
ప్రతీకాత్మక చిత్రం
నల్లగొండ క్రైం: మద్యానికి బానిగా మారి కన్నకూతురిని లైంగిక వేధింపులకు గురిచేసిన తండ్రిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ మండలం చెన్నుగూడెం గ్రామానికి చెందిన మర్రి నర్సింహ కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. పైగా సమీప బంధువులు తీసుకువచ్చిన వివాహ సంబంధాలను చెడగొడుతూ మానసికంగా వేధిస్తున్నాడని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment