
'సాక్షి' ఎఫెక్ట్ : ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎస్సారెస్పీ వరద కాలువకు శనివారం నీటిని విడుదల చేశారు. చరిత్రలో తొలిసారి నిబంధనలకు విరుద్ధంగా వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో.. 25 వేల ఎకరాల పంటలకు ప్రయోజనం కలగనుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆశలు, ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తీరు మారాలన్నారు. ప్రతిపక్షాలు సూచనలు చేయాలి కానీ ప్రతి పనికి అడ్డుపడటం సరికాదని హితవు పలికారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు నెలకు రూ. వెయ్యి పెన్షన్ అందజేయనున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై 'సాక్షి'లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.