కాజీపేట రూరల్ (వరంగల్) : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో ఉప్పల్-జమ్మికుంట మధ్య జరిగిన రైల్ రోకో కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం కాజీపేట రైల్వే కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వాదులపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రైల్వే మంత్రిని కలవనున్నట్లు తెలిపారు.
కాగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా మాట్లాడి డీల్ చేసి తప్పించుకుంటున్నారని ఈటెల పేర్కొన్నారు. ఆడియో టేపులు బయటపెట్టక ముందు ఒకలా, బయటపెట్టిన తర్వాత మరోలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి వెంట ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రి ఈటెల
Published Mon, Jun 8 2015 8:40 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement
Advertisement