Baazi Reddy Govardhan
-
హామీలను నెరవేరుస్తాం
ఇందూరు ఇంటికి కోడలుగా వచ్చి.. జిల్లావాసుల కష్టసుఖాల్లో పాలుపంచుకుని.. అందరి మనస్సుల్లో చోటు సంపాదించడమే కాకుండా.. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చారు. ఈసందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు. డిచ్పల్లి : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుస్తామ ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆదివారం తొలిసారి జిల్లాకు వచ్చిన కవితకు డిచ్పల్లి మండలం చ ంద్రాయన్పల్లి వద్ద టీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తప్పక నెరవేరుస్తారని అ న్నారు. రైతు రుణమాఫీ, పింఛన్లు, ఇళ్లు, భూములు అన్ని రకాల హామీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసిన జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ *10 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించారని అన్నారు. జిల్లాలో రెండుపార్లమెంట్ స్థానాలతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్కు కట్టబెట్టిన జిల్లా ప్రజలందరికి వందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకు లు ఎస్ఏ అలీం, జీనియస్ నారాయణరెడ్డి, శక్కరికొండ కృష్ణ, డాక్టర్ షాదుల్లా, చందర్‌నాయక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సరిహద్దులో ఘనస్వాగతం భిక్కనూరు : కవిత పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమా ణం చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వచ్చారు. ఆదివారం జిల్లా సరిహద్దు గ్రామమైన భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద కవితకు జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 8.30 గంటలకు రావాల్సిన కవిత 11.30 గంటలకు వచ్చినప్పటికీ కార్యకర్తలు వేచిచూశారు. జిల్లా సరిహద్దులకు ఎంపీ వాహనశ్రేణి రాగానే పెద్ద ఎత్తున టపాకాయలను కాల్చారు. జిల్లాలోకి అడుగుపెట్టిన కవితకు డీసీఎంఎచ్ చైర్మన్ ముజీబొద్దిన్, భిక్కనూరు జడ్పీటీసీ సభ్యుడు నందరమేశ్లు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. కన్న బాగా చదువుకో..తెలంగాణలో బంగారు భవిష్యత్తు నీదే... ‘కన్నా బాగా చదువుకో.. తెలంగాణలో బంగారు భవిష్యత్తు మీలాంటి చిన్నారులదేనని’ ఎంపీ కవిత అన్నారు. బస్వాపూర్ వద్ద ఎంపీ వచ్చిన సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ డాక్టర్ కుటుంబం కవితను చూసేందుకు ఆగింది. వారి కుమార్తె బేబి శాలిని ఎంపీ కవితకు అభివాదం చేసింది. దీంతో కవిత ఆ చిన్నారి వద్దకు వచ్చి జెతైలంగాణ అంటూ..మాట్లాడారు. కన్నా బాగా చదువుకో ఏర్పడిన తెలంగాణలో బంగారు భవిష్యత్తు మీ చిన్నారులదేనన్నారు. చంద్రశేఖర్‌కాలనీ : జిల్లా అభివృద్ధియే ఏజెండాగా ముందుకుసాగుతామని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు తమపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని అఖండ మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుం డా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామన్నా రు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి తెలంగాణ తొలి రాష్ట్రంలో టీఆర్ఎస్కు అధికారం అప్పగించారని అన్నారు. ఆ న మ్మకం వమ్ముకాకుండా బంగారు తెలంగాణ ఏర్పాటుకు ఆయన ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే మరమ్మతుల(కోచ్) ఏర్పాటు, ఆ ర్మూర్లో పసుపు, విత్తనాల శుద్ధికేంద్రాల ఏర్పాటు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. త్వరలో పూర్ణకు అభినందన సభ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి జిల్లా కీర్తిబావుటాను ఎగురవేసిన సిరికొండ మండలం పాకాల కు చెందిన మాలావత్ పూర్ణకు త్వరలో జిల్లా కేం ద్రంలో అభినందనసభను ఏర్పాటు చేస్తామన్నా రు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశా ల ఏర్పాటుకు కూడా తనవంతు కృషి చేస్తానన్నా రు. సమావేశంలో టీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎ మ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి శాసనసభలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రమాణం చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంపగోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిందేలు గతంలో వేర్వేరు పార్టీల నుంచి శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన అనుభవం ఉంది. ఈసారి మాత్రం ఈ ఐదుగురు ఒకే పార్టీ టికెట్‌పై ఎన్నికై ప్రమాణస్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్త, మహ్మద్ షకీల్ మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టా రు.ఎమ్మెల్సీలు డీఎస్,షబ్బీర్‌అలీ, అరికెల, స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌గౌడ్, వీజీగౌడ్, రాజేశ్వర్ ప్రమాణం చేశారు. -
ఉద్యమాలు చేయని వారికి టికెట్లా!
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని జేఏసీ నాయకులు అన్నారు. ఉద్యమంలో తెలంగాణవాదులను పోలీసులతో కొట్టించిన బాజిరెడ్డి గోవర్ధన్ , టీఆర్ఎస్లో చేరగానే తెలంగాణపై ఎక్కడిలేని ప్రేమను ఒలకబోస్తున్నారని జేఏసీ జల్లా చైర్మన్ గోపాల్‌శర్మ విమర్శించారు. పార్టీలు మారగానే బాజిరెడ్డిలాంటి వారు కడిగిన ముత్యాలు కాలేరని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం లో పాల్గొనని ధన్పాల్ సూర్యనారాయణగుప్త, ఆకుల లలితకు పార్టీలు టికెట్లు ఇవ్వ డం సిగ్గుచేటన్నారు.ఆదివారం జిల్లాకేంద్రం లోని టీఎన్జీవోఎస్ భవన్లో జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వారు పాల్గొన్నారని, ఎంతోమంది విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమం లో ప్రజలతో మమేకం కాని వారు, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కొందరు బడా పెట్టుబడిదారులకు కొన్ని పార్ట్టీలు టికెట్లు ఇచ్చాయని, తెలంగాణ కోసం పోరాడిన వారిని ఏ పార్టీలు ఆదరించలేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ బరిలో నిలిచిన అభ్యర్థులు ముందుగా జిల్లాలోని 66 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చివరి వరకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు,ఆపార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆ రెండుపార్టీలకు జేఏసీ నుంచి ఎదురుగాలి తప్పదని అన్నారు.నిజామాబాద్ 48వ డివిజన్లోని స్వతంత్ర అభ్యర్థి బొబ్బిలి మాధురి ఇంటిపై జరి గిన దాడి ఘనటపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అధికారపార్టీకి తొత్తుగా మారి మున్సిపల్ ఎన్నికల్లో ఓవర్ యాక్షన్‌కు పాల్పడిన నగర సీఐ సైదులను వెంటనే విధులనుంచి తొల గించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 40 ప్రజా సమస్యలను పరిష్కరిం చేందుకు జేఏసీ పోరాడుతుందన్నారు. జేఏసీ తరపు న నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, బోధన్ అసెంబ్లీ స్థానాలకు బరిలో అభ్యర్థులను నిలుపుతామన్నారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ గైని గంగారాం, ప్రభాకర్, భాస్కర్, టీఎన్జీవోఎస్ కార్యదర్శి కిషన్, వనమాల సుధాకర్, కుల సంఘాల జేఏసీ దయానంద్, సుదర్శన్‌రావు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశనారాయణ, జర్నలిస్టు ఫోరం నాయకులు బాలార్జున్‌గౌడ్ పాల్గొన్నారు.