మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈటెల
Published Sat, Sep 17 2016 3:20 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాద బాధితులను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. సంఘటన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement