కూతురిపైనే కన్నేసిన తండ్రి..ఆర్నెళ్లుగా.. | Druken Father Molested 19 Years Daughter In Nizamabad | Sakshi
Sakshi News home page

కనురెప్పే కాటేసింది

Published Wed, Feb 12 2020 9:13 AM | Last Updated on Wed, Feb 12 2020 9:13 AM

Druken Father Molested 19 Years Daughter In Nizamabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కన్న కూతురినే చెరబట్టాడు. ఆర్నెళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

సాక్షి, మాచారెడ్డి(ఖమ్మం) : సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వె లుగు చూసింది. కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కిరాతకుడు కూతురిపైనే గత అ ర్నెళ్లుగా అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. ఆ యువతి గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పిట్ల నర్సింహులు సొంత కూతురి(19)పైనే కన్నేశాడు.

ఓ రోజు ఇంట్లో భార్య, కుమారుడు ఉండగా అందరూ కలిసి కల్లు తాగారు. అనంతరం మద్యం మత్తులో వావి వరసలు మరిచిన నర్సింహులు కన్న కూతురిపైనే బలత్కారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం తల్లికి చెప్పగా, ఆమె భర్తను గట్టిగా నిలదీసింది. అయినా వక్రబుద్ధి మారని ఆ కిరాతకుడు కూతురుని బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సోమ వారం కళ్లు తిరిగి పడిపోయిన ఆ యువతి గ్రామంలోని ఆశ వర్కర్‌ వద్దకు వెళ్లింది. అక్కడ పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భిణి అని తేలింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. బాధితురాలి తల్లి మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement