‘గంప’ ఇల్లు ముట్టడి
కామారెడ్డిటౌన్ : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరు తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఇంటిని శనివారం ముట్టడించారు. ఎమ్మెల్యేతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయిం బర్స్‌మెంట్ రాకపోడంతో విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బం దులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
పెండింగ్‌లో ఉన్న 1500 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంసెట్, డైట్‌సెట్ కౌన్సెలింగ్‌లను వెంటనే నిర్వహించి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎ మ్మెల్యే సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్, పట్టణ అధ్యక్షుడు సుధీర్, కార్యదర్శి అరుణ్, నాయకులు రమేశ్, సంతోష్ పాల్గొన్నారు.