హామీలను నెరవేరుస్తాం | definitely we completed our homies | Sakshi
Sakshi News home page

హామీలను నెరవేరుస్తాం

Published Mon, Jun 16 2014 3:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

హామీలను నెరవేరుస్తాం - Sakshi

హామీలను నెరవేరుస్తాం

ఇందూరు ఇంటికి కోడలుగా వచ్చి.. జిల్లావాసుల కష్టసుఖాల్లో పాలుపంచుకుని.. అందరి మనస్సుల్లో చోటు సంపాదించడమే కాకుండా.. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు.                       
 
 డిచ్‌పల్లి :
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను  ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుస్తామ ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం  చేసిన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆదివారం తొలిసారి జిల్లాకు వచ్చిన కవితకు  డిచ్‌పల్లి మండలం చ ంద్రాయన్‌పల్లి వద్ద టీ ఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తప్పక నెరవేరుస్తారని అ న్నారు.
 
రైతు రుణమాఫీ, పింఛన్లు, ఇళ్లు, భూములు అన్ని రకాల హామీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసిన జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ *10 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించారని అన్నారు. జిల్లాలో రెండుపార్లమెంట్ స్థానాలతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టిన జిల్లా ప్రజలందరికి వందనాలు తెలియజేస్తున్నానని అన్నారు.   కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకు లు ఎస్‌ఏ అలీం, జీనియస్ నారాయణరెడ్డి, శక్కరికొండ కృష్ణ, డాక్టర్ షాదుల్లా, చందర్‌నాయక్, నారాయణ తదితరులు  పాల్గొన్నారు.
 
జిల్లా సరిహద్దులో ఘనస్వాగతం
భిక్కనూరు : కవిత పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమా ణం చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వచ్చారు. ఆదివారం జిల్లా సరిహద్దు గ్రామమైన భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద  కవితకు జిల్లాలోని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 8.30 గంటలకు రావాల్సిన కవిత 11.30 గంటలకు వచ్చినప్పటికీ కార్యకర్తలు వేచిచూశారు. జిల్లా సరిహద్దులకు ఎంపీ వాహనశ్రేణి రాగానే పెద్ద ఎత్తున టపాకాయలను కాల్చారు. జిల్లాలోకి అడుగుపెట్టిన కవితకు డీసీఎంఎచ్ చైర్మన్ ముజీబొద్దిన్, భిక్కనూరు జడ్పీటీసీ సభ్యుడు నందరమేశ్‌లు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు.
 
 కన్న బాగా చదువుకో..తెలంగాణలో బంగారు భవిష్యత్తు నీదే...
‘కన్నా బాగా చదువుకో.. తెలంగాణలో బంగారు భవిష్యత్తు మీలాంటి చిన్నారులదేనని’ ఎంపీ కవిత అన్నారు. బస్వాపూర్ వద్ద ఎంపీ వచ్చిన సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ డాక్టర్ కుటుంబం కవితను చూసేందుకు ఆగింది. వారి కుమార్తె బేబి శాలిని ఎంపీ కవితకు అభివాదం చేసింది. దీంతో కవిత ఆ చిన్నారి వద్దకు వచ్చి జెతైలంగాణ అంటూ..మాట్లాడారు.  కన్నా బాగా చదువుకో ఏర్పడిన తెలంగాణలో బంగారు భవిష్యత్తు మీ చిన్నారులదేనన్నారు.
 
చంద్రశేఖర్‌కాలనీ : జిల్లా అభివృద్ధియే ఏజెండాగా ముందుకుసాగుతామని ఎంపీ కవిత అన్నారు.  ఆదివారం జిల్లాకు వచ్చిన ఆమె తన నివాసంలో  విలేకరులతో మాట్లాడారు. ప్రజలు తమపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని అఖండ మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుం డా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామన్నా రు.  తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి తెలంగాణ తొలి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారని అన్నారు. ఆ న మ్మకం వమ్ముకాకుండా బంగారు తెలంగాణ ఏర్పాటుకు ఆయన ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే మరమ్మతుల(కోచ్) ఏర్పాటు, ఆ ర్మూర్‌లో పసుపు, విత్తనాల  శుద్ధికేంద్రాల ఏర్పాటు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు.
 
త్వరలో పూర్ణకు అభినందన సభ
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి జిల్లా కీర్తిబావుటాను ఎగురవేసిన   సిరికొండ మండలం పాకాల కు చెందిన మాలావత్ పూర్ణకు త్వరలో జిల్లా కేం ద్రంలో అభినందనసభను ఏర్పాటు చేస్తామన్నా రు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశా ల ఏర్పాటుకు కూడా తనవంతు కృషి చేస్తానన్నా రు. సమావేశంలో టీఆర్‌ఎస్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎ మ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement