పటాన్ చెరు ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్ | petition on trs MLA mahipal reddy | Sakshi
Sakshi News home page

పటాన్ చెరు ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్

Published Tue, Jan 5 2016 1:02 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

petition on trs MLA mahipal reddy

హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఓ వక్తిపై దాడి చేసిన కేసులో మహిపాల్ రెడ్డికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడిందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే డిస్ క్వాలిఫై అయిన ఎమ్మెల్యేకు జీతం ఎలా చెల్లిస్తారని, అందుకు అసెంబ్లీ సెక్రటరీ పై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ రఘనందన్ రావు కోర్టను కోరారు. 
 
మరో వైపు పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గానికి  త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ ప్రకటించారు. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం రెండు ఏళ్లకు మించి శిక్ష పడ్డ ప్రజా ప్రతినిధిపై ఆటోమేటిగ్గా అనర్హత  వేటుపడుతుంది. ఈ నేపధ్యంలోనే  ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ వర్గలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement