీశైలం రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరోవైపు ఇదే రోడ్డు పనులను ప్రారంభించారు. అసలు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించే కార్యక్రమంలో అధికారులెవరూ పాల్గొనకపోవడం గమనార్హం. అధికారులు రోడ్డు ప్రారంభ పనులకు ముహూర్తం నిర్ణయించి ప్రజాప్రతినిధులను పిలిచి ఉంటే ప్రొటోకాల్ సమస్య తలెత్తేది కాదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో బస్వాపూర్, గుర్జకుంట గ్రామాల్లోనూ ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. ప్రొటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రచారాలకు వేదిక చేసుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రతి వేదికనూ తమ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ప్రారంభోత్సవాల సందర్భంగా ఉన్నతాధికారులనుంచి అనుమతి తీసుకోకపోవడం, ఆదరాబాదరగా వ్యవహరించడంలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది. -
ముందే కూసిన ‘ఓట్ల’ కోయిల!
కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎక్కడా లేని విధంగా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులైన ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ప్రత్యక్ష, పరోక్ష విమర్శ లు చేసుకుంటున్నారు. తెలంగాణ కోసం పోరాడింది తామంటే, తెలంగాణ ఇచ్చింది తమ పార్టీ అని చెప్పుకుంటూ ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సాధారణ ఎన్నికలకు ఐదు నెలల ముందే ప్రచార సందడి కనిపిస్తోంది. ఆర్భాటాల్లోనూ.. ఇద్దరు నేతలు ఆర్భాటాల్లోనూ పోటాపోటీగా సాగుతున్నారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఐదారు వాహనాలకు త గ్గకుండా కాన్వాయ్‌లో వెళ్తుంటే.. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా తానేం తక్కువ కాదన్నట్టుగా కాన్వాయ్‌లో నాలుగైదు వాహనాలను వినియోగిస్తున్నారు. అనుచ ర గణాన్ని వెంటేసుకొని కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఘర్షణ వాతావరణం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం సైతం ఏర్పడుతోంది. ఆదివారం భిక్కనూరు మండలంలోని బాగిర్తిపల్లిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఈ గ్రామంలో రోడ్డు మరమ్మతుకు సంబంధించి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయించింది తమ నాయకుడంటే తమ నాయకుడంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఎస్ఐ గంగాధర్ ఇరువర్గాలను సముదాయించారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ శనివారం మాచారెడ్డి మండలంలోని భవానీపేట, పోతారం, ఇసాయిపేట తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అదేరోజు దోమకొండ మండలంలోని మాందాపూర్‌లో, ఆదివారం భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో పర్యటించారు. తెలంగాణ విషయంలో.. తెలంగాణ ఇస్తామన్న మాటకు కట్టుబడి రాష్ర్టం ఇచ్చిన సోనియాగాంధీకి అందరూ రుణపడి ఉండాలని ఎమ్మెల్సీ షబ్బీర్ ప్రజలను కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ కోసం పదమూడేళ్లుగా టీఆర్ ఎస్ చేస్తున్న పోరాటం, వెయ్యి మంది తెలంగాణవాదుల బలిదానం ఫలితంగానే రాష్ట్రం సిద్ధిస్తోందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొంటున్నారు. వలసలపై కాంగ్రెస్ ఆశలు 2009 సాధారణ ఎన్నికలతో పాటు 2011 ఉప ఎన్నికల్లోనూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం ఆ పార్టీకి భారంగా మారింది. అందుకే ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెరలేపినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. వలసలపైనా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా టీఆర్ఎస్కు చెందిన నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఎంజీ వేణుగోపాల్‌గౌడ్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేస్తూ ఆయా సంఘాల నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. తెలంగాణమే టీఆర్ఎస్ బలం తెలంగాణవాదమే బలంగా టీఆర్ఎస్ సాగుతోంది. నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించిన టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొంది కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అసంతృప్త నేతలను బుజ్జగించి తన వెంట తిప్పుకుంటున్నారు. తనపై బహిరంగ విమర్శలు చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, భూంరెడ్డిలాంటి వారిని కలిసి, బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే వందలాది మంది తెలంగాణవాదులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడింది టీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే తన పర్యటనల్లో ప్రజలకు వివరిస్తున్నారు. తద్వారా తెలంగాణ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తుండడంతో నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. -
నియోజకవర్గం లో ఆధిపత్యపోరు
కామారెడ్డి, న్యూస్‌లైన్: కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మధ్య ఆధిపత్యపోరు రసవత్తరంగా మారింది. మూడునాలుగేళ్లుగా అభివృ ద్ధి పనులకు మంజూరయ్యే నిధుల విషయంలోనో, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగానో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఒక్కోసారి కాంట్రాక్టుల విషయంలోనూ ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. పోటాపోటీగా ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు కీలకమైన మంత్రి పదవులు కూడా నిర్వహించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కామారెడ్డిలో షబ్బీర్‌అలీ అప్పటి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన గంప గోవర్ధన్ చేతిలో ఓటమి చెందారు. ఓడిపోయినా నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ డం ఆయనకు కలిసి వచ్చింది. అధికారులు ఆయన మాటను కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎని మిది నెలల క్రితం షబ్బీర్‌అలీ ఎమ్మెల్సీ పదవితో ని యోజకవర్గంలో అడుగుపెట్టిన తరువాత అధికారిక కార్యక్రమాలలో తనదైన ముద్రవేసేందుకు అధికారులపై మరింత ఒత్తిడి పెంచారు. దీంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అప్రమత్తమై తన ఉనికికి ఎక్కడా ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అధికారులను డామినేట్ చేస్తూ నియోజకవర్గంలో ఏమి జరిగినా తనకు తెలియాల్సిం దేనని పట్టుబడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనను కాదని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారంటూ శాసనసభ స్పీకర్‌కు, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కొంతకాలం పాటు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల విషయంలో ఇద్దరూ స్తబ్దుగానే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల చొరవతో ఇరువురూ తలా కొన్ని అభివృ ద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసుకునే అవకాశం ఏర్పడింది. అది ఎంతో కాలం నిలవలేదు. నియోజక వర్గానికి నిధులను తానంటే.. తానే మంజూరు చేయించామని ఇద్దరూ చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే గా తాను ప్రతిపాదనలు పంపి, సంబంధిత అధికారు లు, మంత్రుల ద్వారా నిధుల మంజూరు తీసుకువచ్చానని ఎమ్మెల్యే చెప్పుకుంటే.. తాను పంపిన ప్రతిపాదనలకు నిధులు వచ్చాయని ఎమ్మెల్సీ పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పరంగా వచ్చే ఇతర నిధుల విషయంలోనూ ఇద్దరూ క్రెడిట్ కొట్టేందుకు పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణ విషయంలోనూ ఇద్దరు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టుకుందని షబ్బీర్‌అలీ చెబుతుంటే, పదమూడేళ్లుగా టీఆర్ఎస్ పోరాటం,అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గోవర్ధన్ అంటున్నారు. తెలంగాణ కోసం షబ్బీర్ చేసిందేమీ లేదని గోవర్ధన్ విమర్శిస్తే, పదవి కోసమే టీఆర్ఎస్లో గోవర్ధన్ చేరారని షబ్బీర్ ఆరోపిస్తున్నారు. ఇరువురు ముఖ్య నేతల మధ్య రాజకీ య పోరును స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తా జాగా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామంలో పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రారంభిం చిన సందర్భంలో స్థానిక సర్పంచ్‌ను ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేతలు ఆదివారం ధర్నాకు దిగారు. ప్రతిగా టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. సోమవారం కాం గ్రెస్ పిలుపు మేరకు మాచారెడ్డిలో బంద్ జరిగింది.