machareddy
-
Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి
మాచారెడ్డి: అమెరికా అమ్మాయి మాచారెడ్డి అబ్బాయి వివాహానికి కామారెడ్డి పట్టణం వేదికైంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన సిద్దంశెట్టి గంగ, రమేశ్‌ల పెద్ద కుమారుడు సాయి సంకేత్ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ సహాధ్యాయి అయిన కన్సిలో ఎలిజబెత్, ఫ్రాన్సిస్కో ఎర్నిస్టోల కూతురు రిషికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురూ తమ తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో శనివారం రాత్రి కామారెడ్డిలోని సత్య గార్డెన్లో వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. (చదవండి: TSPSC: పేపర్ లీక్‌లో కొత్త కోణం.. ఉద్యోగికి హానీట్రాప్!) -
కూతురిపైనే కన్నేసిన తండ్రి..ఆర్నెళ్లుగా..
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కన్న కూతురినే చెరబట్టాడు. ఆర్నెళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సాక్షి, మాచారెడ్డి(ఖమ్మం) : సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వె లుగు చూసింది. కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కిరాతకుడు కూతురిపైనే గత అ ర్నెళ్లుగా అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. ఆ యువతి గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పిట్ల నర్సింహులు సొంత కూతురి(19)పైనే కన్నేశాడు. ఓ రోజు ఇంట్లో భార్య, కుమారుడు ఉండగా అందరూ కలిసి కల్లు తాగారు. అనంతరం మద్యం మత్తులో వావి వరసలు మరిచిన నర్సింహులు కన్న కూతురిపైనే బలత్కారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం తల్లికి చెప్పగా, ఆమె భర్తను గట్టిగా నిలదీసింది. అయినా వక్రబుద్ధి మారని ఆ కిరాతకుడు కూతురుని బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సోమ వారం కళ్లు తిరిగి పడిపోయిన ఆ యువతి గ్రామంలోని ఆశ వర్కర్ వద్దకు వెళ్లింది. అక్కడ పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భిణి అని తేలింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. బాధితురాలి తల్లి మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. -
రైతుల ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు..
వేలాడుతున్న విద్యుత్ తీగలు యమపాశాలయ్యాయి. ఇంకో నిమిషంలో పని పూర్తవుతుందనగా కరెంటు తీగ రూపంలో వచ్చిన మృత్యువు.. మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బోరుమోటారుకు మరమ్మతులు చేస్తుండగా వేలాడుతున్న విద్యుత్ తీగలకు పైపులు తగలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సాక్షి, మాచారెడ్డి: వెల్పుగొండ గ్రామానికి చెందిన ఇమ్మడి సత్యనారాయణ(40), ఐలేని లక్ష్మణ్‌రావు(70), ఐలేని మురళీధర్‌రావు (50) వ్యవసాయం చేసుకుంటూ తీరిక సమయాల్లో బోరుమోటార్లును మరమ్మతులు చేస్తుంటారు. అదే గ్రామానికి చెందిన మారగోని స్వామిగౌడ్ బోరుమోటారు చెడిపోయింది. దీంతో మరమ్మతు చేయడానికి ఆయన వీరికి సమాచారం అందించారు. ముగ్గురు సోమవారం ఉదయం భోజనాలు చేసి ఇంటి నుంచి దోమకొండ– వెల్పుగొండ రహదారి పక్కన ఉన్న స్వామిగౌడ్ చేనుకు వెళ్లారు. మోటారుకు మరమ్మతులు చేయడం కోసం పైపులు పైకి తీయ డం ప్రారంభించారు. చివరి పైపును కూడా బోరు బావిలోంచి తీస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. పైప్‌నకు మోటారు ఉండడంతో బరువు ఎక్కువై పైపు ఓ వైపునకు ఒరిగింది. సమీపంలోనే ఉన్న విద్యుత్ తీగలకు పైపు తగిలింది. దీంతో విద్యుత్ ప్రసారమై ముగ్గురు అక్కడికక్కడే విగతజీవులయ్యారు. సత్యనారాయణ కాలు, లక్ష్మణ్‌రావు చేయి పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృతులు సత్యనారాయణకు భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లక్ష్మణ్‌రావుకు భార్య రాజవ్వ, ఐదుగురు పిల్లలున్నారు. మురళీధర్‌రావుకు భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిన్నంటిన రోదనలు.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాత పడిన ఘటన వెల్పుగొండలో విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకుని గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి వచ్చారు. హృదయ విదారక ఘటనను చూసి విలపించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, మాచారెడ్డి ఎస్సై మురళి సంఘటన స్థలానికి వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ఆందోళన విద్యుత్ ప్రమాదానికి ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. విద్యుత్ తీగలు బోరుబావికి అతిసమీపంలో ఉన్నాయని, తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని ఆరోపించారు. విద్యుత్ తీగలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వేలాడుతున్న వాటిని సవరించాల్సిన ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చే శారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాచారెడ్డి ఎస్సై మురళి గ్రామస్తులను సముదాయించారు. రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి వెల్పుగొండ గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదంపై మాజీ మంత్రి షబ్బీర్‌అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోరుమోటారు తీయడానికి వెళ్లిన రైతులు కరెంట్ షాక్‌తో చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతులు మురళీధర్‌రావు, లక్ష్మణ్‌రావు, సత్యనారాయణ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మాచారెడ్డిలో చిరుతల కలకలం
మాచారెడ్డి (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు పది చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని అన్నారం, అక్కాపూర్, ఇసాయిపేట, మద్దికుంట, రెడ్డిపేట ప్రాంతాల్లో చిరుతలు సంచిరిస్తున్నాయని సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. -
పచ్చని చెట్లే భావితరాలకు మెట్లు
మాచారెడ్డి : పచ్చని చెట్లే భావితరాలకు మెట్లని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం రత్నగిరిపల్లి, అక్కాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు వారం రోజుల తరబడి వర్షాలు పడుతుండేవని, ప్రస్తుతం అడవులు అంతరించిపోవడంతో వర్షాల జాడ కనబడక తాగునీటి కోసం అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం బాటలు వేయడానికి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. రైతాంగానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే కేసీఆర్ ధ్యేయమని అన్నారు. మరో రెండేళ్లలో సింగూరు నుంచి రూ. 4 వేల కోట్లతో మిగిలిన జిల్లాలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రూ. 40వేల కోట్లు కేవలం తాగునీటి కోసమే ఖర్చు చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పుష్కలంగా వర్షాలు కురిసి వాగులు, వంకలు పొర్లుతున్నాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు వరంగల్, మెదక్, కరీంనగర్జిల్లాలో అడవులు అంతరించిపోవడం వల్ల వర్షాపాతం తక్కువగా నమోదై కరువు పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంపగోవర్ధన్, జెడ్పీటీసీ సభ్యురాలు గ్యార లక్ష్మిసాయిలు, ఏఎంసీ చైర్మన్ రాజమణి, టీఆర్ఎస్ నేతలు ముజీబొద్దీన్, లక్ష్మారెడ్డి, బుక్యానర్సింలు, అంజీనాయక్, బాల్‌రాజు, బాల్‌చంద్రం, శ్రీశైలం, నాగిరెడ్డి, శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
పెళ్లి విందు తిని 40 మందికి అస్వస్థత
మాచారెడ్డి (నిజామాబాద్) : పెళ్లి భోజనం వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట పంచాయతీ పరిధిలోని సర్దార్తండాలో గురువారం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి తండాకు చెందిన ఓ యువతి వివాహం జరిగింది. ఆ వివాహ విందులో భోజనం చేసిన గ్రామస్థులు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో 30 మందిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
‘గంప’పై కోడిగుడ్లతో దాడికి యత్నం
మాచారెడ్డి, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంపగోవర్ధన్ ఆదివారం పోతారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోడిగ్రుడ్లను విసిరే ప్ర యత్నంచేశారు. అక్కడే ఉన్న పో లీసులు కోడిగుడ్లను విసురుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులపైకి తిరగబడడంతో అదుపులోకి తీసుకున్నారు. అలాగే గంప గోవర్ధన్ పోతారంలో ప్రచారం ముగించుకుని భవానీపేటకు వెళ్లగా, అక్కడ ర్యాలీలో పలువురు మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలతో నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేశారు. పోలీసులు సర్ధిచెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఐదుగురిపై కేసు నమోదు గంప గోవర్ధన్‌పై కోడిగుడ్లతో దాడికి య త్నించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై ప్రసాద్‌రావు తెలిపారు. గ్రామానికి చెందిన మెట్టు రాజనర్సు, గ్యార డ్రై వర్ సాయిలు, స్వామి, పెద్ద గంగయ్య, గంభీరావుపేట శ్రీనివాస్‌గౌడ్‌లపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పల్లెను వదిలేశారు
కామారెడ్డి, న్యూస్‌లైన్ : మొదటి విడత రచ్చబండ కార్యక్రమా న్ని గ్రామాల్లో నిర్వహించిన సర్కారు రెండో విడత కార్యక్రమాన్ని మండల కేంద్రాలకే పరిమి తం చేసింది. నిలదీతలను తప్పించుకోవడం కోసం మూడో విడతలో కేవలం లబ్ధిదారులనే రప్పించాలని పథకం రచించారు. లబ్ధిదారుల కు ఎంట్రీ పాస్‌లు ఇచ్చారు. అయితే కొత్తగా ప్రభుత్వ పథకాల కోసం వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ప్రతి చోటా రచ్చబండ సభలు రసాభాసగా మారాయి. ‘బంగారుతల్లి’కి దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం మాచారెడ్డిలో నిర్వహించిన రచ్చబండకు ఓ తల్లి మూడు నెల ల పాపతో వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో తన కూతురును కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రభు త్వ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ఆ తల్లి కూతురిని కోల్పోయింది. రచ్చబండను నీరుగార్చడం వల్లే... ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన రచ్చబం డ లక్ష్యాన్ని దెబ్బతీయడం వల్లే ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. రచ్చబండలో దరఖాస్తు చేయడం కోసం వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాట ఓ చిన్నారిని పొట్టనపెట్టుకున్న సంఘటన అందరినీ వేదనకు గురి చేసింది. రచ్చబండలో దరఖాస్తులు ఇచ్చేందుకు వందలాది మంది తరలి వస్తుండడం, దరఖాస్తులు సమర్పించడం కోసం గంటల తరబడి బారులు తీరాల్సి రావడంతో తోపులాట జరుగుతోంది. అదే గ్రామాల్లో సభలు నిర్వహిస్తే ఇంత మంది ఉండరు. తక్కువ మంది వస్తే సమస్యలు చెప్పుకోవడానికీ అవకాశం ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రచ్చబండను గ్రామాల వారీగా నిర్వహించాలని కోరుతున్నారు. -
మూడు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ
రచ్చబండ కార్యక్రమం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. బంగారుతల్లి పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చిన మూడు నెలల మోక్ష అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి చర్చబండ కార్యక్రమంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలకేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తీవ్రంగా తోపులాట జరగడంతో మూడు నెలల మోక్ష తీవ్ర అస్వస్థతకు గురైంది. రచ్చబండ నిర్వహిస్తుండగా అకస్మికంగా తోపులాట జరగడంతో ఊపిరాడక చిన్నారి మోక్ష తీవ్ర అనారోగ్యానికి లోనైంది. ఆ చిన్నారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. బంగారుతల్లి పథకం ద్వారా చెక్కు తీసుకోడానికి మాచారెడ్డి మండలంలోని భవానీపేట తండాకు చెందిన చిన్నారి మోక్షను వారి తల్లిదండ్రులు మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి తీసుకువచ్చారు. రచ్చబండలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఆ చిన్నారి చివరకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి విషాదకర సంఘటన చోటుచేసుకోవడం పట్ల కార్యక్రమానికి వచ్చిన పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలుత అందరూ చిన్నారి మోక్షను బంగారుతల్లి లబ్ధిదారుగా భావించారు. అయితే, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాత్రం ఆమె లబ్ధిదారు కాదని, పథకానికి దరఖాస్తు చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉంటారని ఆయన చెప్పారు. అలాగే మాచారెడ్డిలో ఏర్పాట్లు కూడా పూర్తిగానే చేశామని కలెక్టర్ తెలిపారు. అయితే, దరఖాస్తు తీసుకోడానికే తాము అక్కడకు వచ్చినట్లు చిన్నారి మోక్ష తల్లి రేణుక 'సాక్షి'కి తెలిపారు.