rail roko case
-
హైకోర్టులో మాజీ సీఎం సీఎం కేసీఆర్‌కు ఊరట...
-
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2011లో జరిగిన రైలు రోకో కేసు వ్యవహారంలో విచారణపై హైకోర్టు స్టే విధించింది.కాగా, 2011లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తనపై రైలు రోకో కేసులో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్లో కోరారు. తాను రైలు రోకోలో పాల్గొనలేదని తెలిపారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. కాగా, కేసీఆర్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై స్టే విధించింది. ఇదే సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టును మాజీ సీఎం కేసీఆర్ ఆశ్రయించారు. తనపై నమోదైందని, ఆ కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, 15వ నిందితుడుగా చేర్చారని అన్నారు.అసలు తాను రైల్ రోకోలో పాల్గొనలేదని, కేసు కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పిటిషన్‌పై మంగళవారం (జూన్25న)తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. -
చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. అదే విధంగా ఈ కేసులో... వినయ్ భాస్కర్ సహా 18 మందికి న్యాయస్థానం రూ.3 వేలు జరిమానా విధించింది. అయితే, దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ తరఫున దాస్యం వినయ్‌భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. -
‘రాహుల్ రుడాలీగా పేరు మార్చుకోవాలి’
కవితపై రైల్‌రోకో కేసు కొట్టివేత హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పేరును రుడాలీ(అద్దెకు ఏడ్చే తెగ) గాంధీగా పేరు మార్చుకోవాలని ఎంపీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. యువనాయకుడు ప్రజల్లో స్ఫూర్తి నింపాలి తప్ప, ఎంతసేపూ వ్యతిరేక వైఖరి అవలంభిచ డమేంటని ప్రశ్నించారు. శుభమా అని ఓయూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే శోకాలు పెట్టడానికి కాంగ్రెస్‌వాళ్లు రాహుల్ గాంధీని తీసుకొస్తారా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. 2011 అక్టోబర్ 15 నాటి రైల్‌రోకో కేసు విచారణలో భాగంగా బుధవారం సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని రైల్వే కోర్టుకు ఆమె హాజరయ్యారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కోర్టు బయట మాట్లాడుతూ.. కోర్టు కేసు నుంచి విముక్తి కలిగించినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే గొప్ప ఉద్యమాలు నడిపి.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముం దుకు సాగుతున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని రెండు పచ్చపార్టీలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. మతపరమైన రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని, టీఆర్ఎస్ ఏనాడూ ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైల్‌రోకో కేసు కొట్టివేత
రైల్వే కోర్టుకు దత్తాత్రేయ, కోదండరాం, కేటీఆర్, రాష్ట్ర మంత్రులు హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన రైల్‌రోకో కేసుకు సంబం ధించి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, జేఏసీ చైర్మన్ బుధవారం బోరుుగూడలోని రైల్వేకోర్టుకు హాజరయ్యారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నారుుని, పద్మారావు, కేటీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి తదితరులు రైల్వే రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. మౌలాలి రైల్వేస్టేషన్లో జరిగిన రైల్‌రోకో ఆందోళనలో పాల్గొన్నారని 2011లో రైల్వే పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. సుమారు 2 గంటలపాటు మంత్రులు, జేఏసీ చైర్మన్ కోర్టు ఆవరణలో గడిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన ఉద్యమిస్తున్న కోదండరాం తెలంగాణ మంత్రులతో పిచ్చాపాటిగా, చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ కనిపించడం గమనార్హం. ఈ నెల 24న తన కుమార్తె విజయలక్ష్మి వివాహనికి ఆహ్వానిస్తూ కేటీఆర్ తదితరులకు దత్తాత్రేయ శుభలేఖలు అందజేశారు. కోర్టు కేసుపై స్పందించాలని మంత్రులను విలేకరులు కోరగా అందరి తరఫున కోదండరాం మాట్లాడతారని చెప్పి కార్లలో వెళ్లిపోయారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కేసులు నమోదయ్యాయని, పలు కేసులు ఇంకా ఆయా కోర్టుల్లో నడుస్తున్నాయని వివరించారు. రైల్‌రోకోకు సంబంధించి ఓ కేసును రైల్వే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోట్టి వేశారు. మళ్లీ ఎప్పుడైనా రైల్‌రోకోలు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడితే జైలుకు పంపిస్తామని జడ్జి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. -
రైల్వే కోర్టుకు స్పీకర్
కాజీపేట రూరల్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రైల్వే గేట్ రైల్‌రోకోలో పాల్గొన్న ప్రస్తుత స్సీకర్ మధుసూదనాచారితో పాటు మరో 8 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు బుధవారం కాజీపేట రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. కేసును మెజిస్ట్రేట్ ఆగస్టు 22వ తేదీకి కేసు వాయిదా వేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. స్పీకర్ మధుసూదనాచారితో పాటు వీరాటి లింగారెడ్డి, గంగుల రమేష్, ప్రభాకర్, రాంమూర్తి, రామారావు, ల్యాదెళ్ల బాలు, గాదె రాజు, సందీప్‌లు ఈ కేసులో ఉన్నారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేతకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిందని, మొక్కవోని ధైర్యంతో తెలంగాణ వాదులు వాటిని ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాyì తెలంగాణవాదులపై పెట్టిన రైల్వే కేసులను కొట్టివేతకు కృషి చేస్తుందన్నారు. -
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రి ఈటెల
కాజీపేట రూరల్ (వరంగల్) : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో ఉప్పల్-జమ్మికుంట మధ్య జరిగిన రైల్ రోకో కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం కాజీపేట రైల్వే కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వాదులపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రైల్వే మంత్రిని కలవనున్నట్లు తెలిపారు. కాగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా మాట్లాడి డీల్ చేసి తప్పించుకుంటున్నారని ఈటెల పేర్కొన్నారు. ఆడియో టేపులు బయటపెట్టక ముందు ఒకలా, బయటపెట్టిన తర్వాత మరోలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి వెంట ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.