తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం | possible to rebuild the telangana with kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Published Sun, Apr 6 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

తెలంగాణ పునర్నిర్మాణం  టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

కామారెడ్డి, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చేసిన ఉద్యమాలు,  1500 మంది యువకుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకోవడం టీఆర్‌ఎస్ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.కేసీఆర్ మేధోశక్తి, రాజకీయ చతురతతో తెలంగాణ సాధ్యమైందన్నారు.
 
పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం అయి సిరా ఆరకముందే భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపే కుట్రలు చే శారన్నారు. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆర్డినెన్స్ రాలేకపోయిందన్నారు. తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి ఆంక్షలు పెట్టిం దని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనని సీఎం కిరణ్ అంటే పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు నోరుమెదపలేకపోయారని, అలాంటి నేతలు టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు.
 
తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరులను ప్రజలు గమనించారన్నారు. రాబోయే ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ను గెలిపించి తీరుతారన్నారు.  ఇతర పార్టీలేవి తెలంగాణకు జరిగే అన్యాయాలపై మాట్లాడలేవని, టీఆర్‌ఎస్ మా త్రమే కొట్లాడుతుందన్నారు. ఇప్పటికే ఎన్నో ఆంక్షలు ఉన్నాయని, టీఆర్‌ఎస్ వస్తేనే వాటిని చక్కదిద్దుతుందని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement