మాచారెడ్డి, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంపగోవర్ధన్ ఆదివారం పోతారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోడిగ్రుడ్లను విసిరే ప్ర యత్నంచేశారు. అక్కడే ఉన్న పో లీసులు కోడిగుడ్లను విసురుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులపైకి తిరగబడడంతో అదుపులోకి తీసుకున్నారు. అలాగే గంప గోవర్ధన్ పోతారంలో ప్రచారం ముగించుకుని భవానీపేటకు వెళ్లగా, అక్కడ ర్యాలీలో పలువురు మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలతో నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేశారు. పోలీసులు సర్ధిచెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు.
ఐదుగురిపై కేసు నమోదు
గంప గోవర్ధన్‌పై కోడిగుడ్లతో దాడికి య త్నించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై ప్రసాద్‌రావు తెలిపారు. గ్రామానికి చెందిన మెట్టు రాజనర్సు, గ్యార డ్రై వర్ సాయిలు, స్వామి, పెద్ద గంగయ్య, గంభీరావుపేట శ్రీనివాస్‌గౌడ్‌లపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
‘గంప’పై కోడిగుడ్లతో దాడికి యత్నం
Published Mon, Apr 21 2014 1:56 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM
Advertisement
Advertisement