
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆమెపై కర్కషంగా ప్రవర్తించాడు. రక్త బంధాన్ని మరిచి కూతురిపైనే కామాంధుడిలా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాగిన మైకంలో కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలిదించుకునే ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యక్తి తన భార్య, పదేళ్ల కూతురుతో నివసిస్తున్నాడు.
భార్య పనికోసం బయటకు వెళ్లడంతో.. మద్యం మత్తులో ఉన్న భర్త అయిదో తరగతి చదువుతున్న కూతురిపై ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తల్లి పని నుంచి ఇంటికి తిరిగి రావడంతో తనకు జరిగిన ఘోర ఘటన గురించి బాలిక వివరించింది. దీంతో మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కామాంధుడిని ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచిన అనంతరం పల్లడం సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
చదవండి: ‘నేనేం పాపం చేశాను’.. ముళ్లపొదల్లో శిశువు మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment