minister etela rajender
-
ఫీవర్ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి ఈటల
-
పంట రుణాలు రూ.42,494 కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.42,494 కోట్ల పంట రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. గతేడాది లక్ష్యం కంటే ఇది రూ.2,741 కోట్లు అదనం. ఈ మేరకు 2018–19 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్ల బ్యాంకు రుణాలివ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా 42.47 శాతం, అంటే రూ.58,063 కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇస్తారు. ఇందులో పంట రుణాలు రూ. 42,494 కోట్లు. ఇందులో 60 శాతం ఖరీఫ్‌లో, 40 శాతం రబీలో ఇస్తారు. రూ.15,569 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, రూ.1,798 కోట్ల విద్యా రుణాలు, రూ.6,011 కోట్ల గృహ రుణాలు కూడా ఇస్తారు. పంట రుణాల్లో అధికంగా వరికి 19.52 లక్షల రైతులకు రూ.18,796 కోట్లిస్తారు. 8.09 లక్షల మంది పత్తి రైతులకు రూ.8,279 కోట్లు, 1.44 లక్షల మిరప రైతులకు రూ.1,141 కోట్లు, 3.86 లక్షల మొక్కజొన్న రైతులకు రూ.3 వేల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 96 వేల మందికి రూ.2,639 కోట్లు, ఉద్యాన పంటల సాగు, మొక్కల పెంపకానికి రూ.1,140 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.846 కోట్లు ఇస్తారు. గత యాసంగిలో 65 శాతమే గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా బ్యాంకులు రూ.21,025 కోట్లు (88.15 శాతం) ఇచ్చాయి. 88 శాతం, రబీలో 65 శాతం రుణాలిచ్చినట్టు వెల్లడించారు. గతేడాది వానాకాలం కానీ యాసంగిలో మాత్రం రూ.15,901 కోట్లకు గాను రూ.10,384 కోట్లే (65 శాతం) రైతులకు అందినట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. దాంతో రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. రూ.10,714 కోట్ల వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు రూ.7320.07 కోట్లు (68.32 శాతం) ఇచ్చారు. వ్యవసాయ మౌలిక వసతుల రుణాల లక్ష్యం రూ.1,323.03 కోట్లయితే రూ.391 కోట్లతో బ్యాంకులు సరిపెట్టాయి. రాష్ట్రానికి అగ్రస్థానంలో బ్యాంకర్లకూ పాత్ర: ఈటల రైతుబంధు పథకంతో రైతులందరినీ బీమా పరిధిలోకి తెచ్చామని ఈటల అన్నారు. రుణ ప్రణాళికను విడుదల చేశాక ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్రామాల్లోని గీత కార్మికులు, ఇతర వర్గాలకూ బీమా ఉందని గుర్తు చేశారు. గ్రామాల్లోని ఇతర పేదలకూ జీవిత బీమా అందేలా మరో పథకాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. ‘‘రైతు బంధుతో బ్యాంకుల్లో నగదు కొరత కాస్త తగ్గింది. దేశంలో ఈ పథకం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. కొత్త రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించి నంబర్‌వన్‌గా నిలవడంలో బ్యాంకర్ల పాత్ర కూడా ఉంది. వారికి ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు. రూ.5 వేల కోట్లు అందుబాటులో ఉంచాలని కేందాన్ని కోరితే రూ.3 వేల కోట్లే ఇచ్చారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఢిల్లీకి పోతే స్పందన ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అనేవారు. ఇప్పుడు ఆ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందుందని కాగ్ కూడా ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుంది. ఈ ఏడాది 10 లక్షల ఎకరాల స్థిర ఆయకట్టు ఇస్తాం. గతంలో రైస్ బౌల్ ఆఫ్ ఏపీ అనేవారు, ఇప్పుడు తెలంగాణ అంటున్నారు. ఏపీలో 43 లక్షల టన్నుల వరి పండితే, తెలంగాణలో 55 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది’’అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో శాఖలను పెంచాలని బ్యాంకర్లను కోరారు. వాటిల్లో ఉద్యోగుల సంఖ్యనూ పెంచాలన్నారు. ‘‘గ్రామీణ యువతకు గ్యారంటీ లే కుండా రుణాలివ్వండి. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. చిన్న పరిశ్రమలకు బ్యాంక్ డిపాజిట్ లేకుండా రుణాలివ్వండి. కుల వృత్తులకు రుణాలివ్వండి. చిన్న వృత్తులకు రూ.1,500 కోట్ల సబ్సిడీ ఇవ్వబోతున్నాం. వారి కి బ్యాంకులు రూ. 2–3 వేల కోట్లివ్వాలి’’అని కోరారు. మోకాలి చికిత్స వల్ల ఆస్పత్రిలో ఉన్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడా రు. ‘రైతుబంధు’లో సహకరించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
చీకట్లను చీల్చుకుంటూ..
‘ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అస్పష్టతలు, అనుమానాలు, సవాళ్లు... ఇలాంటి తరుణంలో కొత్త రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ అనతికాలంలోనే ఎన్నో విషయాల్లో దేశంలోనే ఆదర్శంగా ఎదిగింది. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, పాలనా సంస్కరణలు.. ఒక్కటేమిటి ఇలా ఎన్నో అంశాల్లో తెలంగాణ చూపిన బాటే అనుసరణీయమని ఇతర రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ విజయాలు తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో కలిగిస్తున్నాయి’ ‘ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే దిశగా వినూత్న పథకాలు ప్రారంభించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోకి తెచ్చాం. 45 నెలల స్వల్పకాలంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాం. చీకటి నుంచి వెలుగులోకి, అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం’ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పడకముందు అంతా చీకట్లే. సమైక్య పాలన చివరి రెండేళ్లలో తెలంగాణ ప్రాంత జీఎస్డీపీ వృద్ధి రేటు (4.2 శాతం) దేశ సగటు (5.9 శాతం) కన్నా తక్కువ. జీడీపీ వృద్ధి రేటు రాష్ట్రం ఏర్పడితే కాని పెరగలేదు.. 6.8 శాతం నుంచి ఇప్పుడు 10.4 శాతం దిశగా దూసుకెళ్తోంది’’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు తయారీ రంగం, విద్యుత్, నీటిపారుదల.. ఇలా అన్నింటా నిస్తేజమే ఉందని చెప్పారు. మనకున్న వనరులు, అవసరాలను సరిగ్గా అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగటం వల్లే రాష్ట్రం పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఆ ప్రగతిని కళ్లారా చూస్తున్న ప్రజల నమ్మకాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా కొత్త బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్దులతోపాటు వివిధ రంగాల్లో రాష్ట్ర పురోగతిని వివరించారు. సమైక్య పాలనతో మొదలుపెట్టి ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్టెట్ కావటంతో గడచిన నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనా తీరును వివరిస్తూ ఈటల ప్రసంగ పాఠం మొదలైంది. రాష్ట్రాభివృద్ధిలో వ్యవసాయ రంగానిదే ప్రధాన భూమిక అని, సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడిందని పేర్కొన్నారు. రైతులకు తక్షణ తోడ్పాటు అందించేందుకు 35 లక్షల మందికి సంబంధించి రూ.16,124 కోట్ల రుణాలను ప్రభుత్వమే చెల్లించిందని గుర్తు చేశారు. చెరువులను పునరుద్ధరించటం ద్వారా సాగునీటి సమస్య పరిష్కరిస్తోందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింద ని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు రెండు విడతల్లో ప్రతి రైతుకు రూ.8వేలు ప్రభుత్వమే అందిస్తోందన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లను ప్రతిపాదించినట్టు వె ల్లడించారు. ఇలా ప్రభుత్వ వి ధానాలను వివరిస్తూ.. శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులను చదివి వినిపించారు. పెట్టుబడి సాయం అందించాలంటే భూరికార్డులు సమగ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో 10,823 గ్రామాల్లో భూరికార్డులను పరిశీలించి మార్పులు చేసినట్టు చె ప్పారు. రాత్రింబవళ్లు కష్టపడి వంద రోజుల్లో ఈ తంతు పూర్తి చేశామన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకు రైతు సమన్వయ సమి తి విధానాన్ని ప్రారంభించామని వివరించారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, రూ.5 లక్షల చొప్పున బీమా సదుపాయాన్ని కల్పించేందుకు రూ.500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లు, బిందు తుంపర సేద్యం కోసం రూ.127 కోట్లు, పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌ల కోసం రూ.120 కోట్లు, మార్కెటింగ్ సదుపాయాల మెరుగు, గోదాముల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీల లింకేజీ... తదితరాల కోసం రూ.15780 కోట్లు ప్రతిపాదించామన్నారు. కోటి ఎకరాలకు నీరే లక్ష్యంగా.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించటం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టామని ఈటల వివరించారు. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాకాలం పంట నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ‘‘రికార్డు సమయంలో భక్త రామ దాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్దినెలల్లోనే వాటర్ పంపింగ్ పాక్షికంగా ప్రారంభిస్తాం. రెండేళ్లలో రిజర్వాయర్లు, కాల్వలతో సహా పూర్తి చేస్తాం. రైతులకు వరప్రదాయిని అయిన మిషన్ కాకతీయను వేగంగా జరుపుతున్నాం. మొత్తంగా సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’అని తెలిపారు. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చి దిద్దేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 3.20 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని, వాటిని అమ్ముకునేందుకు 31 హోల్‌సేల్ చేపల మార్కెట్లు, 200 రిటైల్ మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా చెప్పొచ్చన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద వచ్చే సంవత్సర కాలంలో రూ.298 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదు: ఈటల కొందరు అంటున్నట్టుగా ఇది ఎన్నికల బడ్జెట్ కాదని, రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో రూపొందించిన బడ్జెట్ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో కలిసి శాసనసభ కమిటీహాలులో గురువారం ఆయన మాట్లాడారు. ఉత్పాదక, సేవారంగంతోపాటు అన్ని వృత్తులు, వర్గాలకు తండ్రిలా అండగా ఉండే బడ్జెట్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత అని, ఆసరా లేని పెద్దలకు పెద్ద దిక్కులాగా ప్రభుత్వం ఉందని చెప్పారు. ఏ రాష్ట్రానికైనా, కుటుంబానికైనా అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అప్పులు తెచ్చి ఆస్తులను, ఉత్పాదక వనరులను, సంపదను పెంచుతున్నామని వివరించారు. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు 26 శాతం నిధులను అదనంగా కేటాయించామన్నారు. డబుల్ ఇళ్లలో వేగం నిరుపేదలు కూడా సౌకర్యవంతమైన ఇళ్లలో జీవించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం వేగం పుంజుకుందని ఈటల చెప్పారు. ఇప్పటికే 9,522 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 1,68,981 ఇళ్లు పురోగతిలో ఉన్నాయని, తాజా బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,643 కోట్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ప్రజలకు ఎంతో అ వసరమైన వైద్య రంగానికి రూ.7,375 కోట్లు కేటాయించామన్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించనున్నామని, వచ్చే విద్యాసంవత్సరంలో ఆ టీచర్లు స్కూళ్లల్లో ఉంటా రని పేర్కొన్నారు. రోడ్లు, వంతెన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. యాదాద్రి తరహాలో భద్రాచలం, వేములవాడ, ధర్మపురి, బాసర దేవాలయాలను కూడా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. చెణుకులు లేకుండా సాదాసీదాగా... గతంలో ఎప్పుడూ లేనంత సుదీర్ఘంగా ఈటల బడ్జెట్ ప్రసంగం సాగింది. దాదాపు గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ చెణుకులు లేకుండా సాదాసీదాగా ముగిసింది. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ బడ్జెట్‌కు రూపమిచ్చినట్టు తెలిపారు. వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాదాపు గం టా పది నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. -
కేసీఆర్ ఎన్నికల రథానికి.. జెండాపై రైతన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నాగేటి సాళ్లకు నిధుల వరద పారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా 26 శాతం నిధులను సాగుకే మళ్లించింది. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్నదాతలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈసారి రైతులోకాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే మొదటి బడ్జెట్లో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిన సర్కారు ఈసారి.. వారికోసం రెండు భారీ వరాలు ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగానే ప్రకటించినట్టుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించే బృహత్తర పథకాన్ని ప్రకటించింది. పునాస పంటలకు ఏప్రిల్‌లో, యాసంగి పంటలకు నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. దీనికితోడు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ‘రైతు బీమా పథకం’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించేందుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ రెండు పథకాలు మినహా బడ్జెట్లో కొత్త వరాలేమీ ప్రకటించలేదు. రైతులకిచ్చే వడ్డీలేని పంట రుణాలకు రూ.500 కోట్లు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రూ.522 కోట్లు కేటాయించింది. ట్రాక్టర్లు, సేద్యపు పరికరాలతోపాటు నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వానికి రైతులకు అనుసంధానంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర రానట్లయితే రైతు సమన్వయ సమితి నేరుగా వాటిని కొనుగోలు చేస్తుందని, అందుకు తగిన నిధులను సమకూరుస్తామని భరోసానిచ్చింది. 2018–19 సంవత్సరానికి మొత్తం రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందులో రూ.20,820 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకే వెచ్చించనుంది. సాగునీటికి గతేడాది మాదిరే.. వ్యవసాయం తర్వాత సాగునీటి రంగానికి రెండో ప్రాధాన్యమిచ్చింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది తరహాలోనే రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో భాగంగా ప్రాజెక్టులపై ఖర్చు చేసే నిధులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుకు వెచ్చించే నిధులు రైతు ప్రయోజనాలను ఉద్దేశించినవే కావటం గమనార్హం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సబ్సిడీకి రూ.4,984 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా.. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గా ఉంటుంది. అందుకే సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో అన్ని వర్గాలపై ప్రభుత్వం వరాలు కురిపిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆకర్షనీయ పథకాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. రైతుల తర్వాత మైనారిటీలు రాష్ట్రంలో మొత్తం 76 లక్షల మంది రైతులున్నారు. వారిని ఆకట్టుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. అన్నదాతల తర్వాత మైనారిటీలను ఆకట్టుకునేందుకు ఎక్కువ నిధులు వెచ్చించింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో మైనారిటీలకు రూ.4,400 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు వెచ్చించిందని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. బీసీలు, ఎంబీసీలకు పాత నిధులే గతేడాది బీసీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం వాటిని ఖర్చు చేయటంలో మాత్రం ఆసక్తి కనబరచలేదు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) గతేడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించినా నిధులు ఖర్చు చేయలేదు. అయినా ఈసారి రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ యువతకు భారీ సబ్సిడీపై స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మూడేళ్లుగా ఆచరణలో విఫలమైంది. ఈసారి ఆర్థిక చేయూతనిచ్చే స్వయం ఉపాధి పథకాలకు రూ.1,682 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 38 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్లకు రూ.5,366 కోట్లు కేటాయించింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులకు రూ.3,282 కోట్లు కేటాయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధికి(సీడీపీ) రూ.480 కోట్లు వెచ్చించనుంది. వరుసగా నాలుగేళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ భగీరథ పథకానికి రూ.1,803 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. బడ్జెటేతర నిధులతో వీటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం తరఫున అందిస్తామని ప్రకటించిన సీఎం.. బడ్జెట్లో ఈ మేరకు నిధులు సర్దుబాటు చేశారు. గ్రామ పంచాయతీల నిధికి రూ.1,500 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,000 కోట్ల కేటాయింపులు చేసింది. కార్పొరేషన్లకు కూడా రూ.700 కోట్ల ప్రత్యేక నిధిని ప్రకటించింది. ముఖ్యమంత్రి నిధి 3 వేల కోట్లు గతంలో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధికి బడ్జెట్ నుంచి కేటాయింపులు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి రూ.3000 కోట్లు కేటాయించినా బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఐ శాఖకు ఈసారి రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో ప్రవాస తెలంగాణవాసుల అభివృద్ధి, సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గల్ఫ్‌లో ఉన్న తెలంగాణవాసుల కష్టాలు తీర్చేందుకు ఈ నిధులను వెచ్చించే అవకాశాలున్నాయి. బడ్జెట్ 2018-19 మొత్తం బడ్జెట్: 1,74,453.83 ప్రగతి పద్దు: 1,04,757.90 నిర్వహణ పద్దు:69,695.93 ( రూ. కోట్లలో) బడ్జెట్‌పై సాక్షి మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి -
కేంద్రంపై నమ్మకం ఉంది
► అభివృద్ధి పనులకు జీఎస్టీ తగ్గింపుపై మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న పనులకు జీఎస్టీ అమలులో న్యాయం చేస్తారని తమకు కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన విలేక రులతో మాట్లాడుతూ, ప్రజాసంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధి పనులపై అదనపు భారం వేయ వద్దన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తిపై కౌన్సిల్ సమా వేశంలో చర్చించామని, వచ్చే సమావేశంలో దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రానైట్, బీడీ పరిశ్రమ లపై పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని, ఫిట్మెంట్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా రన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేం దుకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి జీఎస్టీ విషయంలో వినతులు వెల్లువలా వచ్చాయి. సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ నేతృ త్వంలోని వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం, గ్రానై ట్ వ్యాపారులు, హోటల్స్ అసోసియేషన్, టెక్స్ౖ టెల్, పౌల్ట్రీ అసోసియేషన్ల ప్రతినిధులు తమ వ్యాపారాలపై జీఎస్టీ తగ్గించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. వీటన్నింటినీ ఫిట్మెంట్ కమిటీకి పంపించి తగిన నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. కాగా, జీఎస్టీ తదుపరి కౌన్సి ల్ సమావేశం అక్టోబర్ 24న ఢిల్లీలో నిర్వహిస్తారు. కౌన్సిల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. → ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు లేదా గవర్న మెంట్ అథారిటీలకు నిర్మాణం రూపంలో అందిం చిన సేవలు, మరమ్మతు, నిర్వహణ, నవీకరణలకు జీఎస్టీని 12 శాతం విధిస్తారు. →అంతర్జాతీయ వినియోగదారులకు యాంట్రిక్స్ సరఫరా చేసే ఉపగ్రహ ప్రయోగ సేవల ప్రాంతాన్ని ఐజీఎస్టీ చట్టం, 2017 లోని సెక్షన్ 13 (9) ప్రకారం భారతదేశానికి బయటి ప్రాంతంగా పరిగణిస్తారు. అలాంటి సరఫరా సేవలకు ఐజీఎస్టీ నుంచి మినహాయిస్తారు. -
‘రైతుకు అండగా నిలుస్తున్నాం’
కరీంనగర్: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు నెలకొన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. గత మూడున్నరేళ్లలో ప్రజారంజక పాలన అందిస్తూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని అన్నారు. కరీంగనర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సంతోషంగా గడుపుతున్నారని చెప్పారు. దేశంలో గొప్ప మానవ ప్రయత్నం కాళేశ్వరం ప్రాజెక్టు అని, సీఎం స్వయంగా సీసీ కెమెరాలతో ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వచ్చే ఖరీప్ నుంచి ఎకరానికి రూ. 4వేలు చొప్పున రెండు పంటలకు రైతుకు పెట్టుబడిగా ఇవ్వడానికి సమన్వయ కమిటీలు, భూసమస్యలు పరిష్కరించడానికి సమగ్ర భూసర్వే చేపడుతున్నామని ఈటల తెలిపారు. రైతు సమన్వయ కమిటీలో ప్రతి కులానికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని, ఇప్పటికే కమిటీల ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. ఈ నెల 9 నుంచి కమిటీలకు ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. అనేక గ్రామాల్లో భూముల కంటే పాసుబుక్‌లే ఎక్కువగా ఉన్నాయన్నారు. భూసర్వేతో అలాంటి ఇబ్బందులను అధిగమిస్తామని, మూడు నెలల్లో భూసర్వే పూర్తి చేస్తామని వివరించారు. నదుల అనుసంధానంపై కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే తాము తప్పకుండా సహకరిస్తామన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఈటల హామీ ఇచ్చారు. -
రాష్ట్రానికి అన్యాయమే!
⇔ జీఎస్టీతో ఏటా రూ.4,000 కోట్ల లోటు ⇔ ఇలా పన్నుల సొమ్ము తగ్గినా పరిహారం దక్కే చాన్స్ లేదు ⇔ తమ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోకపోవడంపై రాష్ట్రం కినుక ⇔ రాజకీయంగా ఆఖరి ఒత్తిడికి ప్రభుత్వ యత్నం ⇔ కేంద్రంతో రాజీ పడే ప్రసక్తి లేదన్న మంత్రి ఈటల ⇔ ఢిల్లీలో జీఎస్టీ వేడుకలకు హాజరుకానున్న ఆర్థిక మంత్రి సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ అమలుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్నుల రాబడిలోనే ఏటా సుమారు రూ.4,000 కోట్ల లోటు ఏర్పడు తుందని లెక్కలు వేసింది. అంతేగాకుండా రాష్ట్రం తరఫున పంపిన ప్రతిపాదనలపై కేంద్రం నుంచి స్పందన రాకపోవటంతో.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటివాటిపై పన్ను రూపేణా వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రతిపాదనలపై కేంద్రాన్ని ఒప్పించేందుకు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఏటా రూ.4,000 కోట్లు లోటు! జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఖజానాకు పన్నుల రాబడిలో రూ.4,000 కోట్ల మేర లోటు తప్పదని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఇలా జీఎస్టీ అమలుతో వచ్చే లోటును కేంద్రం పరిహారం రూపంలో తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 14.5 శాతం కంటే తక్కువ ఆదాయ వృద్ధి ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనని మెలిక పెట్టింది. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కావడం, ఆదాయ వృద్ధి 17.9 శాతంగా ఉండడంతో రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం దక్కే అవకాశం తక్కువని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలపై జీఎస్టీ కారణంగా రూ.19,200 కోట్ల మేరకు అదనపు పన్ను భారం పడుతుందని లెక్కలు వేశారు. ఇక జీఎస్టీ శ్లాబ్‌ల ఖరారు సమయంలో తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయాలున్నాయి. దాంతో చేనేత, బీడీ పరిశ్రమపై పెరిగిన పన్ను భారంతో రాష్ట్రంలోని లక్షలాది మంది బీడీ, చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని గ్రానైట్ పరిశ్రమకు సైతం పన్నుపోటు తగలనుంది. వీటన్నింటికి కొంత మేర మినహాయింపులు ఇవ్వాలని, జీఎస్టీ స్లాబ్‌ను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం: ఈటల జీఎస్టీకి సంబంధించి రాష్ట్రం చేసిన కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నా.. మరికొన్నింటిని తోసిపుచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు అంశాలపై కేంద్రానికి లేఖ రాశారని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, బీడీ, చేనేత, సాగునీటి రంగాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారని వెల్లడించారు. ఫిర్యాదులుంటే కాల్ చేయండి జీఎస్టీ అమలును సాకుగా చూపి ధరలు పెంచొద్దని వ్యాపార, వాణిజ్య వర్గాలకు మంత్రి ఈటల సూచించారు. అనుమానాలు, అపోహలు వద్దని.. ప్రస్తుతమున్న వ్యాట్ తరహాలోనే పారదర్శకంగా పన్నులు, పన్నుల చెల్లింపు విధానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్ పరిధిలో 2.25 లక్షల మంది ఉన్నారని, జీఎస్టీతో డీలర్ల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. జీఎస్టీ అమలుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దేశంలో అత్యధి కంగా వాణిజ్య పన్నుల రాబడి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అందుకే రాష్ట్ర ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానా లుంటే 18004253787 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎక్సైజ్‌పై ప్రభావం లేకుండా.. జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఎక్సైజ్ ఆదాయంలో కోత పడకుండా ఉండేందుకు ఎక్సైజ్ చట్టం– 1968కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ పరిధిలోకి వచ్చే అంశాలను జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండేలా ఈ సవరణ లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పడ టంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టును ఎక్సైజ్ ఆఫీసర్‌గా మారుస్తూ సవరణ చేసింది. -
సొమ్మూ మనదే.. సోకూ మనదే..
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపులో మంత్రి ఈటల హుజూరాబాద్: ‘అనేక ఆకాంక్షల నేపథ్యంలో కొట్లాడి తెచ్చు కున్న రాష్ట్రంలో సొమ్ము మనదే..సోకూ మనదే..’అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని కరీం నగర్ జిల్లా హుజూరాబాద్‌లోని హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించారు. ముందుగా మంత్రి అంబేడ్కర్ చౌరస్తాలోగల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెడుతోందని వివరించారు. అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లు అందించారు. కార్యక్రమం లో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు -
‘కులవృత్తుల అభివృద్ధే సీఎం లక్ష్యం’
హైదరాబాద్: రాష్ట్రంలోకులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉప్పర, సగర కుల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని కులాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని తెలిపారు దానికోసమే ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం భవన నిర్మాణాల్లో ఎస్సీ, ఎస్టీ, వడ్డెరలతో సమానంగా తమకు కూడా 15 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల సగర, ఉప్పర కులస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దు
కాంగ్రెస్‌పై మంత్రి ఈటల రాజేందర్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో రైతుల సంక్షే మాన్ని అమలు చేస్తున్నాం. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ రైతుల సంక్షేమంలో భాగమే. ప్రాజెక్టులు పూర్తయితే తమకు భవిష్యత్ ఉండదనే దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెబెట్టేట్టు వ్యవహరిస్తున్నారు..’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం సహచర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. కాంగ్రెస్, టీడీపీల ప్రభుత్వాలు రైతులకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. స్వల్ప కాలంలోనే కోతల్లేని నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతుల మన్ననలు పొందామని తెలిపారు. అదే ఉత్సాహంతో సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం రైతుల కోసం వినూత్న పథకాలతో ముందుకు వెళుతోందని పోచారం అన్నారు. తమ ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కాళ్ల కింద భూమి కదలుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మా భూమి – మా పంట ’పేరిట భూములపై త్వరలో సమగ్ర సర్వే చేయనున్నామని చెప్పారు. -
సన్న బియ్యం కాదు.. బిహార్ బియ్యం!
♦ పౌరసరఫరాల శాఖలో అవకతవకలపై కాంగ్రెస్ ధ్వజం ♦ అక్రమాలను అరికడుతున్నామని మంత్రి ఈటల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు సన్న బియ్యం సరఫరాలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తారు. శనివారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో వరి పండించిన రైతులకు రూ.1,800 చొప్పున కనీస మద్దతు ధరను అందించి, వారి వద్ద నుంచే మిల్లర్లు సన్నబియ్యం కోసం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, బ్రోకర్ల ద్వారా బిహార్నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి ఈటల జవాబిస్తూ.. బిహార్ నుంచి నల్లగొండకు బియ్యం దిగుమతి జరిగిన మాట వాస్తవమేనన్నారు. పౌరసరఫరాల శాఖకు గతేడాది రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు (రూ.1,800 కోట్లు) తగ్గించడంతో ఆయా వర్గాలకు బియ్యాన్ని ఎలా అందించగలుగుతారని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసరఫరాల శాఖలో అవకతవకలను అరికట్టడం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పేదలకు, వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.. కాగా, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో 13 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం రిజర్వాయరును ప్రతిపాదించిందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ల గురించి పట్టించుకోలేదని, నాడు జరిగిన తప్పులను సవరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలో వారం వ్యవధిలో ఐదుగురు మహిళలు మరణించిన మాట వాస్తవమేనని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ మరణాలపై విచారణ కోసం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించిందని, నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా తల్లుల మరణాల రేటు 164 ఉండగా, రాష్ట్రంలో 74 మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లో హుక్కా కేంద్రాలు నడుస్తున్న మాట వాస్తవమేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే జంటనగరాల్లో 548 కేసులు నమోదు చేశామని, హుక్కా పీల్చడంవల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. -
రేషన్ కోళ్ల ఫారాలకు వెళ్లింది నిజమే: మంత్రి
హైదరాబాద్: మా ప్రభుత్వం వచ్చిన తరువాత పౌర సంబంధాల శాఖ ప్రజా సంబంధాలు కలిగిన శాఖగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన శనివారం శాసన మండలిలో మాట్లాడుతూ..‘‘ లబ్ది దారులకు అందాల్సిన రేషన్ బియ్యం గతంలో కోళ్ల ఫారాలకు తరలిపోయిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అరికట్టాం. ప్రస్తుతం ప్రతి పాఠశాలలో సన్నబియ్యం పెడుతున్నాం. గతంలో ఊళ్లో ఒకటి, హైదరాబాద్‌లో ఒకటి రెండు రేషన్ కార్డులు ఉండేవి. మా హయంలో దాన్ని అరికట్టాం. అడిగిన వారందరికీ బియ్యం అందజేస్తున్నాం. ఈ పాస్ యంత్రాల ద్వారా రేషన్ అక్రమాలను అడ్డుకున్నాం. త్వరలోనే రాష్ట్రమంతటా ఈ పాస్ యంత్రాల ద్వారా రేషన్ విక్రయాలు జరుపుతాం. -
పల్లెకు పోదాం.. చలో
-
పల్లెకు పోదాం.. చలో
ప్రముఖ చిత్రకారిణి నైశిత కాసర్ల గీసిన చిత్రాల ప్రదర్శన ‘పల్లెకు పోదాం’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో 24న(ఈ రోజు) ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి 7గంటలకు మంత్రి ఈటల రాజేందర్ దీనిని ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 31 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. – సాక్షి, సిటీబ్యూరో -
'సాక్షి' ఎఫెక్ట్ : ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎస్సారెస్పీ వరద కాలువకు శనివారం నీటిని విడుదల చేశారు. చరిత్రలో తొలిసారి నిబంధనలకు విరుద్ధంగా వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో.. 25 వేల ఎకరాల పంటలకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆశలు, ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తీరు మారాలన్నారు. ప్రతిపక్షాలు సూచనలు చేయాలి కానీ ప్రతి పనికి అడ్డుపడటం సరికాదని హితవు పలికారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు నెలకు రూ. వెయ్యి పెన్షన్ అందజేయనున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై 'సాక్షి'లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. -
బీసీ ‘ఏ’ కేటగిరీలోకి ముదిరాజ్‌లు
కమిషన్ నివేదిక రాగానే మార్పు: మంత్రి ఈటల - ‘డీ’ కేటగిరీతో విద్య, ఉద్యోగాల్లో ముదిరాజ్‌లు నష్టపోయారు - ముదిరాజ్ సింహగర్జనలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆవేదన - ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో చేపల మార్కెట్లు: తలసాని సాక్షి, హైదరాబాద్: ‘బీసీ వర్గీకరణలో ముదిరాజ్‌లను ‘డీ’కేటగిరీలో చేర్చడంతో తీవ్రంగా నష్టపోయారు. విద్య, ఉద్యోగాలపరంగా కొన్ని తరాల ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయంపై 2004 నుంచి ఉద్యమం చేస్తున్నా. ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’కేటగిరీలో చేర్చాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని డిమాండ్ చేశా. 2008లో ఆయన కేటగిరీ ‘ఏ’లో చేర్చుతూ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఫలితం ఎన్నాళ్లో నిలవలేదు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ఉత్తర్వుల అమలు నిలిచిపోయింది’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ సింహగర్జన కార్యక్రమానికి ఈటలతో పాటు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘ముదిరాజ్‌లను బీసీ ఏ కేటగిరీలో చేర్చాలనే వాదనతో సుప్రీంకోర్టుకు వెళ్లా. కానీ కమిషన్ రిపోర్టు ఉంటే ఆమేరకు తీర్పు ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు. దీంతో ఎనిమిదేళ్లు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ సర్కారు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి అత్యుత్తమ రిపోర్టు ఇవ్వాలని సీఎం కేసీఆర్, కమిషన్‌ను ఆదేశించారు. చైర్మన్ బీఎస్ రాములు నేతృత్వంలోని కమిషన్ బీసీల స్థితిగతులపై అధ్యయనాన్ని ప్రారంభించింది. న్యాయస్థానంలో చిక్కులు తలెత్తకుండా రిపోర్టు ఇవ్వనుంది. కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ముదిరాజ్‌లను బీసీ ఏ కేటగిరీలోకి మారుస్తాం’అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం త్వరలో పరిష్కారమవుతుందని, ఉపాధి అవకాశాలపై ముదిరాజ్‌లు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్‌లో పైప్లైన్ల కోసం చేసిన తవ్వకాలు కాల్వలను తలపిస్తున్నాయని సీఎం వద్ద ఓ ఇంజనీరు వాపోయారు. దీంతో తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్... ఆ గుంతలకు కట్టలు కట్టి చెరువులు చేస్తాం. మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేస్తాం. అని సమాధానమిచ్చారు. ఆయన మాటల్ని అమలు చేసి ముదిరాజ్‌లకు మరింత ఉపాధి కల్పిస్తాం. సంఘాల్లో సభ్యత్వ నమోదును విస్తృతం చేసి సమన్వయంతో ముందుకు సాగాలి.’అని ఈటల పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేస్తున్నామని, చెరువుల కింద పంటతో పాటు చేపల పెంపకం కూడా ప్రభుత్వానికి ముఖ్య అంశమేనని చెప్పారు. పేదలు అధికం: కడియం దళితులు, గిరిజనుల తర్వాత అత్యధిక పేదలున్నది ముదిరాజ్ కులంలోనేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వారిని విద్యతో పాటు ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసి, ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ముదిరాజ్‌ల రిజర్వేషన్ల మార్పు తప్పకుండా జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, స్థానిక ప్రజాప్రతినిధులతో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేస్తే తక్షణమే నిధులు మంజూరు చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్య పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల్లో 45కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వేశామని, మరో ఆర్నెళ్లలో అవి ఐదువందల కోట్లు అవుతాయని చెప్పారు. వీటితో ముదిరాజ్‌లు జాగ్రత్తగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. 75శాతం రాయితీపై టాటా ఏస్ వాహనాల్ని నిరుద్యోగ యువతకు ఇస్తున్నాయని, అదేవిధంగా చేపల మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వాహనాల్ని సైతం రాయితీపై ఇస్తామని చెప్పారు. సీఎల్పీ ఉప నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చేందుకు ప్రభుత్వం బిల్లు పెడితే తాను మద్దతిస్తానని అన్నారు. ఈ సభలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌తోపాటు వివిధ జిల్లాలకు చెందిన ముదిరాజ్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, పెద్ద ఎత్తున ముదిరాజ్‌లు పాల్గొన్నారు. -
వరంగల్‌లో మంత్రి ఈటల పర్యటన
వరంగల్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి వరంగల్ రూరల్ జిల్లా పరకాల వరకు రూ.170 కోట్లతో నిర్మిస్తున్న నాలుగులైన్ల రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. మండలంలోని ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కమలాపూర్ పెద్ద చెరువు వద్ద, శనిగారం నడికుడ వాగులపై అదనపు వంతెనల నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ రవీందర్రావు, పలువురు అధికారులు ఉన్నారు. -
మంత్రి ఈటల ఇంటి ముట్టడి
వరంగల్ అర్బన్ : వరంగల్ జిల్లా కమలాపూర్‌లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు మంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
దేశానికే తెలంగాణ రోల్ మోడల్
-
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈటెల
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాద బాధితులను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. సంఘటన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. -
కట్టుదిట్టంగా పీడీఎస్ వ్యవస్థ
* పౌరసరఫరాల సమీక్షలో ఈటల * ‘స్థిరీకరణ’ ద్వారా కందిపప్పు ధరకు కళ్లెం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం, ఇతర సరకుల్లో అక్రమాల నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిందిగా అధికారులను పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. శాఖ పనితీరును అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. గ్రామీణ స్థాయిలో గోదాముల రూపురేఖలను మార్చడం, రవాణా వ్యవస్థలో జీపీఎస్ వ్యవస్థను అమల్లోకి తేవడం, సరుకుల అక్రమాలపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ షాపులు, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. కంది సరఫరా కన్నా కౌంటర్ల అమ్మకానికే సుముఖం: కందిపప్పును పీడీఎస్ ద్వారా రూ.50కే అందిస్తే బ్లాక్‌మార్కెటింగ్‌కు ఆస్కారం పెరుగుతుందని ఈటల అభిప్రాయపడ్డారు. కాబట్టి ధరల స్థిరీకరణ పథకం ద్వారా ప్రత్యేక కౌంటర్లలో నిర్ణీత ధరకు పప్పును అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
'అల్లరి చేస్తే ఊరుకోం... నొక్కిపడేస్తాం'
-ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం -చిన్నముల్కనూర్‌లో డబుల్బెడ్రూం కోసం పలువురి ఆందోళన చిగురుమామిడి (కరీంనగర్) : 'అభివృద్ధి పనులను అడ్డగించే నీచ సంస్కృతి పోతేనే మనం బాగుపడ్తం. అల్లరి చేస్తే ఊరుకోం.. నొక్కిపడేస్తం' అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతుండగా తమకు ఇండ్లు రాలేదంటూ పలువురు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి ఘాటుగా స్పందించారు. సభలు, సమావేశాలను అడ్డుకుని ఏమి సాధిస్తారన్నారు. అడ్డుకునే సంప్రదాయం ఎక్కడిది? ఇట్లైతే బాగుపడరు. బాగు చేసుకునే విషయంలో ఐక్యత లేకపోతే ఎట్లా?.. అంటూ మండిపడ్డారు. సీఎం దత్తత గ్రామంలో అల్లరిచేసి చెడగొట్టేవారిని కంట్రోల్ చేసేది గ్రామపెద్దలే. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టినా ఇట్ల అల్లరి చేస్తే ఇండ్లు కట్టలేం. మీరు మారాలి. అడ్డుకునే కుసంస్కారం తగదు.. అంటూ డబుల్ బెడ్రూం ఇండ్లు రాని బాధితులకు క్లాస్ ఇచ్చారు. చిన్నముల్కనూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుంటే.. మీరు సభలో గోల చేస్తే ఎట్ల.. అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామంలో ఎంతమంది అర్హులున్నా అందరికీ ఇండ్లు కట్టిస్తామని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో అన్నివర్గాల వారికి ఇండ్లు కట్టిస్తున్నామని, ఇక్కడ కూడా అందరికీ ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మూడు నెలల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
మంత్రి ఈటలను అడ్డుకున్న చల్లూరు గ్రామస్తులు
కరీంగనర్: వీణవంక మండలం చల్లూరులో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్ కలిసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. బాధితురాలు పోలీస్ శిక్షణకు హాజరైనట్టు ఉన్న ఆధారాలను గ్రామస్తులు మంత్రికి చూపించారు. అత్యాచారానికి గురైన బాధితురాలు శిక్షణకు హాజరు కాలేదని డీఎస్పీ ఎలా చెబుతారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఓ దళిత యువతి (20)పై ముగ్గరు కీచకులు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కానీ, కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మంత్రి ఈటలకు తమ గోడు చెప్పుకున్నారు. -
అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు
తెల్లకార్డులు ఉన్న ఆడబిడ్డలందరికీ కల్యాణలక్ష్మి మార్చి నుంచి వ్యవసాయానికి తొమ్మిదిగంటల విద్యుత్ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చందుర్తి : రాష్ట్రంలో అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని రుద్రంగిలో డబుల్ బెడ్రూం ఇళ్లు, మల్యాలలో విద్యుత్ సబ్‌ష్టేషన్ నిర్మాణాలకు ఆదివారం భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 400 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరుకాగా.. మొదటి విడతలో రుద్రంగికి 35 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. తెల్లకార్డు ఉన్న కుటుంబంలోని ఆడబిడ్డకు ఉగాది నుంచి కల్యాణలక్ష్మి వర్తింపజేయనున్నట్లు చెప్పారు. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని గోదావరి నదీ జలాలతో రానున్న రెండేళ్ల కాలంలో సస్యశ్యామలం చేస్తామన్నారు. వ్యవసాయూనికి పొద్దంతా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 28 లక్షలమందికి రూ.800 కోట్లు ఇస్తే.. తమ ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా 38 లక్షల మందికి రూ.5వేల కోట్లు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకుని భర్తలు వదిలేసిన వారికి, జోగినిలకు త్వరలో పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ ద్వారా ఏడాదిలోగా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తామన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మాట్లాడుతూ రుద్రంగికి రెండో విడతలో మరో 50, రానున్న మూడేళ్లలో 300 గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్, జెడ్పీటీసీ సభ్యులు అంబటి గంగాధర్, ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, ఎంపీడీవో నాగరాజు, తహశీల్దార్ రవీంద్రచారి, సర్పంచులు బైరి గంగరాజు, జలగం కిషన్‌రావు, దొంగరి భూమయ్య, ఎంపీటీసీలు చెలుకల చిన్నరాజవ్వ, మోతె జల, అల్లూరి పావని తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణకు అదనంగా బియ్యం కేటాయించండి'
హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రతీ నెలా అదనంగా 68,500 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు రాష్ట్ర ఆర్దిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన పాశ్వాన్‌తో మంత్రి ఈటల శనివారం ఓ హోటల్లో భేటీ అయ్యారు. అదనంగా ఇచ్చే బియ్యాన్ని కిలోకు రూ.8.43 చొప్పున ఇచ్చినా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాను 3432 మెట్రిక్ టన్నుల నుంచి 9018 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ఈటల విజ్ఞప్తి చేశారు. అలాగే హమాలీ చార్జీలను కూడా రూ.20 మేర పెంచాల్సిందిగా కోరారు. ముడి బియ్యానికి వసూలు చేసే కస్టమ్ మిల్లింగ్ ఛార్జీలను రూ.15 నుంచి రూ.20కు, బాయిల్డ్ రైస్‌కు రూ.25 నుంచి రూ.50కి పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సమర్పించిన పలు వినతులను గుర్తు చేస్తూ, సంబంధిత పత్రాలను కేంద్ర మంత్రి పాశ్వాన్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి హామీ ఇచ్చారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. -
మంత్రి ఈటెలను నిలదీసిన నాయకులు
కరీంనగర్ టౌన్ : గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కరీంనగర్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. గురువారం కరీంనగర్ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని 'గ్రామజ్యోతిలో మా హక్కులు ఏమిటి?' అని జిల్లాకు చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు నిలదీశారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో మా విధులు, నిధులు, హక్కులు ఏమిటో మంత్రి చెప్పాలని వారు కోరారు. సర్పంచ్‌లతో సమానంగా గ్రామజ్యోతి కార్యక్రమంలో హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
బోగస్ ఏరివేతతో 20 శాతం బియ్యం ఆదా
* వచ్చే నెల నుంచి పటిష్టంగా ‘ఆహారభద్రత’ * పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టం చేస్తోంది. బోగస్‌కార్డుల ఏరివేత, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లు, మిల్లర్లపై క్రిమినల్ కేసుల నమోదు, నిత్యావసర వస్తువుల రవాణాలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలతో ఇప్పటికే 15 నుంచి 20 శాతం మేర బియ్యాన్ని ఆదా చేయగలిగామని ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రానికి సుమారు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మిగులు లభిస్తోందన్నారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి కేంద్రంలో జిల్లాల జాయింట్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష జరిపారు. రేషన్ అక్రమాల నిరోధం, ఆహార భద్రతా చట్టం అమలు, ధాన్యం సేకరణ విధానం తదితరాలపై మంత్రి పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం ఈటల మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి ఆహారభద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. కొత్త కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు బియ్యం విషయమై కేంద్రానికి పదేపదే విన్నవిస్తున్నా స్పందనలేదని, దీంతో ఆ భారాన్ని రాష్ట్రమే భరిస్తుందన్నారు. ఈ నెలలోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఈపాస్, జీపీఎస్, బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అర్హులందరికీ దీపం పథకం సిలిండర్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. -
కోలుకుంటున్న ఈటల
సాక్షి, హైదరాబాద్: కారు బోల్తా ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఎక్సెరే, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు చేసిన వైద్యులు కాళ్లు, మెడ, చేతులు, వీపుపై చిన్నచిన్న గాట్లు తప్ప పెద్ద గాయాలేమీ లేవని నిర్ధారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ ఆదివారం ఆస్పత్రికి వచ్చి ఈటలను పరామర్శించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందులాల్, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కవిత, బాల్క సుమన్, వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, బాలరాజ్, కనకారెడ్డి, రసమయి బాలకిషన్, విద్యాసాగర్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, చెన్నమనేని రమేష్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, సీతారాములు, రామచంద్రరావు, భాను ప్రసాద్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఎండెల లక్ష్మినారాయణలతో పాటు వివిధ జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈటలను పరామర్శించిన వారిలో ఉన్నారు. -
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రి ఈటెల
కాజీపేట రూరల్ (వరంగల్) : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో ఉప్పల్-జమ్మికుంట మధ్య జరిగిన రైల్ రోకో కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం కాజీపేట రైల్వే కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వాదులపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రైల్వే మంత్రిని కలవనున్నట్లు తెలిపారు. కాగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా మాట్లాడి డీల్ చేసి తప్పించుకుంటున్నారని ఈటెల పేర్కొన్నారు. ఆడియో టేపులు బయటపెట్టక ముందు ఒకలా, బయటపెట్టిన తర్వాత మరోలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి వెంట ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్టీ చెల్లించాకే జీఎస్టీ
ఆర్థిక మంత్రులతో సదస్సులో తెలంగాణ మంత్రి ఈటల కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశంలో తెలంగాణకు స్పెషల్ స్టేటస్, అభివృద్ధి నిధులపై చర్చ కేంద్ర వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రులతో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు చెల్లించిన తర్వాతే వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ)ను అమలు చేయాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2016 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మొదట రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు ఇస్తే భరోసా కలుగుతుందని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో బుధవారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి తెలంగాణ తరఫున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ అమలును స్వాగతిస్తోందని, అయితే పొగాకు ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, ఎకై్సజ్, ప్యాడీ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి నిధులపై చర్చించారు. ఒక్క రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తోనూ ఈటల సమావేశమయ్యారు. అంతకుముందు ఢిల్లీ ఏపీభవన్ గురజాడ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు సీఎస్టీ బకాయి మొత్తం రూ.7,049 కోట్లు రావాల్సి ఉండగా, మొదటి విడతగా 2010-11 బకాయి రూ. 454.6 కోట్లు బుధవారం విడుదల చేసినట్టు ఈటల పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని మరో రెండు విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినా, కేంద్ర పథకాల నిధుల్లో కోత విధించడంతో తెలంగాణకు ఏటా రావాల్సిన ఆదాయానికి రూ. 2,389 కోట్లమేర గండి పడిందన్నారు. గతేడాదితో పోలిస్తే తెలంగాణకు ఈ ఏడాది కేంద్ర నుంచి వచ్చే నిధులు రూ. 4,622 కోట్లు తగ్గాయని పేర్కొన్నారు. పేదలను 1.91 కోట్లుగా గుర్తించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లెక్కల ప్రకారం తెలంగాణలో పేదల సంఖ్య 1.91 కోట్లుగా గుర్తించారని, తెలంగాణలో పేదల సంఖ్య వాస్తవానికి 2.86 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ కేంద్ర నుంచి బియ్యం కోటా ఇవ్వాలని ఈటెల కేంద్ర మంత్రి పాశ్వాన్‌ను కోరారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం కోటా పెంచాలని, చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపకంలో అక్రమాలకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే రూ. 225 కోట్లు కేటాయించాలని, హమాలీ చార్జీలను పెంచాలని, పాత లెవీ విధానాన్ని అమలు చేసేలా పునరాలోచించాలని కోరారు. కేంద్ర సాయం అందేవరకు రాష్ట్ర నిధులు వాడుకోండి అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర సాయం వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి రాధామోహ న్సింగ్ సూచించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులను ఆదుకోవాలంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రిని బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచామని, అప్పటి వరకు ఆ నిధులను వాడుకోవాలని ఆయన సూచించారు. త్వరలో బిల్లు తెస్తాం: జైట్లీ జీఎస్టీపై బుధవారం రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ...త్వరలోనే పార్లమెం టులో బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చిందని, అందరికీ లాభదాయకమైన ఏకీకృత జీఎస్టీని ప్రవేశపెట్టడానికి వీలుగా రెండు, మూడు రోజుల్లో రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జీఎస్టీ మూలంగా తమకు వాటిల్లే ఆదాయ నష్టానికి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పరిహారమివ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరాయి. మహారాష్ట్ర, గుజ రాత్ లాంటి రాష్ట్రాలు జీఎస్టీపై అదనంగా 2 శాతం పన్ను వేసుకునేందుకు రాష్ట్రాలకు వీలుండాలని కోరాయి. ప్రస్తుత జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్రాలకు ఒక శాతం మాత్రమే అదనంగా పన్ను వేసుకునే అధికారం ఉంది. -
'రైతు ఆత్మహత్యల పరిహారం పెంచలేం'
మండలిలో ఆర్థికమంత్రి ఈటెల స్పష్టీకరణ తెల్లరేషన్ కార్డులు తిరోగమనానికి సూచిక ప్రజలపై పన్నులు వేయబోం జిల్లాలకు ఇన్చార్జి మంత్రిని నియమించే యోచన ప్రాణహిత-చేవెళ్లపై సభలో కాసేపు గందరగోళం సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని పెంచబోమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు. గతంలో ఉన్న పరిహారాన్నే కొనసాగిస్తామని చెప్పారు. శాసనమండలిలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ... ఆత్మహత్యలు ఆపడానికి కృషిచేస్తామన్నారు. తెల్లరేషన్ కార్డులు అభివృద్ధికి సూచిక కాదంటూ వాటిని తిరోగమనానికి సూచికగా అభివర్ణించారు. సంక్షేమంపై ఆధారపడకుండా సొంత కాళ్లపై ఆధారపడేలా చేయడమే అభివృద్ధి అని ఈటెల అన్నారు. పన్నులు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. భర్తలు వదిలిపెట్టిన వారికి, జోగినీలకు, వికలాంగ సర్టిఫికెట్ లేనివారికి ఎలా పెన్షన్ ఇవ్వాలో ఆలోచిస్తున్నామన్నారు. పెన్షన్లు పెంచామని... సన్నబియ్యం ఇస్తున్నామని ఇలా ప్రభుత్వ కార్యక్రమాలపై ఈటెల ఊదరగొడుతుండగా... ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ జోక్యం చేసుకొని వనరులు పెరిగినందున చేస్తున్నారన్నారు. 1994కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను... 2004 తర్వాత నెరవేర్చినట్లు చెప్పారు. దీనికి ఈటెల స్పందిస్తూ... రాష్ట్రం ఏర్పడిన సమయంలో తనకు, కేసీఆర్‌కు మధ్య జరిగిన సంభాషణను ప్రస్తావించారు. ‘రాష్ట్ర విభజన జరిగింది. ఇంకా ఎన్నికలు కాలేదు. గెలుస్తామా? లేదా? అన్న సంశయం ఉంది. మెజారిటీ స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. లేకుంటే వద్దు అని కేసీఆర్ అన్నారు. ఉద్యమ నేత కంటే ప్రభుత్వ నేతగా, బుగ్గ కార్లలో తిరగడం గొప్పగా అనుకోవడంలేదు. ఉద్యమ కాలంలో కంటే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి’ అని ఈటెల పేర్కొన్నారు. అన్నీ చేస్తామని అనడంలేదనీ... సత్యసాయి బాబాలా ఏదేదో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడంలేదన్నారు. జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించే ఆలోచన ఉందన్నారు. టీడీపీ సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మిగతా పార్టీలను బతకనిచ్చేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని తమ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలపై ఎలాంటి వివక్ష చూపడంలేదన్నారు. గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లే వారు అక్కడ మోసపోతే ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ కోరగా, దీనిపై కేరళ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఇచ్చే ఆలోచన ఉందని ఈటెల చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ చేస్తాం ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి పూర్తిచేస్తామన్నారు. కేంద్రం నిధులు ఇస్తుందన్న నమ్మకంలేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే పరిస్థితి లేదని ఈటెల అన్నారు. ఈ సందర్భంగా కాసేపు గందరగోళం నెలకొంది. పర్యావరణ క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పట్టిసీమను ఎవరి అనుమతి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రస్తావించారు. సింగరేణిని విస్తరించే ఆలోచన ఉందని ఈటెల అన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే ఉద్దేశం లేదన్నారు. ఎంఐఎం సభ్యుడు రజ్వి, డాక్టర్ కె.నాగేశ్వర్, టీడీపీ సభ్యుడు నర్సారెడ్డి, రంగారెడ్డి, ప్రభాకర్ మాట్లాడారు. ముంపు మండలాలపై ఏపీకి జ్ఞానోదయం కావాలి ఆంధ్రప్రదేశ్‌లో 7 మండలాలను విలీనం చేసిన విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మానవతాకోణంలో జ్ఞానోదయం కావాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచించి, తమకు సంబంధంలేని ఏడు మండలాలపై నిర్ణయం తీసుకోవాల న్నారు. పోలవరం ప్రాజెక్టు 7ముంపు మండలాలకు విద్యుత్, సంక్షేమ కార్యక్రమాల వర్తింపుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులి చ్చారు. ఇప్పటికే ఈ మండలాల విలీనంపై అసెంబ్లీ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని తెలిపారు. ఆ ఏడు మండలాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వమే విద్యుత్, సంక్షేమ పథకాలు ఇతరత్రా అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఈటెల చెప్పారు. -
బాండ్ల రూపంలోనే పీఆర్సీ బకాయిలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్మెంట్లో భాగంగా 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవ రి 28 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలను బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఐదేళ్ల తరువాత వాటిని వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈటెల సమాధానమిచ్చారు. పెనషనర్లకు ప్రయోజనాలు కల్పించేందుకు 2013 జులై 1 నుంచి 2014 జూన్ 1 వరకు నోషనల్‌గా 10వ పీఆర్సీని అమలు చేస్తామని వివరించారు. సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), హెల్త్ కార్డుల అమలుపై స్పష్టత ఇవ్వాలని గణేష్ గుప్తా (టీఆర్ఎస్) మంత్రిని కోరగా పీఆర్సీ జీఓలు ఎప్పుడు జారీ చేస్తారని, ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారని మోజాంఖాన్ (మజ్లిస్) ప్రశ్నించారు. -
నేనూ హాస్టల్లో ఉండే చదువుకున్న..
⇒ చాలామంది మంత్రులు వసతిగృహాల్లో చదువుకుని వచ్చినవారే.. ⇒ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వికారాబాద్: ‘నేనూ హాస్టల్లో ఉండి చదువుకున్న వాడినే.. ఉడికీ ఉడకని అన్నం భోంచేసిన వాడినే..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేబినెట్ మంత్రుల్లో చాలామంది వసతిగృహాల్లో ఉండి చదువుకుని వచ్చిన వారేనన్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు, వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం జరిగిన కళాశాల 14 వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. వికారాబాద్ హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్నప్పటికీ అన్నిరంగాల్లో వె నకబడి ఉందన్నారు. భూగర్భజలాలు ఎక్కడ చూసినా కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చదివే విద్యార్థులు మంచి జియలజిస్టులుగా తయారు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేథావులుగా తయారై, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. మార్కులు విద్యలో ప్రామాణికమని అనుకోవడం లేదన్నారు. లక్ష్యం లేకుండా ఏ గమ్యస్థానం చేరుకోలేమన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివి సివిల్స్ రాసి, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనుగుణంగా విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకొని సివిల్స్ రాసి ఐపీఎస్, ఐఏఎస్ అయినవారు గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. అనంతరం రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో చె ల్లించాల్సిన పెండింగ్ ఫీజ్ రియింబర్స్‌మెంట్ నిధులను తమ ప్రభుత్వం ఇటీవలే రూ.800 కోట్లు విడుదల చేసి, విద్యార్థులను ఆదుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులు చదివింది ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలన్నారు. చదివు లేకుంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే వారే కాదన్నారు. కార్పొరేట్ కళాశాల యజామాన్యాలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. చదువుతోపాటు ఆటపాటలు, విశ్రాంతి కల్పించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఎంత చదివినా తక్కువేనన్నారు. భవిష్యత్‌లో నిరుద్యోగులకు అనేక ఉపాధి అవకాశాలురానున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, ప్రజాప్రతినిధులు ఎంపీపీ సామల బాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు ముత్తార్ షరీఫ్, నాయకులు ఎల్లారెడ్డి, దేవకీదేవి, కడియాల శేఖర్, విఠల్, ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, కళాశాల డైరక్టర్ సత్యనారాయణరెడ్డి, నాయకులు రాంరెడ్డి, బి.కృష్ణయ్య, లక్ష్మారెడ్డి, రాంచంద్రరెడ్డి, పి వెంకటయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కుస్తీ ఘనత మనదే
కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రపంచానికి కుస్తీని నేర్పిన ఘనత మన దేశానికే దక్కిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఇండియన్ స్టైల్ రె జ్లింగ్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల మల్లయుద్ధ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. 2005లో అప్పటి ప్రభుత్వం కరీంనగర్, కడప జిల్లాల్లో క్రీడాపాఠశాలు మంజూరు చేసిందన్నారు. కడప స్పోర్ట్స్ స్కూల్‌కు అటానమస్ హోదాను కల్పించి, కరీంనగర్ స్కూల్‌ను నిర్లక్ష్యం చేసింద ఉందని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన వివక్షకు ఇది నిదర్శనమని చెప్పారు. నెలరోజుల్లో కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేసి రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర మల్లయుద్ధం సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ మల్లయుద్ధం క్రీడకు నేడు రాష్ట్రంలో ఆదరణ కురైవందని, ప్రభుత్వం చేయుతనివ్వాలని కోరారు. త్వరలో హైదరాబాద్‌లో జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధానకార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, డీఎస్డీవో సత్యవాణి, జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యాక్షుడు కరీం, జిల్లా మల్లయుద్ధం సంఘం బాధ్యులు అజ్మీర రాములు, శ్రీకాంత్, భిక్షపతి, వెంకన్న, కోచ్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఎంపిక పోటీలు ఈ పోటీలకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు కర్ణాటక రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్ర పురుషుల జట్టు 55కేజీ విభాగంలో అబుబుద్దీన్ ఖాలియా, 61 కేజీలు ఇజార్ అలీఖాన్, 67 కేజీలు బి.మోహన్‌గాంధీ, 75 కేజీలు జి.నితీష్‌కుమార్ యాదవ్, 85కేజీలు అబ్దుల్హ్రీం, షేక్ మహ్మద్ ఇమ్రోజ్, ఓపెన్ కేటగిరీలో మహ్మద్ ఆక్రం ఎంపికయ్యారు. వీరంతా హైదరాబాద్‌కు చెందినవారే. రాష్ట్ర మహిళల జట్టు 50 కేజీ విభాగంలో శ్యామల, 56కేజీలు శిరీష, 63కేజీల విభాగంలో మౌనిక (కరీంనగర్),కాజల్ (హైదరాబాద్) ఎంపికయ్యారు. -
ఆసుపత్రుల రూపరేఖలు మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటెల రాజేందర్ గురువారం కలెక్టరేట్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణ చర్యలపై వైద్య, విద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతుప్రసాద్కుమారి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు, స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటెల అడిగి తెలుసుకోవడంతోపాటు అధికారులకు పలు ఆదేశాలు, సూచనలిచ్చారు. కలెక్టర్ సైతం పీహెచ్‌సీల పనితీరు, మౌలిక సదుపాయల కల్పనకు అవసరమైన చర్యలతోపాటు జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్మూలన, ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అధికారులను ఉద్ధేశించి మంత్రి ఏమన్నారంటే.. * స్వైన్‌ఫ్లూపై వ్యాధి నిర్మూలన, అవగాహనపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించండి. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతోపాటు రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి. * ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్మూలనకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచండి. బాధితులకు ప్రత్యేక గదులను కేటాయించండి. డాక్టర్లు సెలవు పెట్టకుండా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోండి. టైంపాస్‌కు వచ్చే డాక్టర్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేనిపక్షంలో మీరే వారిని గుర్తించి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోండి. * ప్రతి ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు, నైట్వాచ్మెన్లను నియమించాలి. బోరు మొదలు, కరెంట్, టాయిలెట్, బాత్రూంసహా కనీస సదుపాయాలు కల్పించండి. డ్రైనేజీకి, చెత్తకుప్పలకు, పందులకు, మందుబాబులకు నిలయంగా మార్చకండి. బిల్డింగ్ మరమ్మతులు, అదనపు బ్లాక్‌లు నిర్మించడంతోపాటు ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌కు అవసరమైన ప్రతిపాదనలు పంపండి. * ప్రస్తుత అవసరాలకు తగినట్లు పీహెచ్‌సీల డిజైన్లను రూపొందించండి. ఆసుపత్రిల్లో అవసరమైన యంత్రాలు, భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయల కల్పనకు డబ్బు కొదవలేనేలేదు. ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయిస్తా. * అన్ని సదుపాయాలున్నా డాక్టర్లు, సిబ్బంది పనితీరు సరిగా ఉండటం లేదు. గతంలో మాదిరిగా రొటీన్‌గా పనిచేస్తే లాభం లేదు. ఆసుపత్రుల్లోనే ఉండాలి. అక్కడే తింటూ రోగులతోపాటే ఉండాలి. గతంలో కంటే సర్కారీ ఆసుపత్రుల్లో మార్పు వచ్చిందనే నమ్మకం ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మీదే. * ఆసుపత్రుల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలకు ఆసుపత్రి అభివృద్ధి నిధులను వాడుకోండి. ఈ విషయంలో రూల్స్ ప్రకారం కాకుండా ప్రజల అత్యవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి. * ఆసుపత్రుల అభివృద్ధి, సదుపాయల కల్పనకు ఎమ్మెల్యేల, ఎంపీల నిధుల నుంచి రూ.5 కోట్లు విడుదల చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్థాయిలోనే జీవోలిచ్చేలా చర్యలు తీసుకుంటాం. * కాంట్రాక్టు కార్మికులకు ఆరేడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఎలా? ప్రతినెలా వేతనాలిచ్చేలా ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చినా ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్లకు నెలనెలా వేతనాలు ఇవ్వాల్సిందే. * కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ సైతం జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, కావాల్సిన పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు వంటి అంశాలపై వైద్యాధికారులను అడిగి నోట్ చేసుకున్నారు. స్వైన్‌ఫ్లూపై రూపొందించిన పోస్టర్లను అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాల్లోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో అంటించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై ఈనెల 28న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. * పాఠశాలలు ప్రారంభమైన వెంటనే స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిరోజు ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు వివరించాలని జిల్లా డీఈఓ లింగయ్యను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లన్నింటిలోనూ ఈ వ్యాధిపై విద్యార్ధులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. * జిల్లా వైద్యాధికారి డాక్టర్ అలీం మాట్లాడూతూ ఇకపై ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రిసెప్షన్ కౌంట ర్ను ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. మీరు మారరా? * ల్యాబ్‌టెక్నీషియన్ లేడని * సిటీస్కాన్‌ను పక్కనపడేస్తారా? * డీసీహెచ్ఎస్ అధికారిపై ఈటెల ఆగ్రహం * జమ్మికుంట ఆసుపత్రి నిర్వహణపైనా అసంతృప్తి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.25 లక్షలతో సిటీస్కాన్‌ను ఏర్పాటు చేసినా ల్యాబ్‌టెక్నీషియన్ లేడనే కారణంతో పక్కనపెట్టడంపై మంత్రి ఈటెల రాజేందర్ డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మీకు ల్యాబ్టెక్నీషియనే దొరకకపోతే నాకు చెప్పండి. నేను ఒక్కరిని కాదు, ఎంతమందినైనా పంపిస్తా అంటూ మండిపడ్డారు. ల్యాబ్టెక్నీషియన్ను నియమించుకోవాలని మూడు నెలల క్రితమే చెప్పినా ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించగా.. డాక్టర్ భోజా పొంతనలేని సమాధానాలిచ్చారు. దీంతో మళ్లీ ఈటెల స్పందిస్తూ ఁఅసలు మీతో వచ్చిన తిప్పలే ఇవి? ఇన్ని చెబుతున్నా మీరు మారరా? అందుకేనేమో తెలంగాణలో అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా ఉన్న కరీంనగర్ జిల్లా డెంగీలోనూ ముందుంది* అంటూ అసహనం వ్యక్తం చేశారు. యంత్రాలు ఎక్కడెక్కడ పనిచేయడం లేదు? కారణాలేమిటి? అనే వివరాలు వెంటనే పంపడంతోపాటు అవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఎంహెచ్లను ఆదేశించారు. జమ్మికుంట ఆసుపత్రిలో అన్ని సదుపాయాలున్నాయంటూ స్థానిక వైద్యాధికారి బదులివ్వగా జిల్లా ప్రధాన ఆసుపత్రి తరువాత ఎక్కువమంది రోగులొచ్చే ఆసుపత్రి అది. ఇప్పటికి 10 సార్లు రివ్యూ చేసినా ఎందుకో సక్రమంగా నడవడం లేదు. చాలా బాధాకరం. ఫిబ్రవరి నాటికి జమ్మికుంట ఆసుపత్రి రూపురేఖలు మారాలి అని ఆదేశించారు. వెంటనే కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే జమ్మికుంట ఆసుపత్రిని సందర్శించడంతోపాటు అవసరమైన సదుపాయాల కల్పనకు డబ్బులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. -
టేకాఫ్ దశలోనే ఉన్నాం: ఈటెల
-
టేకాఫ్ దశలోనే ఉన్నాం: ఈటెల
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్నవి పసలేని ఆరోపణలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో బుధవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన వేగాన్ని ఓర్వలేక, రాజకీయ మనుగడ కోసం తమ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. తమ సర్కారు ప్రస్తుతం టేకాఫ్ దశలోనే ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింతగా ప్రజా విశ్వాసం పొందుతామని ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తమని, రానున్న రోజుల్లో అన్నింటినీ అధిగమిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. తాము చెబుతున్న ప్రతి పనినీ చేసి చూపిస్తామన్నారు. ప్రస్తుత పరిణామాలు బేరీజు వేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్తాయి బడ్జెట్ ను రూపొందిస్తామన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
హుజూరాబాద్‌టౌన్/కమలాపూర్ : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ భోజన పథకం, చెల్పూర్లో ఆహార భద్రత పథకం, హుజూరాబాద్‌లోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో, కమలాపూర్‌లోని గురుకుల, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం పథకాలను ఆయన లాంఛనంగా ప్రాంభించారు. స్వయంగా బియ్యం తూకం వేసి రేషన్ లబ్దిదారులకు అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు అన్నం వడ్డించారు. కమలాపూర్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. స్రంక్షేమ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టడమే కాదు.. వారిని జైలుకు పంపేదాక వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తాము గతం కన్నా ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇస్తున్నా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. అర్హులైందరికీ పింఛన్ మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఇస్తామన్నారు. భర్తలు వదిలేసిన వారు, జోగినిలకు కూడా పింఛన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో జిల్లాలో 3.90 లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం 4 లక్షలు దాటాయన్నారు. ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రూ.1.50 లక్షల ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 9.71 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులుండగా, ప్రస్తుతం మరో 50 వేలకు పైగా ఆహారభదత్ర కార్డులు పెరిగాయన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఒక పూట సంపూర్ణ భోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో రూ.220 కోట్లతో 17 అంగన్వాడీ సెంటర్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. నాణ్యమైన సరుకులు వస్తున్నాయా, లేదా అని అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఇస్తున్న 16 గుడ్లకు బదులు ఇక నుంచి 30 గుడ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏడు నెలల పిల్లలకు నెలకు 16 గుడ్లు, ఆరేళ్ల లోపు పిల్లలకు నెలకు 30 గుడ్లు అందిస్తున్నామన్నారు. గుడ్లపై ఉత్పత్తి తేదీ, ఎక్స్పైరీ తేదీ ముద్రించి 45 గ్రాముల నుంచి 53 గ్రాముల బరువుండే గుడ్లు సరఫరా చేస్తామన్నారు. పిల్లలు, పేద విద్యార్థులంతా తెలంగాణ రాష్ట్ర ఆస్తులని, వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టాలని, ముక్కిన బియ్యం, దొడ్డు బియ్యం స్థానంలో సూపర్‌ఫైన్ బీపీటీ రకం సన్నబియ్యం సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్నభోజన పథకానికి సరఫరా చేస్తున్నామన్నారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు రెట్టింపు చేశామని, ఆడపిల్లలకు రూ.125కు పెంచామన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పెద్దపాపయ్యపల్లిలో చిన్నారుల ఆటపాటలను మంత్రి తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్డీవో చం ద్రశేఖర్, ఆర్జేడీ శైలజ, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, ఏపీడీ మోహన్‌రెడ్డి, డీఎస్వో చంద్రప్రకాశ్, గురుకు ల పాఠశాలల కార్యదర్శి మల్లయ్యతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
కొత్త భోజనం
ఆహార భద్రత నేటి నుంచి రేషన్ పంపిణీ 9,68,784 లబ్ధిదారుల గుర్తింపు ముకరంపుర : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆహారభద్రత పథకం నేటినుంచి అమల్లోకి వస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ గురువారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉన్నా పరిమితి లేకుండా బియ్యాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ మండలం చెల్పూర్లో లాంఛనంగా ప్రారంభిస్తారు. జిల్లాలో 12,35,810 కుటుంబాలుండగా, ఆహారభద్రత కార్డుల కోసం 11,57,053 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతం నుంచి 9,34,934, పట్టణ ప్రాంతం నుంచి 2,22,119 అర్జీలు అందాయి. అధికారులు ఇల్లిల్లు తిరిగి, విచారణ చేసి జిల్లాలో 9,68,784 కుటుంబాలను ఆహారభద్రతకు అర్హులుగా తేల్చారు. ఈ కార్డులకు సంబంధించి 30,15,909 యూనిట్లకు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. జిల్లాలో 64,234 మందిని అంత్యోదయకు అర్హులుగా గుర్తించగా, 1,60,585 యూనిట్లకు 35 కిలోల చొప్పున బియ్యం అందిస్తారు. ఇప్పటికే జిల్లాలోని 2080 రేషన్‌డీలర్లు పెరిగిన కోటాకు అనుగుణంగా డీడీలు చెల్లించారు. ఈ మేరకు సంబంధిత రేషన్ దుకాణాలకు బియ్యంతో పాటు ఇతర సరుకులను సరఫరా చేస్తున్నారు. గతంలో జిల్లాలో 11,88,974 రేషన్‌కార్డులు ఉండేవి. ఇందులో గులాబీ కార్డులు, 99,806 కాగా, 10,89,168 తెల్లకార్డులు. ఇంతకుముందు తెల్లకార్డు గల కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున గరిష్టంగా 20 కిలోలు ఇచ్చేవారు. ఏఏవై కార్డున్న కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డున్న కుటుంబానికి 10 కిలోల చొప్పున అందజేశారు. జిల్లాలో ప్రతినెల 16,159,528 టన్నులు పంపిణీ జరిగేది. ఆహారభద్రత పథకంలో కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా అందజేస్తారు. దీంతో బియ్యం కోటా 20 లక్షల టన్నులకు పెరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అర్హుల జాబితా ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తారు. ఆహారభద్రత కార్డులు వచ్చే నెలలో జారీ చేసే అవకాశముంది. సన్నబియ్యం భోజనం జిల్లాలో నేటినుంచి అమలు 3.20 లక్షల మందికి {పయోజనం కరీంనగర్ ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిం చే మధ్యాహ్నభోజనంతో పా టు సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గురువారం నుంచి సన్నబియ్యం భో జనం వడ్డించనున్నారు. రాష్ట్ర ఆర్థి క, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ క మలాపూర్ మండలం వసతిగృహంలో ప్రా రంభిస్తారు. జిల్లాలో 309 వసతిగృహాలు, 3071 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు కేజీబీవీ, మోడల్‌స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల విద్యార్థులకు ఈ భోజనం అందనుంది. మొత్తం 3.20 లక్షల మంది విద్యార్థులకు నెలకు 1429 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారు. బియ్యాన్ని డిసెంబర్ 30లోగా అన్ని వసతిగృహాలకు నేరుగా పంపించారు. పాఠశాలలకు సంబంధిత చౌకధరల దుకాణాల నుంచి సరఫరా చేశారు. జిల్లాలోని 15 ఎంఎల్ఎస్ పాయింట్లు (మండల్ లెవల్ స్టాక్) గోదాముల నుంచి బియ్యం పంపి ణీ చేశారు. ఈ పథకం అమలుతో జిల్లాలో ప్ర తినెలా రూ.4.8 కోట్లు, సంవత్సరానికి రూ. 50 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతుందని అధికారులు లెక్క తేల్చారు. జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో వంద హాస్టళ్లు ఉండగా, వీటిలో 6317 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత నివేదికల ప్రకారం వీరు నెలకు 586 క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నారు. కళాశాలల హాస్టళ్లు 13 ఉండగా 6736 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 905 క్వింటాళ్ల బియ్యం అవసరముంటాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 25 వసతిగృహాల్లో 2651 మంది, తొమ్మిది ఆశ్రమ పాఠశాలల్లో 2162 మంది విద్యార్థులు ఉండగా 608 క్విం టాళ్ల బియ్యం వినియోగిస్తున్నారు. బీసీ సంక్షేమ పరిధిలో 52 వసతిగృహాల్లో 3954 మంది విద్యార్థులుండగా 325 క్వింటాళ్లు, 26 కాలేజ్ హాస్టళ్లలో 1725 మంది విద్యార్థులుండగా 230 క్వింటాళ్లు, 52 కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో 7377 మంది విద్యార్థులకు 729 క్వింటాళ్ల బియ్యం అవసరముంటాయి. సన్నబియ్యం రూ.25 కిలో చొప్పున కొనుగోలు చేసి ఇతర ఖర్చులు కలుపుకుని కిలోకు రూ.36 ప్రభుత్వం భరించనుంది. వన్ ఫుల్ మీల్ మంకమ్మతోట : జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఒక పూట పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం ‘సంపూర్ణ భోజనం’ అందించనున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో ఫుల్ మీల్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 2012-13 నుంచి మంథని, మహదేవపూర్, మల్యాలలో ఐసీడీఎస్‌ల పరిధిలో, 2013-14 నుంచి గంగాధర, హుస్నాబాద్, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకం కింద ఒక పూట భోజనం అందిస్తున్నారు. ఈ పథకాన్నే సంపూర్ణ భోజనంగా జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్నారు. దీనికింద ఒక్కొక్కరికి రూ.15 ఖర్చవుతుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఐసీడీఎస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆహార వస్తువులు, గ్యాస్‌స్టౌవ్‌లు సరఫరా చేశారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలో 3573 అంగన్వాడీ కేంద్రాలు, 145 మిని అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో గర్భిణులు 31,577మంది, బాలింతలు 31,510, పిల్లలు 1,69,218 మంది.. మొత్తం 2,32,305 మంది ఉన్నారు. వీరందరికి ఒక పూట సంపూర్ణ భోజనం అందించనన్నారు. పప్పులు, ఆకుకూరలు, కాయకూరలు, గుడ్లు, పాలు ఇస్తారు. నెలలో ఆదివారాలు మినహా అన్ని రోజులు సంపూర్ణ భోజనం విడ్డిసారు. ఆదివారం సెలవుదినం అయినందున ఆ రోజు ఇచ్చే ఆహారంలోని గుడ్లను వారానికోసారి కోడిగుడ్డు కూర, వారంలో రెండుసార్లు పెరుగు భోజనంలో అందిస్తారు. ప్రతిరోజు పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.7.20 ఖర్చుచేయనుంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం 11 మందితో కమిటీలను వేసింది. ఒక్కో కేంద్రానికి సర్పంచ్ లేదా వార్డు మెంబర్ చైర్‌పర్సన్‌గా ఉంటారు, స్థానిక ఆశా వర్కర్, ఇద్దరు తల్లులు, ఒకరు సైన్స్ టీచర్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, కేంద్రానికి వచ్చే చిన్నారి తల్లిదండ్రులు, ఇద్దరు గ్రామ అధికారులు, అంగన్వాడీ టీచర్ సభ్యులుగా ఉంటారు. పథకం అమలు తీరుపై వారానికి ఒక రోజు సమీక్షిస్తారు. -
అభివృద్ధి చెందాల్సింది పాలమూరే
సాక్షి, మహబూబ్‌నగర్:తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటగా అభివృద్ధి చెందాల్సిన జిల్లా మహబూబ్‌నగర్ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రేషన్‌కార్డులు, సంక్షేమ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనానికి జనవరి 1నుంచి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరాపై జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అథితిగా మంత్రి రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా అనేక వివక్షలకు గురైందన్నారు. జిల్లా గుండా కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా పంటలకు నీళ్లు పారించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పల్లెల్లో పల్లేర్లు మొలిచాయని, ఇక ముందు పచ్చగా మారేలా చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. సమగ్రకుటుంబ సర్వేపై దుష్ర్పచారంచేశారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రంలో కోటి ఆశలతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం కోసమే సర్వే చేసిందన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు పోతాయంటూ కొందరు విపక్షనేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో 9,95,000 కార్డులు ఉంటే ప్రస్తుతం 10,16,961 ఇస్తున్నామన్నారు. కార్డులోని యూనిట్ల సంఖ్య కూడా ఆరు లక్షల వరకు పెరిగిందని వివరించారు. జిల్లాలో సంక్షేమహాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్నభోజనానికి ప్రతినెల 18,675 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. పాలమూరుకే పెద్దపీట పారిశ్రామికంగా వెనుకబడిన పాలమూరు పెద్దపీట వేస్తామని పరిశ్రమల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి ఖనిజ, అటవీ, సారవంతమైన భూములున్నాయని వాటిని ఉపయోగించుకునే అవకాశం రాలేకపోయిందన్నారు. ఇక నుంచి జిల్లాకు పెద్దపీట వేసి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంబంధించి జిల్లాకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ సెక్రటరీ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో అతి తక్కువ అక్ష్యరాస్యత ఉండడం వల్లే ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ ఫలాలు ప్రకటించినా అభివృద్ధి చెందడం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో అధికారులు తీవ్రంగా శ్రమించి రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లాలని సూచించారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నందున అక్రమాలకు తావివ్వకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తే బాగుంటుందన్నారు. ఆహారభద్రత హక్కు చట్టం కింద గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని, దాని ద్వారా ప్రతి ఒక్కరికీ ఐదు కిలోలు అందనుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటికి అదనంగా ఒక కేజీ చేర్చిందని చెప్పుకొచ్చారు. 2013లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన చట్టాన్నే రాష్ట్రం అమలులో పెడుతోందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలతో గందరగోళం... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కిందట ఆమోదించిన చట్టాన్ని మీరెందుకు అమలు చేయలేదంటూ ఎదురుదాడి చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అట్టడుగు వర్గాలకు అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూటు కాలికింద తొక్కిపెట్టారని నిప్పులు చెరిగారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో వేదిక మీదున్న మంత్రులు జూపల్లి, ఈటెల, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. జిల్లాకే అధిక ప్రాధాన్యం: ఎంపీ జితేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమైన పదవులన్నింటినీ కూడా జిల్లాకు ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లాలో లిప్ట్ ఇరిగేషన్ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాకే వలసలు రానున్నాయన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి కూడా ప్రసంగించారు. ఈ సమావేశంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలలో మంత్రి ఈటెల
-
విద్యుత్ సమస్యలు తీరనున్నాయి..
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మర్పల్లి: రాష్ట్రంలో నెలకొన్న విద్యూత్ సమస్యలు మరికొంత కాలంలో తీరనున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షడు విఠల్ తండ్రి మాణయ్య (80) బుధవారం అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం తెలసుకున్న మంత్రి రాజేందర్ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఉపాధ్యక్షుడు పల్లె రవితో కలిసి ఆదివారం బిల్కల్ గ్రామంలో విఠల్‌ను పరామర్శించారు. మాణయ్య మృతి విషయృమె విఠల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కోతలపై స్థానిక నాయకులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాదానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గతంలో కన్నా ఎక్కువగా ఉందన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనవిధానాలే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు కారణ మన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్యలను తీర్చేందకు పొరుగు రాష్ట్రాల నుండి కొనుగోలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైస్‌ఎంపీపీ అంజయ్య, టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్, స్థానిక సర్పంచ్ పడుమటి అనుసూజ కుమారుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విఠల్‌ను పరామర్శించిన దామోదర్ రాజనర్సింహ్మ... విఠల్ తండ్రి మాణయ్య (80) మృతి విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మ బిల్కల్ గ్రామాన్ని సందర్శించి విఠల్‌ను పరమార్శించారు. ఆయన వెంట ఆ గ్రామ సర్పంచ్ పడుమటి అనుసూజ కుమారుడు శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు. -
పేదలకందిన భూమి
►మంత్రి ఈటెల చేతులమీదుగా 307 ఎకరాలకు హక్కులు ►రూ.8.42 కోట్లతో కొనుగోలు ►122 మంది దళిత మహిళలకు పట్టాలు కరీంనగర్ :నిరుపేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ మొదటివిడత కార్యక్రమం పంద్రాగస్టు వేదికగా ప్రారంభమైంది. ఎన్నో అవాంతరాలు, అనేక అభ్యంతరాలు, సవాలక్ష నిబంధనల మధ్య అనుకున్న సమయానికి వీలైనన్ని గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. నెలరోజులకు పైగా శ్రమించిన అధికారయంత్రాంగం చేతులెత్తేస్తుందని భావించినా.. చివరకు ఒకట్రెండు రోజుల్లోనే ప్రక్రియకు తుదిరూపం తీసుకురావడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతులమీదుగా 122 మందిదళితమహిళలకు 302 ఎకరాలకు సంబంధించిన పట్టాలు అందించారు. ముకరంపుర : నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాలు కేటాయించాలని సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ఆది నుంచీ అవాం తరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఐదేళ్ల నుంచి సాగులో ఉన్న పట్టా భూములను కొందామ న్నా.. ‘బేరం’ కుదరకపోవడం, ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులకు సరిపడా భూములు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకుని లబ్ధిదారులను గుర్తించాలని భావిం చిన ప్రభుత్వం.. కొద్దిరోజులకు నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంచుకోవాలని నిర్ణయించింది. అయినా వారికీ భూములు లభ్యం కాకపోవడంతో మొదటివిడతలో పరిమిత సంఖ్యలో లబ్ధిదారులను ఎంపికచేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో ఆరుగురి నుంచి తొమ్మిది మందిని హైదరాబాద్‌లోని గోల్కొండకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు పంపాలని సీఎం ఆదేశించారు. మరోవైపు జిల్లాలోనూ భూ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించడంతో ఆగమేఘాలపై గురువారం రాత్రి నుంచి పొద్దుపొడిచే వరకూ క్షే త్రస్థాయి నుంచి ఉన్నతాధికారులు కసరత్తు వేగిరం చేశారు. నియోజకవర్గానికో గ్రామం పక్కనపెట్టి పట్టా భూములు ఎక్కడ లభిస్తే అక్కడే లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇలా 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేసి 122 మందిని గుర్తించారు. వీరికి 307. 57 ఎకరాలు అందించేందుకు రూ.8,42,69,741 వెచ్చించారు. ఇందులో ఆరు గ్రామాల్లో 53 మంది లబ్ధిదారులకు 117.71 ఎకరాల ప్రభుత్వభూమి, మిగిలిన 69 మందికి 10 గ్రామాల్లో 190 ఎకరాల పట్టా భూమిని రూ.8.42 కోట్లతో కొని లబ్ధిదారులకు అందించారు. మరోవైపు ఎంపిక చేసిన గ్రామాల్లో పట్టా భూములు ప్రభుత్వ ధరకు బేరం కుదరక పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. విడతలవారీగా భూ పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. సాగుయోగ్యమైన భూములు అమ్ముకోవడానికి రైతులెవరూ ముందుకు రావడం లేదు. భూములన్న చోట అర్హులు లేకపోవడం.. ప్రభుత్వ నిబంధనల కిరికిరి కొనసాగుతుండడంతో ఈ ప్రక్రియ ఎంతటితో సరిపెడతారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అభివృద్ధే నినాదం
‘రాష్ట్ర అవతరణతో మన బాధ్యత మరింత పెరిగింది. సుదీర్ఘ పోరాటాలు.. అమరుల త్యాగాల ఫలితంగా 29వ రాష్ట్రంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. కలిసికట్టుగా.. అభివృద్ధే నినాదంగా ముందుకుసాగాల్సిన సమయం ఆసన్నమైంది.. దీనికి ప్రతిఒక్కరం కలిసివద్దాం.. బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదాం..’ - ఈటెల రాజేందర్,రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ►బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం ►దసరా నుంచి కొత్త పింఛన్లు ►పటిష్టంగా పోలీసు వ్యవస్థ ►కాకతీయ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతాం ►గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ ►సమగ్రంగా కుటుంబ సర్వే ►స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల ముకరంపుర : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాకు వన్నెతెచ్చాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం చేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 200 మందికి ప్రశంసాపత్రాలు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. దళితులకు పట్టాలు అందించి మొదటివిడత భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రం గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు రూ.5.424కోట్లతో 7,444 పనులను గుర్తించాం. వాటికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాం. నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేసి అందులో గుర్తించిన లబ్ధిదారులకు భూమి ఇస్తాం. ఇందుకు ప్రభుత్వం రూ.ఐదు కోట్లు విడుదల చేసింది. రుణమాఫీతో ఐదు లక్షల మందికి లబ్ధి పంటరుణాలు మాఫీ చేయడం ద్వారా జిల్లాలో ఐదు లక్షలమందికి లబ్ధి చేకూరనుంది. దసరా నుంచి కొత్త పింఛన్లు ఇస్తాం. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ అందిస్తాం. దళిత, గిరిజన కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిల పెళ్లి ఖర్చులకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద రూ.50 వేల చొప్పున అందిస్తాం. గిరిజనతండాలను, గూడాలను పంచాయతీలుగా మారుస్తాం. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తాం. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలకు రవాణా పన్నును రద్దు చేశాం. గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన వారిని ఆదుకునేందుకు కేరళ తరహా ప్యాకేజీ అమలు చేస్తాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేశాం. మైనార్టీ కమిషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. ఆర్థిక స్థోమత లేక విద్యార్థులు చదువులకు దూరం కావద్దనే లక్ష్యంతో ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చాం. కరీంనగర్ చుట్టూ రింగురోడ్డు కరీంనగర్ నగరం చుట్టూ రింగురోడ్డు, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. జిల్లా పోలీస్ విభాగానికి అత్యాధునిక వాహనాలను అందించి వ్యవస్థను పటిష్టం చేస్తాం. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెడికల్ కాలేజీ, అనుబంధంగా ఆధునాత ఆసుపత్రిని నిర్మిస్తాం. అక్కడే మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం.జిల్లాకేంద్ర ఆసుపత్రిని నిమ్స్‌స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మంథని ఆసుపత్రిని వంద పడకలు, హుస్నాబాద్ ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించాం. కాకతీయ కెనాల్ సామర్థ్యం పెంచుతాం కాకతీయ కెనాల్ నీటి సామర్థ్యాన్ని 12వేల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు మధ్య మరో జలాశయం నిర్మిస్తాం. రాయికల్- బోర్నపల్లి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తాం. ఏడు కొత్త వ్యవసాయ మార్కెట్లు ప్రారంభిస్తాం. బతుకమ్మ నిమజ్జనం కోసం మానకొండూర్ చెరువును అభివృద్ధి చేస్తాం. కొండగట్టును ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు 300 ఎకరాల స్థలాన్ని గుర్తిస్తాం. హుజురాబాద్‌ను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేసి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. రామగుండం పట్టణానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరందిస్తాం. ఇంటి సర్వే ముఖ్యం ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వే చాలా ముఖ్యమైనది. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. ఆరోజు సెలవు ప్రకటించినందున ప్రజలు ఇంటివద్దనే ఉండి ఎన్యుమరేటర్లకు సమాచారం అందించాలి. ప్రాజెక్టుల పూర్తికి చర్యలు అసంపూర్తిగా ఉన్న మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేస్తాం. గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం. అదే సమయంలో తాగునీటికి కొరత లేకుండా చూస్తాం. తాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని పథకాలను సమన్వయం చేసి 160 టీఎంసీలతో గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. యంత్ర పరికరాలకు సబ్సిడీ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించేందుకు జిల్లాకు రూ.18.60 కోట్ల మంజూరు చేశాం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు బిందు, స్ప్రింక్లర్ల సేద్యానికి ప్రాధాన్యత నివ్వాలి. ఈ ఏడాది జిల్లాలో 3500 హెక్టార్లలో బిందు సేద్యం, 1208 హెక్టార్లలో తుంపర్ల సేద్యం లక్ష్యంగా పెట్టుకున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగే శోభ, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేశ్‌బాబు, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఐజీ నాయక్, ఎస్పీ శివకుమార్ , అదనపు ఎస్పీ జనార్దన్, డీఎస్పీ రవీందర్, ఏజేసీ నంబయ్య, డీఆర్వో వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.