కారు.. టాప్ గేర్
పోలైన ఓట్లలో మూడో వంతు టీఆర్‌ఎస్‌కే
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్ల పంట పండింది. ఆ పార్టీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనన్ని ఓట్లు ఈసారి వచ్చారుు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కంటే ఏకంగా 9 శాతం ఎక్కువ ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. అంటే పోలైన ఓట్లలో మూడో వంతు ఈ పార్టీకే దక్కాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు 33.66 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 24.58 శాతం ఓట్లు పోలయ్యాయి. 2009 ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్ ఈసారి 150 శాతం ఎక్కువ ఓట్లు సాధించింది. అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంతో కలసి వుహాకూటమిగా ఏర్పడి 50కిపైగా స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ 25,82,326 ఓట్లు సంపాదించింది. ఈసారి వూత్రం తెలంగాణలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన గులాబీ పార్టీ ఏకంగా 65,26,515 ఓట్లను కొల్లగొట్టింది. ఫలితంగా వ్యూజిక్ ఫిగర్‌కంటే అధికంగా సీట్లలో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇదే సరళి పార్లమెంట్ ఓట్లలోనూ కనిపించింది. ఖవ్ముం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్‌కంటే ఎక్కువగా ఓట్లు తెచ్చుకుంది. ఖవ్ముం జిల్లాలో వూత్రం కేవలం 9.57 శాతం ఓట్లనే పొందింది. ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. ఉత్తర తెలంగాణలో బలమైన పట్టున్న టీఆర్‌ఎస్‌కు, దక్షిణ తెలంగాణలో అంతగా పార్టీ నిర్మాణమే లేదన్న భావన ఉంది. అయితే, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్ గణనీయుమైన ఓట్లను సంపాదించింది. అన్ని జిల్లాల్లోకెల్లా టీఆర్‌ఎస్‌కు కరీంనగర్‌లో అత్యంత ఎక్కువగా 48.46 శాతం ఓట్లు వచ్చాయి. మెదక్‌లో 47.45 శాతం ఓట్లు లభించాయి.
3.34 శాతం ఓట్ల తేడాతో 30 సీట్లు గోవిందా!
ఈసారి కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని జిల్లాల్లోనూ దెబ్బతింది. గత ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 33.06 శాతం ఓట్లు సాధించి 50కి పైగా స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద రాజకీయు పార్టీగా అవతరించింది. ఈసారి వూత్రం సీపీఐతో జతకట్టి 113 స్థానాల్లో పోటీ చేసి 47,84,949 (24.68 శాతం) ఓట్లతో 20 స్థానాలకే పరిమితమైంది. గతంతో పోలిస్తే 8.38 శాతం ఓట్లను నష్టపోరుున కాంగ్రెస్.. ఏకంగా 30 సీట్లను కోల్పోయింది. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది. గత ఎన్నికల్లో రాజధాని నగరంలో 26.27 శాతం ఓట్లతో 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క స్థానాన్ని కూడా గెలిచుకోలేకపోయింది. హైదరాబాద్‌లో అన్ని పార్టీలకంటే అతి తక్కువ ఓట్లను సాధించిన పార్టీగా రికార్డుల్లోకెక్కింది. ఇక్కడ కేవలం 12.44 శాతం ఓట్లు పొందింది.టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీల తరువాత ఐదో స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో 40 శాతం ఓట్లతో 7 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి 26.41 శాతానికి ఓట్లను వూత్రమే సాధించి ఒక్క స్థానానికే పరిమితమైంది.
6 శాతం ఓట్లు.. 24 సీట్లు లాస్
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో వుహా కూటమిలో భాగంగా 55 స్థానాల్లో పోటీ చేసి 20.65 శాతం ఓట్లను సాధించి 39 స్థానాలను సాధించింది. ఈసారి వూత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని, 72 స్థానాల్లో బరిలో దిగింది. అయితే, 14.61 శాతం ఓట్లకే పరిమితమైంది. 15 సీట్లను వూత్రమే సాధించింది. గతంతో పోలిస్తే 24 స్థానాలను నష్టపోరుుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి వచ్చిన ఓట్లు 28,32,850 మాత్రమే. ఈసారి ఆదిలాబాద్, నిజావూబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఓట్ల శాతాన్ని రెండెంకలకు కూడా చేరుకోలేక చతికిలపడింది. కరీంనగర్ జిల్లాలో 5.32 శాతం ఓట్లను వూత్రమే సాధించి ఉనికి చాటుకోవడానికే పరిమితమైంది. తెలంగాణ మొత్తంలో ఖవ్ముం జిల్లాలో మాత్రం 27.59 శాతం ఓట్లు సాధించి పరువు దక్కించుకుంది.
1.5 శాతం ఓట్ల తేడాతో 3 సీట్లు బోనస్
గత ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీచేసిన బీజేపీ 5.3 శాతం ఓట్లను సంపాదించి రెండు సీట్లలో గెలుపొందింది. ఈసారి టీడీపీతో జతకట్టి 45 స్థానాల్లో పోటీ చేసి 6.81 శాతం ఓట్లను పొంది 5 సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికలకంటే కేవలం 1.5 శాతం ఓట్లు ఎక్కువ తెచ్చుకొని, వుూడు సీట్లను అధికంగా గెలుచుకోవడం విశేషం. హైదరాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో 13.2 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి ఈసారి 19.47 శాతం ఓట్లు లభించాయి.