ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణం.. | The first session of Telangana Legislative Assembly | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణం..

Published Tue, Jun 10 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణం..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణం..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి శాసనసభలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రమాణం చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంపగోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిందేలు గతంలో వేర్వేరు పార్టీల నుంచి శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన అనుభవం ఉంది.
 
ఈసారి మాత్రం ఈ ఐదుగురు ఒకే పార్టీ టికెట్‌పై ఎన్నికై ప్రమాణస్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్త, మహ్మద్ షకీల్ మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టా రు.ఎమ్మెల్సీలు డీఎస్,షబ్బీర్‌అలీ, అరికెల, స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌గౌడ్, వీజీగౌడ్, రాజేశ్వర్ ప్రమాణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement