
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. అదే విధంగా ఈ కేసులో... వినయ్ భాస్కర్ సహా 18 మందికి న్యాయస్థానం రూ.3 వేలు జరిమానా విధించింది. అయితే, దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.
కాగా టీఆర్‌ఎస్ తరఫున దాస్యం వినయ్‌భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment